టీడీపీలో కీలక నేత కుమారుడి జంప్? ముహూర్తం ఖరారు
టీడీపీకి కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో పార్టీపై చర్చ ప్రారంభమైంది. 2014 ఎన్నికల్లో భారీ ఎత్తు న పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇద్దరు [more]
టీడీపీకి కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో పార్టీపై చర్చ ప్రారంభమైంది. 2014 ఎన్నికల్లో భారీ ఎత్తు న పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇద్దరు [more]
టీడీపీకి కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో పార్టీపై చర్చ ప్రారంభమైంది. 2014 ఎన్నికల్లో భారీ ఎత్తు న పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇద్దరు నుంచి ముగ్గురికి చంద్రబాబు మంత్రులుగా కూడా అవకాశం కల్పించారు. అలాంటి పార్టీ.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి కూడా పార్టీ యాక్టివ్‌గా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించలేక పోతోంది. మరీ ముఖ్యంగా పార్టీలోని సీనియర్లు.. తమ వారసులను రంగంలోకి దింపారు. అయితే, వారంతా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ పరిస్థితి దారుణంగానే తయారైంది.
కీలక నేతలందరూ…..
కీలకమైన నాయకులు మౌనంగా ఉండడం, గతంలో చేసిన కొన్ని పనులకు సంబందించి పోలీసు కేసులు ఎదుర్కొనడం వంటి కారణంగా.. నేతలు తాము బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడడంలేదు. ఇక ఇప్పటికే అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నాయకులు పార్టీ మారిపోయారు. గత ఎన్నికలకు ముందు వరకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి బీజేపీలోకి జంప్ చేసేశారు. ఇక శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీబాలతో పాటు ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి కూడా ఫ్యాన్ కిందకు చేరిపోయారు. హిందూపురం, తాడిపత్రి లాంటి నియోజకవర్గాల్లో కూడా కీలక నేతలు వైసీపీలోకి వెళ్లిపోయారు.
కీలక నేత కుమారుడు….
అదే సమయంలో టీడీపీలోనే ఉన్నప్పటికీ మరికొందరు తమ పనులు తాము చేసుకుంటున్నారే తప్ప అంతా మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ అధినేత చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో పెన కుదుపు చోటు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే పార్టీ నుంచి ఓ కీలక నేత కుమారుడు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కూడా ప్రచారంలోకి వచ్చింది. మాజీ ఎంపీ.. జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి .. గత ఏడాది ఎన్నికల్లో తాడిపత్రి నుంచి రంగంలోకి దిగాడు.
అస్మిత్ రెడ్డి వరకూ….
దాదాపు 35 ఏళ్లుగా ఈ నియోజకవర్గం వీళ్ల కిందే ఉంది. అలాంటి నియోజకవర్గంలో తొలిసారి జేసీ బ్రదర్స్ హవాకు బ్రేకులు పడ్డాయి. అస్మిత్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. ఇక, ఇప్పట్లో టీడీపీ పుంజుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉండే కన్నా.. వైసీపీలోకి జంప్ చేస్తే.. వచ్చే నాలుగేళ్లలో అన్ని విధాలా పుంజుకునేందుకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో పార్టీ మార్పునకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అస్మిత్ రెడ్డి కండువా మార్పుకు చర్చలు అన్ని పూర్తయ్యాయని.. ఆయన పార్టీ మారడమే మిగిలి ఉందని అంటున్నారు.