తమ్ముళ్ళకు ఆ బెంగ పట్టుకుందే

తెలుగుదేశం పార్టీ పెట్టి ఇప్పటికి 37 సంవత్సరాలు గడచింది. నాడు యువకులుగా ఉన్న వారంతా ఇపుడు షష్టి పూర్తి వయసు దాటిపోయారు. ఇక అధినాయకుడు చంద్రబాబు డెబ్బయ్యేళ్ళకు [more]

Update: 2019-07-16 13:30 GMT

తెలుగుదేశం పార్టీ పెట్టి ఇప్పటికి 37 సంవత్సరాలు గడచింది. నాడు యువకులుగా ఉన్న వారంతా ఇపుడు షష్టి పూర్తి వయసు దాటిపోయారు. ఇక అధినాయకుడు చంద్రబాబు డెబ్బయ్యేళ్ళకు దగ్గర్లో ఉన్నారు. మరో వైపు వైసీపీ యువ నాయకత్వంలో బలంగా ఉంది. ఇపుడు ఇదే తమ్ముళ్లకు బెంగ పెడుతోందంట. చంద్రబాబు వయసు ఎక్కువ అయినా ఆయన ఓపిక గొప్పది. పైగా ఆయనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు అంటూ లేవు. దాంతో తాను ఇప్పటికీ తయారు అంటున్నారు. కానీ తమ్ముళ్ల పరిస్థితి అలా కాదే. వారంతా ఏజ్ బార్ బ్యాచ్. పైగా టీడీపీని నమ్ముకుని మరో అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండాలంటేనే వారిలో కొత్త కలవరం చెలరేగుతోంది. ఇక రేపటికి ఎవరుంటారో ఏంటో అన్న వైరాగ్యంతో చాలా మంది ఉన్నారట. అందుకే తట్టా బుట్టా సర్దేస్తున్నారట. మొత్తానికి ఈ కారణంగానే పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు.

గ్యారంటీ ఉందా…

ఇక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, చినబాబే సూపర్ బాసులు. వారు చెప్పినట్లే అంతా జరుగుతుంది. పార్టీని కనిపెట్టుకుని ఉన్న నాయకులకు మళ్ళీ అవకాశాలు ఇస్తారా అంటే గ్యారంటీ ఎవరూ చెప్పలేరు. అంతెందుకు అధికారం కోసం పదేళ్ళు వేచి ఉన్నాక 2014లో ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు పార్టీలో ఉన్న వారిని పక్కన పెట్టి వైసీపీ వారిని తెచ్చి మంత్రులను చేశారు. కాంగ్రెస్ వారిని చేర్ఛుకుని నామినేటెడ్ పదవులు ఇచ్చాడు. మరి అవన్నీ కళ్ల ముందు ఉండగా చంద్రబాబుని ఎలా నమ్మేది అన్నది మరో పెద్ద ప్రశ్న. పైగా ప్రతిపక్షంలో ఉంటే బాగా ఖర్చు చేయాలి, జనంలో తిరగాలి, అన్ని రకాలుగా అవస్థలు పడాలి. ఎన్ని చేసినా మళ్లీ పార్టీ గెలుస్తుందన్న ఆశ లేనే లేదు.

చరమాంకంలో దూకుళ్ళు…..

అందుకే ఇపుడు టీడీపీలో గోడ దూకుళ్ళు మొదలయ్యాయని అంటున్నారు. ఇలా పార్టీని వీడే వారిలో చాలామందికి టీడీపీ భవిష్యత్తు మీద నమ్మకం లేదంటున్నారు. చంద్రబాబు నిబ్బరంగా ఉన్నా అయిదేళ్ళ కాలం అంటే తక్కువ కాదు, ఏమైనా జరగవచ్చు. పైగా అక్కడ అధికారంలో ఉన్నది జగన్, ఆయన దూకుడే వేరు. బంపర్ మెజారిటీతో ఒకసారి అధికారంలోకి వచ్చిన జగన్ కి రెండవ‌మారు సీట్లు తగ్గినా మళ్ళీ పవర్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తలపండిన తమ్ముళ్ళు అంటున్నారు. అందుకే తాము గీత దాటాల్సివస్తోందని చెబుతున్నారు. ఇక టీడీపీలో అంతా వృధ్ధ నాయకత్వం ఉండడం వల్ల కూడా ఇపుడు ఈ రకమైన పరిస్థ్తితి తలెత్త్తిందని కూడా అంటున్నారు. యువ నాయకత్వం ఉంటే ఏదో ఆశ కలుగుతుందని, పార్టీలో అంతా బాబుతో సమానమైన వారే ఉన్నారని, ఓ విధంగా వృధ్ధుల ఆశ్రమంగా టీడీపీ ఓడిన తరువాత మారిందని కూడా తమ్ముళ్లే సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News