ఇక అక్కడ కూడా ఇద్దరే మిగులుతారా?

వచ్చే ఎన్నికల నాటికి శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి ఇద్దరు సభ్యులే మిగులుతారు. శాసనమండలిలోనూ వైసీపీ బలం పెరగనుంది. ఇక రానున్న ఎమ్మెల్సీ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. [more]

Update: 2021-05-24 08:00 GMT

వచ్చే ఎన్నికల నాటికి శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి ఇద్దరు సభ్యులే మిగులుతారు. శాసనమండలిలోనూ వైసీపీ బలం పెరగనుంది. ఇక రానున్న ఎమ్మెల్సీ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎన్నికల నాటికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాత్రమే మిగలనున్నారు. శాసనసభ, శాసనమండలిలో పూర్తిగా బలహానపడి టీడీపీ 2024 ఎన్నికలకు దిగాల్సి ఉంది.

రానున్న కాలమంతా….

టీడీపీకి రానున్న కాలమంతా గడ్డుకాలమే. దాదాపు 18 ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీగా ఉన్నాయి. ఇందులో పదిహేడు స్థానాలు టీడీపీకి చెందినవే. వీటిలో తిరిగి టీడీపీకి దక్కేది ఒక్కటి కూడా లేదు. రానున్న ప్రతి ఎమ్మెల్యే పోస్టు అది గవర్నర్ కోటా కావచ్చు, ఎమ్మెల్యే కోటా కావచ్చు. అన్నీ వైసీపీకే దక్కనున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలకు పదవులు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

అవకాశాలు లేకపోవడంతో….

చంద్రబాబు పార్టీ ఇప్పటికే అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంది. కేవలం 23 మంది శాసనసభ్యులు ఎన్నిక కావడం, అందులో నలుగురు శాసనసభ్యులు దూరం కావడంతో ఎలాంటి పదవులు ఎవరికీ దక్కే అవకాశాలు లేవు. శాసనమండలిపై అనేక మంది ఎన్నికలకు ముందు వరకూ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు అనేక మందికి చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. టిక్కెట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ పదవి ఎర చూపి తాత్కాలికంగా అసంతృప్తికి తెరదించారు.

హామీ ఇవ్వలేక…..?

కానీ అప్పుడు హామీ పొందిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరో మూడేళ్ల వరకూ తాము పదవులకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. ఆర్థికంగా బలమైన నేతలు కూడా ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు దక్కవన్న కారణంగా చంద్రబాబు వైపు చూడటం లేదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీలో రాజకీయ భవిష్యత్ లేదని తేలిపోవడంతో పార్టీ కార్యక్రమాలకు కూడా అనేక మంది దూరంగా ఉంటున్నారు. వారికి పదవుల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబుది.

Tags:    

Similar News