తప్పు చేయనప్పుడు భయమెందుకు బాబూ?

తాము అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోండి. ఏ విచారణకైనా సిద్ధమని పదే పదే ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న [more]

Update: 2020-09-07 09:30 GMT

తాము అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోండి. ఏ విచారణకైనా సిద్ధమని పదే పదే ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని మిగిలిన రాజకీయ పక్షాలు, మేధావులు సయితం తప్పుపడుతున్నారు.

ఏ విచారణకైనా సిద్ధమంటూ…..

గత చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని జగన్ ప్రభుత్వం బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి చెబుతూ వస్తుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని బయటపెట్టి ప్రజల ముందు దోషిగా నిలబెడతామని ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఈ క్రమంలోనే అమరావతి రాజధాని భూముల వ్యవహారంపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించింది. ఆ విచారణలో 4,500 ఎకరాలు రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్దయెత్తున భూములను కొనుగోలు చేశారని తేల్చింది.

ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో….

టీడీపీ అధినేత చంద్రబాబు సయితం తొలి నుంచి తాము ఏవిచారణకైనా సిద్ధమని ప్రకటిస్తూ వస్తున్నారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ప్రభుత్వం తమపై బురద జల్లేందుకే విచారణల పేరుతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వీటిని పట్టించుకోని ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టులు వంటి వాటిపై సమీక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జీవో నెంబరు 1411 ను జారీ చేసింది. దీంతో పాటు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది.

హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ…..

అయితే ఈ జీవోపై తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు వేర్వేరు పిటీషన్లతో హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటకు వస్తుందన్న భయంతోనే టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారా? అన్న అనుమానం అందరికీ కలగక మానదు. ఎలాంటి తప్పు చేయనప్పుడు, ఏ విచారణకైనా సిద్ధమని చెప్పినప్పుడు ఇక ప్రభుత్వం ఆదేశించిన విచారణపై హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరమేముందన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

Tags:    

Similar News