చైతనైన వాళ్లు కూడా చేవచచ్చినట్లు…?

ఔను.. ! ఇప్పుడు టీడీపీ నేత‌ల్లో ఇదే మాట వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న సీమ జిల్లాల్లోని కీల‌క‌మైన అనంత‌పురంలో ఇప్పుడు పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డంపై [more]

Update: 2020-08-21 00:30 GMT

ఔను.. ! ఇప్పుడు టీడీపీ నేత‌ల్లో ఇదే మాట వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న సీమ జిల్లాల్లోని కీల‌క‌మైన అనంత‌పురంలో ఇప్పుడు పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డంపై సొంత పార్టీ వ‌ర్గాల్లోనే తీవ్రస్థాయిలో విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు ఇక్కడ అనేక మంది త‌ల‌పండిన‌… ఎక్కడిక‌క్కడ చ‌క్రాలు తిప్పే నాయ‌కులు ఉన్నారు. ముఖ్యంగా ప‌రిటాల చ‌నిపోయిన త‌ర్వాత ఎంతో మంది టీడీపీకి అండ‌గా ఉంటూ వ‌చ్చారు. ప‌రిటాల‌, కందికుంట‌, ప‌య్యావుల, పార్థసార‌థి, నిమ్మల కిష్టప్ప, ప‌ల్లె ర‌ఘునాథ్‌ ఫ్యామిలీలు, నేత‌ల‌కు తోడు జేసీ ఫ్యామిలీ కూడా టీడీపీకి తోడైంది. ఇక వ‌ర‌దాపురం సూరి వంటి నాయ‌కులు కూడా పార్టీని నిన్న మొన్నటి వ‌ర‌కు మోశారు. అంతేకాదు.. గెలుపు ఓట‌ముల‌తో ప‌నిలేకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లారు బ‌ల‌మైన గ‌ళం కూడా వినిపించారు.

వైఎస్ హయాంలోనూ…..

రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. లేక‌పోయిన‌ప్పటికీ.. పార్టీకి ఇక్కడ కంచుకోటలుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. గ‌డిచిన ఐదేళ్ల చంద్రబాబు హ‌యాంలోనూ తిరుగులేని మెజారిటీతో పార్టీ ఇక్కడ దూసుకుపోయింది. చివ‌ర‌కు దివంగ‌త వైఎస్ తిరుగులేని అధికారం చెలాయించిన రోజుల్లో కూడా ఇక్కడ టీడీపీకి తిరుగులేదు. గ‌త ఏడాది ఓట‌మి త‌ర్వాత రాష్ట్రంలో టీడీపీ ఎదుర్కొంటున్న ప‌రిణామాల‌ను వ‌రుస‌గా గ‌మనిస్తున్న ఇక్కడ నాయ‌కులు 'మ‌న‌కెందుకు' అనే ధోర‌ణిలో ముందుకు సాగుతున్నారు. పైగా చాలా మంది నాయ‌కులు జంప్ చేశారు. చాలా నేత‌ల‌కు పార్టీపై న‌మ్మకం లేక‌పోవ‌డంతో సైకిల్ దిగేందుకు రెడీగా ఉన్నారు.

కీలక నాయకులందరూ….

ప‌లువురు కీల‌క‌ నాయ‌కులు ప‌క్క చూపులు చూస్తున్నారు. జ‌గ‌న్‌తో వ్యక్తిగ‌తంగా విభేదాలున్నవారు త‌ప్ప.. ఆయ‌న‌తో సానుకూలంగా ఉన్నవారు.. వైసీపీ వైపు చూస్తున్నార‌నే వాద‌న ఉంది. ఇక‌, ఎటూ వెళ్లలేక‌.. పార్టీలో ఉన్న వారు కూడా పార్టీని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఎక్కడిక‌క్కడ వారు సైలెంట్ అయిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. దీంతో ఎవ‌రూ కూడా ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయ‌డం లేదు. దీంతో పార్టీ త‌ర‌ఫున గ‌ళం వినిపించే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. జేసీ ఫ్యామిలీ వ‌రుస కేసుల్లో చిక్కుకుంటోంది.. జేసీ సోద‌రుల‌ను ప‌క్కన పెడితే వార‌సులు.. ముఖ్యంగా జేసీ అస్మిత్‌రెడ్డి మాత్రం వైసీపీలోకి వెళ్లిపోవాల‌ని తండ్రిపై ఒత్తిడి చేయ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడిప‌త్రి నుంచి వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట‌.

పరిటాల ఫ్యామిలీ కొన్ని కారణాలతో….

ఇక ప‌రిటాల ఫ్యామిలీ కొన్ని కార‌ణాల‌తో సైలెంట్ అవుతోంది. ప‌య్యావుల గెలిచినా తెలంగాణ‌లో వ్యాపార ప్రయోజ‌నాలతో పాటు ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నోరు పెగిల్చేందుకు ఇష్టప‌డ‌డం లేదంటున్నారు. ఆయ‌న తెర‌వెన‌క త‌న‌ప‌నులు వైసీపీ వాళ్లతో చేయించేసుకుంటున్నార‌ట‌. బాల‌య్యకు నియోజ‌క‌వ‌ర్గం, జిల్లా ఎప్పుడు గుర్తొస్తుందో ? తెలియ‌దు. జిల్లా మొత్తం మీద కేవ‌లం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఒక్కరే అప్పుడ‌ప్పుడు మాట్లాడుతున్నారు త‌ప్ప.. మిగిలిన నాయ‌కులు మాత్రం మౌన వ్రతంలోనే ఉంటున్నారు. క‌దిరిలో కందికుట గ‌ట్టిగానే ఉన్నా ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం.

ఏడాదిలోనే రివర్స్…..

ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డంతో త‌మ్ముళ్లు త‌ల‌లు పట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. కేడ‌ర్‌లో మ‌నోధైర్యం నింపే వాళ్లను వెతికి ప‌ట్టుకోవ‌డం బాబుకు పెద్ద స‌వాల్‌గా మారింది. మ‌రోవైపు పార్టీ పార్లమెంట‌రీ నియెజ‌క‌వ‌ర్గాల వారిగా క‌మిటీల‌కు రెడీ అవుతుండ‌డంతో అనంత‌పురం, హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి నాయ‌కులు కూడా దొరికే ప‌రిస్థితి లేదు. ఏదేమైనా యేడాది వ‌ర‌కు కంచుకోట‌గా ఉన్న అనంత‌లో టీడీపీ ప‌రిస్థితి కేవ‌లం యేడాదిలోనే రివ‌ర్స్ అయ్యింది.

Tags:    

Similar News