ఇదేంది? ఈ పోకడేంది?

రాష్ట్రంలో రాజ‌కీయ పంచ్‌లు పేలుతున్నాయి. అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య రాజ‌కీయ వ్యాఖ్యలు రోజు రోజుకూ రాజుకుంటున్నాయి. పోక‌చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేనొక‌టంటా… అనే [more]

Update: 2019-10-07 00:30 GMT

రాష్ట్రంలో రాజ‌కీయ పంచ్‌లు పేలుతున్నాయి. అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య రాజ‌కీయ వ్యాఖ్యలు రోజు రోజుకూ రాజుకుంటున్నాయి. పోక‌చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేనొక‌టంటా… అనే ధోర‌ణి రెండు పార్టీల్లోనూ పెరిగిపోయింది. దీంతో రాజ‌కీయంగా రాష్ట్రంలో రెండు పార్టీలూ దూకుడుగానే ఉన్నాయ‌ని తెలుస్తోంది. అయితే, ఈ క్ర‌మంలోను అనుభ‌వ‌శూరిడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు ఏమంతా ఆహ్వానించ‌ద‌గినిగా లేవ‌నే టాక్ వినిపిస్తోంది. తాజా ప‌రిణామాల్లో ఆయ‌న పైచేయి సాధించాల‌ని చూస్తున్నా.. అవి ఆయ‌న‌కు క‌ల‌సి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

టీడీపీ నేతపై….

టీడీపీ అధికార ప్ర‌తినిధి పంచుమ‌ర్తి అనురాధ సీఎం జ‌గ‌న్‌పై రెండు రోజుల కింద‌ట చేసిన వ్యాఖ్య‌ల‌కు.. కొంద‌రు వైసీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అనురాధ ఓ ప్రెస్ మీట్‌లో ఆర్థిక ఉగ్ర‌వాది అంటూ జ‌గ‌న్‌ను సంభోదించారు. ఈ క్ర‌మంలో వైసీపీ నుంచి యువ నేత‌లు ఘాటుగానే స్పందించారు. బేవార్స్ అంటూ అనురాధ‌పై విరుచుకుప‌డ్డారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితిని పెంచి పోషించిన పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీనే. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌ను, త‌న పాల‌న‌ను ప్ర‌శ్నించిన వారిని, కామెంట్లు చేసిన వారిని ఇలానే ఆయ‌న ప్రోత్స‌హించారు.

దీనిని ఆసరగా చేసుకుని….

అయిన‌ప్ప‌టికీ.. అనురాధ‌పై బేవార్స్ అనే వ్యాఖ్య‌లు అంద‌రూ ఖండించాల్సిన విష‌య‌మే. అయితే, దీనిని ఆస‌రా చేసుకుని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు మాత్రం ఈ విష‌యాన్ని మ‌రింత రాజ‌కీయం చేశాయి. ప్ర‌ధానంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌ల‌ను బీసీ వ‌ర్గం మొత్తానికి ఆపాదించ‌డం, 'ఆమె బీసీ మ‌హిళ‌'-అంటూ మ‌ళ్లీ బీసీల్లో రాజ‌కీయంగా ర‌గ‌డ సృష్టించేందుకు ప్ర‌య‌త్నించ‌డం, పులివెందుల నేత‌ల తోక‌లు క‌ట్ చేస్తాన‌ని ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం వంటివి చంద్రబాబు అనుభ‌వాన్ని ప్ర‌శ్నార్థకం చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అందరికీ ఆపాదించి….

బేవార్స్ అనేమాట కేవ‌లం అనురాధ‌కు సంబంధించి స‌ద‌రు వైసీపీ నాయ‌కుడు చేసిన వ్యాఖ్య‌. కానీ, దీనిని మొత్తం బీసీల‌కే ఆపాదించ‌డం వెనుక చంద్ర‌బాబు రాజ‌కీయ కుయుక్తి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇలాంటి విష‌యాల్లో ఆయ‌న చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. లేక‌పోతే.. మ‌రింత‌గా ఆయ‌న ప్ర‌భ దిగ‌జారిపోవ‌డం, చిల్ల‌ర రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావ‌డం, ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు ప‌స‌ లేకుండా పోవ‌డం త‌థ్య‌మ‌ని సూచిస్తున్నారు. న‌ల‌భై సంవ‌త్స‌రాలుగా రాజ‌కీయాల్లో ఉన్న నేత ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌న్న అభిప్రాయ‌మే స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి బాబు మార‌తారా? చూడాలి..!

Tags:    

Similar News