టీడీపీ నేతల లబోదిబో.. బాబు హ్యాండిస్తున్నారట
టీడీపీలో నేతల మధ్య తీవ్ర దుమారం చెలరేగుతోంది. పార్టీ కోసం తాము ఎంతో చేసినా పార్టీ తమకు ఏం చేస్తోందనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. కీలక సమయంలో [more]
టీడీపీలో నేతల మధ్య తీవ్ర దుమారం చెలరేగుతోంది. పార్టీ కోసం తాము ఎంతో చేసినా పార్టీ తమకు ఏం చేస్తోందనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. కీలక సమయంలో [more]
టీడీపీలో నేతల మధ్య తీవ్ర దుమారం చెలరేగుతోంది. పార్టీ కోసం తాము ఎంతో చేసినా పార్టీ తమకు ఏం చేస్తోందనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. కీలక సమయంలో పార్టీ హ్యాండిస్తోందనే వాదన కూడా ప్రబలుతోంది. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుండడం, అయినా కూడా చంద్రబాబు కానీ, చినబాబు లోకేష్ కానీ, ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి పరిణామాలు మరింతగా నేతలకు మంట పుట్టిస్తున్నాయి. పార్టీకి తాము అన్ని రకాలుగా కృషి చేసి నిలబెట్టామని, అయితే, ఇప్పుడు తాము చిక్కుల్లో ఉంటే మాత్రం పట్టించుకోవడం లేదని నాయకులు వాపోతున్నారు.
అక్రమ కేసులు పెడుతున్నా…..
అంతేకాదు, ఎంతో మంది నాయకులు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంటే కేవలం ఒకరిద్దరి తరఫున మాత్రమే పార్టీ అధ్యక్షుడు కానీ, నెంబర్ 2, 3, 4లు కానీ మద్దతుగా మాట్లాడడం ఏంటని కూడా వాపోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే, ఆ తర్వాత రాజకీయ కారణాలతో కొందరు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరికొందరిపై గనుల శాఖ నుంచి దాడులు జరుగుతున్నాయి. భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. ఇంకొందరిపై గతంలో అవినీతి కి పాల్పడ్డారంటూ.. విచారణలు సాగుతున్నాయి.
ప్రతి జిల్లాలోనూ.. అందరిపైనా….
ఈ పరిణామాలతో టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ కనిపిస్తోంది. శ్రీకాకుళంలో ఉద్యోగిని దూషించారంటూ.. మాజీ విప్ కూన రవి కుమార్ పై పోలీసులు కేసు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇక, మాజీ మంత్రి అచ్చెన్నపై ఈఎస్ఐ మందుల కుంభకోణంలో విచారణకు రెడీ అవుతున్నారు. అదేసమయంలో మాజీ మంత్రి పితానిపైనా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇక, ప్రకాశంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపైనే గనుల శాఖ 300 కోట్ల జరిమానా విధించింది. ఇక, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరణం బలరాంపై కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ఒకటి రెండు చోట్ల కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతల పరిస్థితి ఇలానే ఉంది.
కొందరి పక్షానే నిలుస్తూ…..
అయితే, పార్టీ పరంగా మాత్రం కేవలం అచ్చెన్న, కూన రవి.. గొట్టిపాటి వంటి వారికి మాత్రమే మద్దతు లభిస్తుండడం, మిగిలిన వారిని ఏకాకులను చేయడంతో వారంతా ఆలోచనలో పడ్డారు. తాము పార్టీలో సభ్యులం కాదా? తమకు పార్టీ నుంచి మద్దతు ఉండదా? అని అంటున్నారు. ఇదే విధానం కొనసాగితే తాము కూడా పార్టీ మారిపోక తప్పదని అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఎమ్మెల్యేలు వంశీ, గిరిలు పార్టీ మారిపోయిన ఉదంతాలను వారు తెరమీదికి తెస్తున్నారు. మరి ఈ పరిస్థితిలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.