నాడు డమ్మీగా ఉన్న నేతలే ఇప్పుడు హీరోలు
పరిస్థితి పామైనప్పుడు.. దొరికిందే దారి అన్నట్టుగా ఉంది టీడీపీ పరిస్థితి. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు తమ్ముళ్లు. జిల్లాలో ఒకప్పుడు [more]
పరిస్థితి పామైనప్పుడు.. దొరికిందే దారి అన్నట్టుగా ఉంది టీడీపీ పరిస్థితి. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు తమ్ముళ్లు. జిల్లాలో ఒకప్పుడు [more]
పరిస్థితి పామైనప్పుడు.. దొరికిందే దారి అన్నట్టుగా ఉంది టీడీపీ పరిస్థితి. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు తమ్ముళ్లు. జిల్లాలో ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన నాయకులు సైలెంట్ అయ్యారు. ఒకప్పుడు డమ్మీలుగా ఉన్న నేతలు.. ఇప్పుడు హీరోలుగా వెలుగు వెలుగు తున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీలో టాక్ అయింది. బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ వంటివారికి గతంలో ప్రాధాన్యం లేదని తమ్ముళ్లే చెబుతున్న మాట. ఒకప్పుడు వీరు చంద్రబాబు ముఖం చూసేందుకు క్యూ కట్టేవారు.
తన టాలెంట్ తో పదవిని….
అంతేకాదు.. బుద్దా వెంకన్న వంటి వారు ఏకంగా కొందరితో సిఫారసులు చేయించుకుని పార్టీలో పదవులు తెచ్చుకున్నారనే టాక్ ఉంది. వెంకన్నకు ఎమ్మెల్సీ రావడానికి నాడు జిల్లాలో కొందరు సీనియర్లు కూడా కలిసిరాని పరిస్థితి. ఎన్నో అష్టకష్టాలు పడి మరీ వెంకన్న తన టాలెంట్‌తోనే ఎమ్మెల్సీ సీటు తెచ్చుకున్నారు. అయితే, మారిన రాజకీయ పరిస్థితులు వీరిని నిలబెట్టాయి. పార్టీ పరిస్తితి నానాటికీ తీసికట్టుగా మారడం, ఎవరికి వారే యమునా తీరే అన్నవిధంగా పరిస్థితి మారిపోవడం వంటి పరిణామాలతో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అదేసమయంలో చంద్రబాబు ఎవరినైతే నమ్ముకున్నారో.. వారే పార్టీనివీడి పోవడం, కొందరు గ్రూపులు కట్టడం, మరికొందరు ఉదాసీనంగా వ్యవహరించడంతో పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది.
వీరే పార్టీని నడిపిస్తూ…..
ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న బచ్చుల అర్జునుడు, విజయవాడ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ రాజేంద్ర వంటివారు ఇటీవల కాలంలో గళం విప్పుతున్నారు. ఒకప్పుడు వీరు మీడియా సమావేశాల్లో చివరి వరుసలో కూర్చునే వారని, కనీసం వీరి వాయిస్ వినేందుకు పార్టీలోనే ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని సీనియర్లు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు వీరే పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ తరఫున బలమైన గళం వినిపిస్తున్నారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
వాళ్లే ఇప్పుడు ఆసరాగా…..
అంతేకాదు, చంద్రబాబుకూడా వీరిని ప్రోత్సహిస్తుండడంతో బలమైన నాయకులుగా కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వీరు ఏమేరకు బలం పుంజుకుంటారు? ఏమేరకు పార్టీని నిలబెడతారనేది ప్రధాన సమస్య. వీరిలో ఓ నాయకుడు మాత్రం తాము ఇప్పుడు ఎంత కష్టపడినా రేపటి వేళ పార్టీ అధికారంలోకి రాగానే ఐదేళ్లు తెరవెనక ఉన్నవారు.. ఇళ్లల్లో కూర్చున్న వారే అప్పుడు పెత్తనం చక్క పెడతారని పెదవి విరచడం కొసమెరుపు.