ఫ్యూజులు ఎగిరిపోతాయనేగా.. అంత భయపడిపోతున్నారు?
తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూసిన వారెవరైనా ఆ పార్టీకి భయమంటే తెలుసా? అని ఎదురు ప్రశ్నిస్తారు. ఎందుకంటే అది వెరుపు ఎరగని ఎదురులేని మనిషి ఎన్టీఆర్ పెట్టిన [more]
తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూసిన వారెవరైనా ఆ పార్టీకి భయమంటే తెలుసా? అని ఎదురు ప్రశ్నిస్తారు. ఎందుకంటే అది వెరుపు ఎరగని ఎదురులేని మనిషి ఎన్టీఆర్ పెట్టిన [more]
తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూసిన వారెవరైనా ఆ పార్టీకి భయమంటే తెలుసా? అని ఎదురు ప్రశ్నిస్తారు. ఎందుకంటే అది వెరుపు ఎరగని ఎదురులేని మనిషి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. నిజంగా ఎన్టీఆర్ పద్నాలుగు ఏళ్ళ నాయకత్వంలో టీడీపీ అలాగే ఉండేది. ఎపుడైనా, ఎక్కడైనా రెడీ అని తొడగొట్టి మరీ రంగంలోకి దూకేది. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎన్టీఆర్. ఆయనకు రాజకీయాలు తెలియవు. జనాన్ని నమ్ముకుని రంగంలోకి దిగడమే తెలుసు. ప్రజల మనసు ఏంటో ఇట్టే గ్రహించే నేర్పు, నైపుణ్యం కూడా ఎన్టీఆర్ కి ఉంది. అందుకే ఆయన ఎపుడు ఎన్నికలైనా వెరిచేవారు కాదు.
ఇపుడు డీలా …..
మరి చంద్రబాబు నాయకత్వంలోకి ఎపుడైతే టీడీపీ వచ్చిందో నాటి నుంచి వ్యూహాలనే నమ్ముకున్నారు. చంద్రబాబు జిత్తులు ఎత్తులనే టీడీపీ గట్టిగా విశ్వసించింది. అవతల వారి బలహీనతల మీద గెలవడం తప్ప సొంతంగా తమ బలం మీద గెలిచిన దాఖలాలు లేవు. దాంతో టీడీపీ ఎన్నికలంటే భయం అన్న భావన ఏర్పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ లో వైఎస్సార్ లాంటి ప్రజాకర్షణ మెండుగా ఉన్న నాయకుడు ఢీ కొట్టడంతో బాబు పరిస్థితి కిందా మీదా అయింది. దానికి తోడు తెలంగాణా ఉద్యమం రూపంలో కేసీఆర్ మరో జననేతగా మారారు. ఈ పోటీలో ఉమ్మడి ఏపీలో బాబు ఆయన టీడీపీ చేతులెత్తేసిన పరిస్థితి.
జగన్ మానియా….
ఇక వైఎస్సార్ గతించారు అనుకుంటే జగన్ అతి పెద్ద పోటీగా మారారు. జగన్ గత పదేళ్ళుగా బాబుకు అడుగడుగునా బ్రేకులు వేస్తూనే ఉన్నారు. జగన్ ప్రజాదరణ ముందు బాబు సరితూగకపోయినా తనదైన వ్యూహాలతో 2014 ఎన్నికల్లో చిత్తు చేశారు. 2019 ఎన్నికల నాటికి ఆ సీన్ రివర్స్ అయింది. దాంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘోరంగా ఓటమిపాలు అయింది. ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చి దాదాపుగా పదినెలలు అవుతోంది. జగన్ కి జనాదరణ తగ్గింది. మళ్ళీ గెలవాలి. ఎన్నికలు పెట్టాలి, కుర్చీ దిగాలి అని ఎక్కడ పడితే అక్కడ చాలెంజిలు చేస్తున్న బాబు తీరా లోకల్ బాడీ ఎన్నికలు అనేసరిగి మాత్రం ఎక్కడలేని వంకలూ వెతుకుతున్నారని టాక్ నడుస్తోంది.
బెరుకేనా…?
లోకల్ బాడీ ఎన్నికలు ఈ నెలలోనే జరుగుతాయి అని జగన్ గట్టిగా చెబుతున్నారు. మరి మేము సై అనాల్సిన టీడీపీ బీసీల రిజర్వేషన్లపైన సుప్రీం కోర్టుకు వెళ్ళండని కొత్త వాదన తెరపైకి తెస్తోంది. ఆ విధంగా కోర్టుకు వెళ్తే పుణ్యకాలం గడుస్తుందన్నది టీడీపీ ఆలోచనగా ఉంది. అంటే చంద్రబాబు చెబుతున్నట్లుగా జగన్ పట్ల జనంలో ఇపుడైతే వ్యతిరేకత లేదులా ఉంది. అందుకే ఎన్నికలు వద్దు అనలేక వాయిదాల కోసం ఎత్తులు వేస్తున్నారని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మరో వైపు చూసుకుంటే జగన్ పాలనంతా సంక్షేమ పధకాలతో ప్రతీ ఇంట్లో పైసలు పెద్ద ఎత్తున గుమ్మరించేశారు. పైగా అధికారం చేతిలో ఉంది. మొత్తం ఎన్నికల వ్యవధి కూడా పదిహేనురోజులేనట. దాంతో బాబు అండ్ టీం లో వణుకు పుడుతోందని అంటున్నారు.