ఆ ఫిగర్ బాబును కలచివేస్తుందే ?

చి చి జీవితంలో ఇంత ఘోరపరాభవం ఎప్పుడు చూడలేదు. మరీ దారుణంగా 23 మందిని గెలిపించడమా ? ఏమి తప్పు చేసాం. ఇంత శిక్ష వేసేసారు. పాలిచ్చే [more]

Update: 2019-08-10 04:09 GMT

చి చి జీవితంలో ఇంత ఘోరపరాభవం ఎప్పుడు చూడలేదు. మరీ దారుణంగా 23 మందిని గెలిపించడమా ? ఏమి తప్పు చేసాం. ఇంత శిక్ష వేసేసారు. పాలిచ్చే ఆవును వదులుకుని దున్నతో తన్నించుకుంటున్నారు. ఇలా రకరకాల కామెంట్లతో నిత్యం తన బాధను, ఆక్రోశాన్ని, ఆవేదనను, ఆందోళనను ఎదో ఒక వేదికపై వ్యక్తం చేయడమే పనిగా పెట్టుకున్నారు ఎపి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. ఫలితాలు వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా ఆ ఓటమి తెచ్చిన వేదన నుంచి బయటకు రాలేక నిస్తేజం లో కూరుకుపోతున్నారు. క్యాడర్ కి ధైర్యం చెప్పి క్యాడర్ ను ముందుకు నడిపించాలిసిన అధినేత తీరు ఇప్పుడు ఎపి టిడిపి లో మరో ఆందోళనకు కారణంగా మారిపోతుంది.

తెచ్చుకున్న ధైర్యాన్ని చంపేస్తున్నారా ?

ఎపి కానీ తెలంగాణ లో కానీ టిడిపి కి వున్న బలమైన క్యాడర్ ఏ పార్టీకి లేదు. దాదాపు నాలుగు దశాబ్దాల పార్టీ చరిత్రలో గెలుపు ఓటములు ఎన్నో ఆపార్టీ చవిచూసింది. అయితే ఎప్పుడు ఇంతటి నైరాశ్యం అభద్రత అధినాయకత్వంలో క్యాడర్ ఎప్పుడు చూడలేదు ఇప్పుడిప్పుడే కొద్ది గా ధైర్యం చేసుకుని ప్రజల్లోకి వస్తుంటే తమ అధినేత వ్యాఖ్యలు మరింత బాధిస్తున్నాయి వారిని. ఓటమిపై నిజమైన ఆత్మవిమర్శ వదిలిపెట్టి ప్రజలదే ఈ తప్పంతా అనే రీతిలో మాట్లాడటం పసుపు పార్టీ లో ఆందోళనగా మారింది. ప్రజలు మార్పు కోరుకుంటారని అదే ప్రభుత్వం కొనసాగాలంటే అద్భుత పాలన అందించాలని ఆఫ్ ది రికార్డ్ లో చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి పాలన చేపట్టిన చంద్రబాబు 99 లో తిరిగి అధికారంలోకి రావడానికి ఆయన అప్పుడు చేసిన పాలనకు ప్రజలు ఫిదా కావడమే అంటున్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు అపవాదు ఎదుర్కొన్నా జనం చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ కి జై కొట్టారని గుర్తు చేస్తున్నారు. అయితే 2014 నుంచి 2019 వరకు నిర్వహించిన పాలనను గతంలో ముఖ్యమంత్రిగా బాబు చేసిన పాలన బేరీజు వేసుకుంటే ఆయనకు లోపం ఎక్కడో తెలుస్తుందని అంటున్నారు.

ఆయన బాధ అంతా అదే …

ఓడిపోయినా గౌరవ ప్రదమైన పరాజయం లభించివుంటే బావుండేదని చంద్రబాబు బాధగా కనిపిస్తుంది. ఒక ఎమ్యెల్సీ సీటు కాని, ఒక రాజ్యసభ సీటు కూడా దక్కించుకోలేని ఫిగర్ ను ప్రజలు కట్టబెట్టడంతో రాబోయే రోజుల్లో పార్టీలోని నేతలను సంతృప్తి పరచడం కష్టమే అన్నది ఆయన ఆందోళన గా తెలుస్తుంది. నెంబర్ గేమ్ లో మరీ ఇంత వెనుకబాటు కారణంగా పార్టీలో మిగిలిన అరకొర పాతకాపులు కూడా జారిపోతారేమో అని భవిష్యత్తు ముందే అంచనా వేస్తున్న చంద్రబాబు కు తరచూ ఘోరఓటమి చుట్టూనే చర్చలు సాగించే పరిస్థితి తెచ్చిపెట్టింది. అదీగాక జాతీయ స్థాయి నేతగా గుర్తింపు వున్న చంద్రబాబు కు ప్రధాని మోడీ, విపక్ష నేత సోనియా మొదలు మమతాబెనర్జీ వరకు విపక్ష నేతలకు ముఖం చూపించుకోవడం అవమానంగా తోస్తుంది. ముఖ్యంగా తనముందే ఎదిగిన కెసిఆర్ తన అనుభవం అంత వయసులేని జగన్ మోహన్ రెడ్డి ముందు మరింత సిగ్గుగా తయారయ్యింది. చూశారా మీ నెంబర్ అంటూ వైసిపి చేస్తున్న ఎగతాళి ని బాబు భరించలేకపోతున్నారు. దాంతో ఈ ట్రాన్స్ నుంచి బాబు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు, మానసిక విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

Tags:    

Similar News