వరదాపురం సూరి బాటలో టీడీపీ కీలక నేత… నిజమేనట
అనంతపురం రాజకీయాల్లో టీడీపీది ఓ ప్రత్యేక స్థానం. ఇక్కడ నుంచి కీలక నాయకులు టీడీపీకి ప్రాధాన్యం వహించారు. కీలకమైన నియోజకవర్గాలు సైతం పార్టీ కంచుకోటలుగా ఉన్నాయి. అయితే, [more]
అనంతపురం రాజకీయాల్లో టీడీపీది ఓ ప్రత్యేక స్థానం. ఇక్కడ నుంచి కీలక నాయకులు టీడీపీకి ప్రాధాన్యం వహించారు. కీలకమైన నియోజకవర్గాలు సైతం పార్టీ కంచుకోటలుగా ఉన్నాయి. అయితే, [more]
అనంతపురం రాజకీయాల్లో టీడీపీది ఓ ప్రత్యేక స్థానం. ఇక్కడ నుంచి కీలక నాయకులు టీడీపీకి ప్రాధాన్యం వహించారు. కీలకమైన నియోజకవర్గాలు సైతం పార్టీ కంచుకోటలుగా ఉన్నాయి. అయితే, నేతల మధ్య మాత్రం సఖ్యత కొరవడుతోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడంతో గడిచిన ఐదేళ్ల కాలంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. జిల్లాలో పార్టీ బలపడిన తీరు కంటే.. పార్టీలో విభేదాలు పెంచుకున్న పరిణామమే మనకు కనిపిస్తుంది. దీంతో పార్టీలో కీలక కేడర్ అంతా కూడా ఇప్పుడు చెల్లా చెదురయ్యిందనే అనాలి. అందుకే 2004, 2009లో పార్టీ ఓడిపోయినప్పుడు కూడా జిల్లాలో ఆరు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన టీడీపీ మొన్న ఎన్నికల్లో కేవలంరెండు సీట్లతో సరిపెట్టుకుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో పార్టీలో దూకుడుగా ఉన్న నాయకులకు, ఆధిపత్య రాజకీయాలు చేసిన నేతలకు చంద్రబాబు ముకుతాడు వేయలేకపోయారు. పైగా వారినే ప్రోత్సహించారు.
ఇప్పటికే వరదాపురం సూరి….
ఇక, ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. అయినా..కీలక నేతలుగా ఉన్నవారికి, పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారికి కూడా ప్రాధాన్యం కనిపించడం లేదు. దీంతో చాలా మంది నాయకులు తమ దారి తాము చూసుకున్నారు. వీరిలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వురఫ్ వరదాపురం సూరి వంటి వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా చంద్రబాబు ఆయనను ఆపిన పాపాన పోలేదు. పోనీ.. ఆ తర్వాత అయినా.. జిల్లా రాజకీయాలపై పట్టు సాధించే ప్రయత్నం కూడా బాబు నుంచి కనిపించలేదు. ఈ పరిణామం ఇప్పుడు మరింత మంది పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు కారణంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వారి ఆధిపత్యంలో నలిగిపోతున్న ఓ మాజీ ఎమ్మెల్యే.. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని అంటున్నారు.
జేసీ బ్రదర్స్ తో ఇబ్బందులతో….
పార్టీలో కీలక నేతగా ఉన్న అనంతపురం అర్బన్‌కు చెందిన ప్రభాకరచౌదరి 2014లో విజయం సాధించారు. టీడీపీలో ఆయన సుదీర్ఘకాలం నుంచి ఉంటున్నారు. గతంలో అనంతపురం మునిసిపల్ చైర్మన్‌గా పనిచేయడంతో పాటు అవే అనే స్వచ్చంద సంస్థ కూడా స్థాపించారు. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా .. చంద్రబాబు ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలుపు నిచ్చినా.. ముందుండే వారు. అయితే, కొన్నాళ్లుగా జేసీ బ్రదర్స్‌తో ఆయనకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేవారు. వీరి మధ్య చాన్నాళ్లు ఆధిపత్య రాజకీయాలు కూడా సాగాయి. ఇక, ఇప్పుడు అవి మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిష్కరించాలని చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టినా.. ఆయన పట్టించుకోలేదు.
పంచాయతీ ఒగదెగక….
ఇక ఐదేళ్ల పాటు అనంతపురం నియోజకవర్గంలో ఎంపీగా ఉన్న జేసీ పదే పదే వేలు పెట్టడంతో పాటు ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరిని తన వర్గంతో తీవ్ర ఇబ్బందులు పెట్టారు. దీంతో ఇప్పుడు ఆయన వారసుడు పవన్ సైతం జిల్లా కేంద్రం కావడంతో నా వర్గం బలంగా ఉండాలంటూ అనంత రాజకీయాలపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా ఈ సీటును వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలన్న కొత్త డిమాండ్ కూడా తెరమీదకు తెస్తున్నారు. ఈ లోగా వరదాపురం సూరి బీజేపీలోకి చేరిపోయారు. ఇప్పుడు ఆయన పిలుపుతో ప్రభాకరచౌదరి కూడా వెళ్లేందుకు, కాషాయ కండువా కప్పుకొనేందుకు రెడీ అయ్యారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయంపై అనంత టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. మరి ఏంజరుగుతుందో ?చూడాలి.