ఇక్కడ టీడీపీ జీరోనేనట.. భవిష్యత్తులోనూ?

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాను కైవసం చేసుకుంటామని చెప్పింది. పులివెందులకు నీళ్లు ఇచ్చింది తామే అని ప్రకటించుకుంది. అయితే ఇప్పడు కడప జిల్లాలో ఏ [more]

Update: 2020-06-12 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాను కైవసం చేసుకుంటామని చెప్పింది. పులివెందులకు నీళ్లు ఇచ్చింది తామే అని ప్రకటించుకుంది. అయితే ఇప్పడు కడప జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ గట్టిగా నిలబడే నేత కరువయ్యారు. ఉన్న నేతలు పార్టీని వీడి వెళ్లడంతో నియోజకవర్గాల్లో పార్టీ పగ్గాలు చేపట్టే వారే కరవయ్యారు. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో పార్టీకి నేత దొరకడం కష్టంగా మారింది. ఇటీవల కడప జిల్లా నేతలతో చంద్రబాబు మాట్లాడినా జెండా మోసేందుకు ఎవరూ ఉత్సాహం చూపకపోవడం విశేషం.

పులివెందుల నియోజకవర్గంలో….

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం తీసుకుంటే అక్కడ దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తున్న సతీష్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన స్థానంలో బీటెక్ రవిని ఇన్ ఛార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీటెక్ రవి సయితం పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన పులివెందుల ఇన్ ఛార్జి పదవి తీసుకోవడానికే తొలుత విముఖత వ్యక్తం చేసినా బలవంతంగా తీసుకున్నారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో…..

పైగా ఇటీవల పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో జగన్ ను బీటెక్ రవి సమర్థించారు. ఇక జమ్మలమడుగు నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ టీడీపీ జెండా భవిష్యత్తులో కనపడటం కష్టంగానే కన్పిస్తుంది. టీడీపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్లిపోయారు. టీడీపీ లో ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నామినేషన్లు కూడా వేయలేకపోయింది. ఇక్కడ ఇన్ ఛార్జి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నేతలను సంప్రదించినా ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం.

పార్టీ జెండా పట్టుకోవడానికే…?

ఇప్పటికే కడప జిల్లాలో ముఖ్యమైన నేతలందరూ ఇతర పార్టీలకు వెళ్లడం, ఉన్న నేతలు కూడా బయటకు రాకపోతుండటంతో కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా పరిస్థితి తయారయింది. అనేక మంది ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. కరోనా కారణంగా బయటకు రాలేదని నేతలు చెబుతున్నప్పటికీ భవిష‌్యత్ లో పార్టీ జెండాను మోసే వారు కనపడరన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. మొత్తం మీద కడప జిల్లాలో టీడీపీ జీరో స్థాయికి పడిపోయిందనే చెప్పాలి.

Tags:    

Similar News