అసలు ప్లాబ్లం ఇప్పుడు స్టార్టయింది
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీకి అంతర్గత రగడలు పెరిగిపోవడం మరింత తలనొప్పులు తెస్తోంది. జిల్లాకో సమస్య ఇప్పుడు పార్టీలో తెరమీదికి వస్తోంది. [more]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీకి అంతర్గత రగడలు పెరిగిపోవడం మరింత తలనొప్పులు తెస్తోంది. జిల్లాకో సమస్య ఇప్పుడు పార్టీలో తెరమీదికి వస్తోంది. [more]
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీకి అంతర్గత రగడలు పెరిగిపోవడం మరింత తలనొప్పులు తెస్తోంది. జిల్లాకో సమస్య ఇప్పుడు పార్టీలో తెరమీదికి వస్తోంది. విషయంలోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి ఇప్పుడు చాలా వరకు స్తబ్దుగా మారింది. ఎన్నికలకు ముందున్న పరిస్థితి, ఉత్సాహం వంటివి ఇప్పుడు నాయకుల్లో కనిపించడం లేదు. 2014లో ఆశించిన విధంగా దూకుడు ప్రదర్శించిన పార్టీ 2019 ఎన్నికల్లో జగన్ సునామీతో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో 2014 ఎన్నికల్లో వైసీపీని కేవలం రెండు సీట్లకు పరిమితం చేసిన టీడీపీ తాజా ఎన్నికల్లో చివరకు రెండు సీట్లతో సరిపెట్టుకుంది. కంచుకోట హిందూపురం వదిలేస్తే…. ఒకే ఒక్క పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి విజయం సాధించారు. మిగిలిన వారంతా ఓటమి బాటపట్టారు.
వారసులు ఓటమితో…..
అయితే, జిల్లాలో కీలకమైన నాయకులుగా ఉన్న వారు సైతం ఇప్పుడు ఓటమి తర్వాత టీడీపీని నడిపించేందుకు సైతం ముందుకు రాని పరిస్థితి నెలకొంది. జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఇద్దరు యువ నాయకులను ఇటీవల ఎన్నికల్లో రంగంలోకి దింపారు. ఈ ఇద్దరూ గెలుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే , జగన్ సునామీ ముందు వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. ఇక, జిల్లాలో కీలకమైన పరిటాల ఫ్యామిలీ నుంచి కూడా పరిటాల శ్రీరామ్ రంగంలోకి దిగారు. ఈయన కూడా గెలుస్తారనే అంచనాలు భారీగా వచ్చాయి. ఒక్క రాఫ్తాడు సీటుపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోట్లాది రూపాయాల పందేలు కూడా కట్టారు. అయితే శ్రీరామ్‌కు తొలి ఎన్నికల్లోనే శృంగభంగం తప్పలేదు.
ఒక్కొక్కరూ..ఒక్కొక్క రకంగా…
అదే సమయంలో పార్టీకి నిన్న మొన్నటి వరకు అండగా ఉన్న వరదాపురం సూరి తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ధర్మవరం లాంటి సంక్లిష్టమైన నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న సూరి పార్టీని వీడడం టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బలాంటిదే. ఇక ఇప్పుడు అక్కడ కూడా పరిటాల ఫ్యామిలీకే బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. జిల్లాలో టీడీపీకి కీలకంగా ఉంటారని భావించిన నాయకులు ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో పార్టీని పక్క పెట్టేశారు. జేసీ వర్గం కూడా వైసీపీ వైపు అడుగులు వేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఈ విషయంలో అటు బీజేపీలోకి వెళ్లాలా? లేక వైసీపీనా అనే సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది.
పరిటాల పూర్తిగా….
ఇక, పరిటాల ఫ్యామిలీ ఇప్పటి వరకు టీడీపీ గురించి మాట్లాడింది కూడా లేదు. కనీసం చంద్రబాబును పలకరించిన పాపాన కూడా పోలేదు. ధర్మవరంలో పార్టీని ముందుకు నడిపించేందుకు మాత్రమే బాబు ఓ సారి అక్కడ పర్యటించి పరిటాల ఫ్యామిలీకి పగ్గాలు ఇస్తున్నట్టు చెప్పి మమ అనిపించేశారు. దీంతో జిల్లాలో పార్టీని నడిపించేవారు.. కార్యకర్తల్లో మనో ధైర్యం నింపేవారు కూడా కరువయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీనియర్ అయిన పయ్యావుల గెలిచినా ఆయన అసెంబ్లీ వరకు ప్రతిపక్షానికి బాగానే కౌంటర్ ఇస్తున్నారే తప్ప జిల్లాలో పార్టీని ముందుకు నడిపించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. పరిటాల మాటను ఇక్కడ పట్టించుకునే వారే లేరు. ఈ నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ కంచుకోటలో పార్టీని ఎలా ? ముందుకు నడిపిస్తారో ? చూడాలి.