కౌంట్ డౌన్.. తమ్ముళ్ల వ్యూహాలు ఇవేనా
కర్నూలు టీడీపీలో గందరగోళం ప్రారంభమైందా? నాయకులు పక్క చూపులు చూస్తున్నారా? నిన్న మొన్నటి వరకు పదవులు అనుభవించిన వారు సైతం.. పార్టీని భరించాల్సి వస్తోందని బాధపడుతున్నారా? అంటే.. [more]
కర్నూలు టీడీపీలో గందరగోళం ప్రారంభమైందా? నాయకులు పక్క చూపులు చూస్తున్నారా? నిన్న మొన్నటి వరకు పదవులు అనుభవించిన వారు సైతం.. పార్టీని భరించాల్సి వస్తోందని బాధపడుతున్నారా? అంటే.. [more]
కర్నూలు టీడీపీలో గందరగోళం ప్రారంభమైందా? నాయకులు పక్క చూపులు చూస్తున్నారా? నిన్న మొన్నటి వరకు పదవులు అనుభవించిన వారు సైతం.. పార్టీని భరించాల్సి వస్తోందని బాధపడుతున్నారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ పాగా వేసింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే, తర్వాత కాలంలో అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. చేపట్టిన ఆకర్ష్ మంత్రంతో చాలా మంది వైసీపీ నేతలు పార్టీ మారి టీడీపీకి జైకొట్టారు. వీరిలో భూమా అఖిల ప్రియ మంత్రి పదవిని సైతం సంపాయించుకున్నారు. ఇక, అప్పటి ఇద్దరు ఎంపీలు కూడా టీడీపీకి జైకొట్టారు.
పార్టీ నిర్మాణంపై…..
ఎన్నికలకు ముందు పాణ్యం నియోజకవర్గంలో జరిగిన మార్పుల కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి చేరిపోయారు. అయితే, తాజా ఎన్నికల్లో టీడీపీ చాలా ఘోరంగా ఓటమిపాల కావడంతో ఇప్పుడు పార్టీ నిర్ణాణంపై చంద్రబాబు దృష్టి సారించారు. అసలు జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ పార్టీ చరిత్రలోనే ఇది ఘోరమైన అవమానం. కోట్ల, కేఈ లాంటి ఫ్యామిలీలు కలిసి టీడీపీలో ఉన్నా వాళ్లు కూడా ఓడిపోయారు. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రతి ఒక్కరికీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
అంతర్గత విభేదాలతో….
అయితే, వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన నాయకులు, టీడీపీ నేతలతో పొసగక.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ.. చంద్రబాబు పదే పదే వారిని హెచ్చరించారు. పార్టీ నేతలతో కలిసి మెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ.. అంతర్గత కలహాలు, ఆధిపత్య ధోరణులతో నాయకులు చేతులు కలపలేని పరస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా మంది వైసీపీ నాయకులు తిరిగి పాత గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్ ఒక వేళ అంగీకరించని పక్షంలో బీజేపీ జెండా అయినా కప్పుకోవాలని చూస్తున్నారు.
బీజేపీ నేతలకు……
రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది నాయకులు బీజేపీ నేతలకు టచ్‌లోకి వస్తున్నారని సమాచారం. మరోపక్క, కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీలో చేరిన కర్నూలు రాజకీయ నాయకుడు, సీనియర్ నేత కోట్ల కుటుంబం కూడా ఇప్పుడు బీజేపీ బాటపట్టేందుకు రెడీ అయిందని సమాచారం. బీజేపీలో చేరితో దేశంలోని ఎక్కడో ఒక చోట నుంచి రాజ్యసభకు ఎంపిక కావచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే ఇది అంత సులువు కాదు.దీనిపై పార్టీ నుంచి స్పష్టత రాగానే ఆయన జెండా మార్చుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.
ఆశలు గల్లంతేనా….?
ఈ క్రమంలో కర్నూలుపై టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ఆశలు నెరవేరక పోగా పార్టీకి మరింత దెబ్బతగిలే అవకాశం ఉందన్నది క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే టీడీపీలో ఉన్న రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ పార్టీ మారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే ఈయన కుమారుడు కూడా టీడీపీకి బై చెప్పనున్నారని సమాచారం. ఈ పరిస్థితి ఎదురైతే.. మాత్రం టీడీపీకి జిల్లాలో తీరని నష్టం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.