టీడీపీలోకి తిరిగి వలసలు.. శుభ సంకేతాలేగా?

తెలుగుదేశం పార్టీకి క్రమంగా మళ్లీ పట్టు పెరుగుతుంది. గత ఇరవై నెలల నుంచి బలహీనంగా ఉన్న పార్టీకి ఇప్పుడిప్పుడే జవసత్వాలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై [more]

Update: 2021-01-12 06:30 GMT

తెలుగుదేశం పార్టీకి క్రమంగా మళ్లీ పట్టు పెరుగుతుంది. గత ఇరవై నెలల నుంచి బలహీనంగా ఉన్న పార్టీకి ఇప్పుడిప్పుడే జవసత్వాలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై నెలల్లోనే కొంత అసంతృప్తి ఏర్పడటంతో వైసీపీ నుంచి మళ్లీ టీడీపీలోకి వలసలు ప్రారంభమవుతున్నాయంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి కొందరు నేతలు టీడీపీలోకి వచ్చేందుకు అధినాయకత్వం అనుమతి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.

పార్టీని వీడి వెళ్లిన వారు….

2014లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు నాడు చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ తో టీడీపీలో చేరిపోయారు. వారందరూ రెండు మూడేళ్లు అప్పట్లో అధికారిక ఎమ్మెల్యేలుగానే వ్యవహరించారు. అయితే వారిలో చంద్రబాబు ఎక్కువ మందికి 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేకపోయారు. అప్పటికే అక్కడ టీడీపీని నమ్ముకుని ఉన్న నేతలు ఉండటంతో వారికి టిక్కెట్లను నిరాకరించారు చంద్రబాబు.

టిక్కెట్లు ఇవ్వక పోవడంతో…..

కొందరికి టిక్కెట్లు ఇచ్చినప్పటికీ అద్దంకి నియోజకవర్గం నుంచి ఒక్క గొట్టిపాటి రవికుమార్ తప్ప ఎవరూ గెలవలేదు. ఇక టిక్కెట్లు దక్కని వారిలో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఎస్వీమోహన్ రెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజు వంటి వారున్నారు. వైసీపీలోకి వెళ్లినా వారికి అక్కడ ప్రాధాన్యత దక్కడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉండటంతో మళ్లీ వచ్చి చేరిన ఇలాంటి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం అందడం లేదు.

తిరిగి టీడీపీలోకి…..

దీంతో తిరిగి వారు టీడీపీ వైపు చూస్తున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ టిక్కెట్ వచ్చే అవకాశం లేదు. టీడీపీలోకి వెళ్లినా అక్కడ టీజీ భరత్ ఉన్నారు. అయినా వైసీపీలో కంఫర్ట్ గా లేరు. ఇదే పరిస్థితి ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు తిరిగి టీడీపీలోకి రావాలని భావిస్తున్నారు. ఈ మేరకు అధినాయకత్వానికి సంకేతాలు పంపారు. దళిత సామాజికవర్గం కావడంతో ఆయనను చంద్రబాబు పార్టీలోకి తిరిగి తీసుకుంటారు. కానీ వచ్చే ఎన్నికల్లో తిరిగి డేవిడ్ రాజుకు టీడీపీ టిక్కెట్ దక్కుతుందా? అంటే డౌటేనని అంటున్నారు టీడీపీ నేతలు.

Tags:    

Similar News