పార్టీలో…. బాబు కొత్త స్ట్రాటజీ…!!

గతానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ దారుణంగా చతికిలపడింది. పార్టీ మళ్ళీ బతికి బట్ట కడుతుందా అన్న సందేహాలు పార్టీ లోపలా బయటా కూడా కలుగుతున్నాయి. ఈ నేపధ్యంలో [more]

Update: 2019-07-06 14:30 GMT

గతానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ దారుణంగా చతికిలపడింది. పార్టీ మళ్ళీ బతికి బట్ట కడుతుందా అన్న సందేహాలు పార్టీ లోపలా బయటా కూడా కలుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీ ని కాపడుకోవడానికి చంద్రబాబు తన వరకు తాను గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీయార్ బ్లడ్ కి తిరిగి పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అన్న గారి మీద తెలుగు జనాలకు ఉన్న అభిమానం వేరు. నారా ఫ్యామిలీ అంటే జనంలో పెద్దగా వూపు రాదు. ఈ కారణంగానే బాలకృష్ణ ను పార్టీలో బాగా ప్రమోట్ చేయాలని బాబు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ జూనియర్ ఎన్టీయార్ నో తెచ్చి పెట్టుకుని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కన్నా ఉన్నంతలో బాలయ్యనే గట్టిగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని బాబు భావిస్తున్నారుట.

నాడు అలా వదిలేశారు…..

ఎటూ బాలకృష్ణ ఎన్టీయార్ కుమారుడు. సినీ హీరో ఆ ఇమేజ్ అలాగే ఉంటుంది. నిజానికి ఇంతకాలం బాలయ్యకి పార్టీలో ఎటువంటి ప్రాముఖ్యత లేదన్న సంగతి తెలిసిందే. ఆయన హిందూపురం నుంచి గెలిచి వచ్చినా కూడా కనీసం మంత్రిగా కూడా చంద్రబాబు చేయలేదు. ఇది పార్టీలో ఉన్న నందమూరి అభిమానులను బాగా బాధించింది. సామాన్య జనంలోనూ అన్న గారి కుటుంబానికి టీడీపీలో అవకాశాలు లేవన్నది అర్ధమయిపోయింది. ఈ క్రమంలోనే బాలయ్యకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారుట. అదే విధంగా బాలయ్యకు రాయలసీమలో మంచి ఆదరణ ఉంది.

రాయలసీమ బాధ్యతలు….

అందువల్ల రాయలసీమ రీజియన్ బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నరుట. తాజా ఎన్నికల్లో రాయసీమలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లకు గానూ మూడంటే మూడు సీట్లు టీడీపీకి వచ్చాయి. ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోవాలనుకుంటున్న నాయకులను పార్టీలో ఉండేలా చేసే బాధ్యత కూడా బాలకృష్ణ కు అప్పగించారని తెలుస్తోంది. దీంతో బాలయ్య స్వయంగా జోక్యం చేసుకుని పరిటాల కుటుంబం పార్టీలో ఉండేలా ఒప్పించారని అంటున్నారు. హిందూపురం నుంచే జగన్ సర్కార్ మీద బాలయ్య విరుచుకుపడడానికి కూడా ఇదే కారణమని చెబుతున్నారు. రానున్న రోజుల్లో పార్టీలో బాలయ్య ప్రాధాన్యత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఆయన్ని పొలిట్ బ్యూరోలోకి కూడా తీసుకుని ఇకపై పార్టీలో ముందుంచి కధ బాబు నడిపిస్తారని తెలుస్తోంది. చూడాలి దీని ఫలితం ఎలా ఉంటుందో.

Tags:    

Similar News