చివరకు మిగిలింది ముగ్గురేనా?

పేరుకు 23 మంది ఎమ్మెల్యేలున్నారు. కానీ అందులో ముగ్గురే పార్టీకి ఉపయోగపడుతున్నారు. మిగిలిన వారు ఉన్నా లేనట్లేననన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్. తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన [more]

Update: 2019-12-14 00:30 GMT

పేరుకు 23 మంది ఎమ్మెల్యేలున్నారు. కానీ అందులో ముగ్గురే పార్టీకి ఉపయోగపడుతున్నారు. మిగిలిన వారు ఉన్నా లేనట్లేననన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్. తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది. గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. పార్టీ అధినేతకు అండగా, పార్టీ నిర్ణయాలను సభలో పాటిస్తుంది కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమేనన్నది సుస్పష్టం.

ఐదు రోజుల సమావేశాల్లో….

గత ఐదు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో అధికార పార్టీ నుంచి విమర్శల దాడిని తిప్పికొడుతుంది కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే. చంద్రబాబు ఎటూ ప్రతిపక్ష నేతగా ఆయన పాత్ర ఎటూ ఉంటుంది. ఆయన కాకుండా అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు మాత్రమే. ఈ ముగ్గురు సభ్యులు మాత్రమే అసెంబ్లీలో యాక్టివ్ గా ఉంటున్నారు. మిగిలిన వారు ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నారు. ఒక్క ఆదిరెడ్డి భవానీ కొత్త ఎమ్మెల్యే కావడంతో ప్రశ్నలు వేసి ఊరుకుంటున్నారు.

పేరుకు ఇంతమంది ఉన్నా…..

వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామాచేశారు. ఇక 22 మందిలో గంటా శ్రీనివాసరావు ఈ సభలో కన్పించలేదు. గత ఐదు రోజుల నుంచి ఆయన సభకు హాజరుకాలేదు. అలాగే యాక్టివ్ గా, సబ్జెక్ట్ పై పట్టు ఉండే పయ్యావుల కేశవ్ కూడా సభకు రావడం లేదు. పయ్యావుల కేశవ్ అనారోగ్య కారణాలతో సభకు హాజరు కాలేనని ముందుగానే అనుమతి తీసుకున్నారు. ఇక బాలకృష్ణ అప్పుడప్పుడూ వస్తున్నా ఆయన కేవలం హాజరుకు మాత్రమే వస్తున్నారు. కనీసం అసెంబ్లీలో రాయలసీమ అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు.

అనేక మంది మౌనంగా….

ఇక సీనియర్ నేత కరణం బలరాం రోజూ సభకు హాజరవుతున్నప్పటికీ ఆయన మౌనంగానే ఉంటున్నారు. పేరుకు సభకు వస్తున్నారే తప్ప కనీసం లేచి ప్రభుత్వ విమర్శలకు అడ్డు చెప్పడం లేదు. గొట్టిపాటి రవికుమార్ అసలు ఉన్నారా? లేరా? అన్న పరిస్థితిలో ఉంది. సభలో జిల్లా సమస్యలు వస్తున్నా ఆయన పైకి లేవడం లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు సభకు వస్తున్నారే తప్పించి చంద్రబాబు ను ఫాలో కావడం లేదు. మొత్తం మీద ముగ్గురు మాత్రమే సభలో యాక్టివ్ గా ఉండటంతో టీడీపీ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు.

Tags:    

Similar News