తమ్ముళ్ల ఫీలింగ్ ఇదేనట
టీడీపీలో అసంతృప్తులు తగ్గడం లేదు. నిత్యం ఒకరికన్నా ఎక్కువ మందే టీడీపీ అనుసరిస్తున్న వైఖరితో నాయకులు కుంగిపోతు న్నారు. ఇది నిజం కూడా! పైకి ఏమీలేదని చెబుతున్నా.. [more]
టీడీపీలో అసంతృప్తులు తగ్గడం లేదు. నిత్యం ఒకరికన్నా ఎక్కువ మందే టీడీపీ అనుసరిస్తున్న వైఖరితో నాయకులు కుంగిపోతు న్నారు. ఇది నిజం కూడా! పైకి ఏమీలేదని చెబుతున్నా.. [more]
టీడీపీలో అసంతృప్తులు తగ్గడం లేదు. నిత్యం ఒకరికన్నా ఎక్కువ మందే టీడీపీ అనుసరిస్తున్న వైఖరితో నాయకులు కుంగిపోతు న్నారు. ఇది నిజం కూడా! పైకి ఏమీలేదని చెబుతున్నా.. లోలోన మాత్రం తీవ్ర అసంతృప్తితోనే నాయకులు కాలం గడుపుతున్నారు. విధిలేని పరిస్థితిలోనే ఇంకా టీడీపీ సైకిల్‌పై కూర్చున్నామని చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి ఈ అసంతృప్తికి రీజన్ ఏంటి ? చంద్రబాబు గతంలో అనుసరించిన విధానమేనా ? తమకు పదవులు ఇవ్వడంలో ఆయన చూపించిన వివక్షేనా ? అంతకు మించి ఏదైనా ఉందా ? ఇప్పుడు ఇదే ప్రశ్న మేధావులను కూడా ఆలోచింప జేస్తోంది.
ఇప్పుడు ఏం చేయగలరు?
గతంలో ఏదో జరిగిపోయింది. ఇప్పుడు అనుకుని కూడా ప్రయోజనం లేదు. అప్పట్లో పదవులు ఇవ్వలేదు కాబట్టి.. ఇప్పడు అలుగుతామంటే.. దీనిలో అర్ధం లేదు. నిజానికి అలా ఎవరూ కూడా అనుకోరు కూడా! ఇది పిల్ల వ్యవహారం మాదిరిగా ఉంటుంది. అంత పెద్ద పార్టీలో గతాన్ని తలుచుకుని ఎవరూ వగచేవారు ఉంటారని అనుకోలేం. మరి ప్రస్తుత నేతలకు ఎందుకు అసంతృప్తి ? ఎందుకు టీడీపీలో చలాకీగా ఉండడం లేదు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు తాజాగా అందిన సమాధానాలు.. అధినేత తమను పట్టించుకోకపోవడం. అదేంటి? ఇప్పుడు ఆయన అధికారంలో లేరు. పైగా ఘోరాతి ఘోరంగా 23 సీట్లకే పరిమితమయ్యారు. మరో పక్క జగన్ ఆడేసుకుంటున్నాడు. కదా? ఇప్పుడు ఆయన ఎవరికి మాత్రం ఏం చేయగలరు?
రక్షణ లేకుండా పోవడంతో…
ఈ ప్రశ్న సర్వసాధారణం. అయితే, ఇప్పుడు చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నది చంద్రబాబు అండ కోసం! అవును నిజంగానే ఆయన వారికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు. అనంతపురం నుంచి ఆకివీడు వరకు, శింగనమల నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీ నేతలపై కేసులు నమోదువుతున్నాయి. ముఖ్యంగా అక్రమాల పేరుతో జగన్ ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. ఆస్తులను కూలగొడుతోంది. భూకబ్జాలపై కేసులు నమోదు చేస్తోంది. అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఒకరిద్దరు టీడీపీ సీనియర్లను టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రక్షణ లేకుండా పోయిందని అంటున్న తమ్ముళ్ల సంఖ్య పెరుగుతోంది.
వరస కేసులతో….
నెల్లూరులో బీద సోదరులు, విశాఖలో గంటా శ్రీనివాసరావు, గుంటూరులో కోడెల కుటంబం, కర్నూలులో భూమా ఫ్యామిలీ, (అన్న క్యాంటీన్లకు వ్యతిరేకంగా మాజీ మంత్రి అఖిల ప్రియ నిర్వహించిన ర్యాలీపై పోలీసులు కేసులు నమోదు చేశారు).. ఇక, తిరుపతిలో కీలక నాయకుడి ఇంటిని అక్కడి మునిసిపల్ అధికారులు కూలగొట్టారు. ఇక, విశాఖలో ఏకంగా టీడీపీ కార్యాలయానికే నోటీసులు అందాయి. అయితే, హైకోర్టు జోక్యంతో ఆగింది. ఇక, గంటా ఇంటిని కూలగొట్టేందుకు జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. కోడెల మెడపై అక్రమాల కేసులు వేలాడుతున్నాయి. ఇక, గుంటూరుకే చెందిన యరపతినేని వంటి వారిపై అక్రమ మైనింగ్ భూతం వెంటాడుతోంది.
కష్టాల్లో ఉన్నా కూడా….
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి కుమారుడు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా భార్యపై భూకబ్జా కేసు.. పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్‌పై మైనార్టీలే తమ సొమ్మును దోచారనే ఆరోపణలు.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో టీడీపీ నాయకులు కేసుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ సమయంలో వారిలో భరోసా నింపే ప్రయత్నం, వారి తరఫున మాట్లాడేందుకు కూడా చంద్రబాబు ఇప్పటి వరకు కార్యాచరణతో ముందుకు రాలేదు. దీంతో వీరంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
బీజేపీ ఆఫర్ తో…..
టీడీపీ ఓడినందుకు పెద్దగా ఫీల్‌కాని నేతలు కూడా ఇప్పుడు పార్టీ అధినేత తమను పట్టించుకోవడం లేదని తెగ బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరంతా అసంతృప్తితో కాలం గడుపుతున్నారు. ఇవన్నీ ఇలా.. మీకెందుకు మా జెండా కప్పుకోండి.. కేసుల సంగతి మేం చూసుకుంటాం.. అంటూ.. బీజేపీ నేతలు నిత్యం ఫోన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ నేపథ్యంలో జంపింగ్‌లు తప్ప వారికి ఉన్న ఆప్షనేంటి? బాబు ఇచ్చే భరోసా ఏంటి? మరి ఈ వేడి ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.