జిల్లాకు ఒకే ఒక్కడట…. పార్టీ పరిస్థితి ఇంత అద్వాన్నమా?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. కష్టంలో ఉన్నప్పుడు పార్టీ జెండాను పట్టేవారే అసలైన నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ పడటం కోసం ప్రతిపక్షంపై [more]

Update: 2020-10-01 14:30 GMT

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. కష్టంలో ఉన్నప్పుడు పార్టీ జెండాను పట్టేవారే అసలైన నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ పడటం కోసం ప్రతిపక్షంపై దుమ్మెత్తే నాయకులను ఎంతోమందిని చూశాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పదమూడు జిల్లాల్లో జిల్లాకు ఒక నాయకుడు మాత్రమే పార్టీ వాయిస్ ను బలంగా విన్పిస్తున్నాడంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోటీ పడిన నేతలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయారు.

ఒకరో ఇద్దరో……

కృష్ణా జిల్లాను తీసుకుంటే ఇక్కడ దేవినేని ఉమ, బోండా ఉమలు తప్పించి పెద్దగా ఎవరూ పార్టీ కోసం పనిచేయడం లేదు. అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడటం లేదు. టీడీపీకి జిల్లాలో ఎంతో మంది నేతలున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గద్దె రామ్మోహన్ వంటి నేతల వాయిస్ విన్పించడం లేదు. ఇక గుంటూరు జిల్లాలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబులు తప్ప మరెవ్వరూ కన్పించడం లేదు.

వాయిస్ లేకుండా…..

ఇక పశ్చిమగోదావరి జిల్లా నుంచి పార్టీ తరుపున వాయిస్ లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మంత్రి పదవులు నిర్వహించిన పీతల సుజాత, పితాని సత్యనారాయణ వంటి వారు కామ్ గా ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ సయితం దూకుడుగా లేరు. ఇక్కడ పాలకొల్లు రామానాయుడు ఒక్కరే దూకుడుగా ఉన్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో చినరాజప్ప తప్పించి మరెవ్వరూ అధికార పార్టీకి ధీటుగా సమాధనం ఇవ్వడం లేదు.

సీనియర్ నేతలు సయితం….

విశాఖ జిల్లాలో అయ్యన్న పాత్రుడు తప్పించి ఎవరూ పెద్దగా పార్టీ కోసం ముందుకు రావడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి అసలు పార్టీ వాయిస్ లేకుండా పోయింది. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి బెయిల్ పై వచ్చి మౌనాన్ని పాటిస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు అసలు పార్టీలో ఉన్నారా? అనిపిస్తుంది. రాయలసీమలో అయితే ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తప్పించి మరెవ్వరూ అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడటంలేదు. పార్లమెంటరీ పార్టీ ఇన్ ఛార్జులను నియమించిన తర్వాతైనా నేతలు బయటకు వస్తారో లేదో? చూడాలి.

Tags:    

Similar News