ఇలాగయితే టీడీపీ నాకేస్తుందా ? బెజవాడ నేర్పుతున్న పాఠం ఏంటి ?
ఏపీ టీడీపీకి ఇప్పటికిప్పుడు కావాల్సింది ఏంటి ? ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి టీడీపీ నేర్చుకోవాల్సింది ఏంటి? మరీ ముఖ్యంగా ఎన్నికలకు [more]
ఏపీ టీడీపీకి ఇప్పటికిప్పుడు కావాల్సింది ఏంటి ? ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి టీడీపీ నేర్చుకోవాల్సింది ఏంటి? మరీ ముఖ్యంగా ఎన్నికలకు [more]
ఏపీ టీడీపీకి ఇప్పటికిప్పుడు కావాల్సింది ఏంటి ? ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి టీడీపీ నేర్చుకోవాల్సింది ఏంటి? మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు విజయవాడలో తలెత్తిన వివాదాలు, నాయకుల వ్యవహారశైలి నేర్పుతున్నది ఏంటి ? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నేతల మధ్య సమన్వయం లేని తనం.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరికి వారుగా పెత్తనం చేస్తున్నారు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు.. వంటివి పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాయి. ఈ కారణంగానే స్థానిక ఎన్నికల్లో పార్టీ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపించింది.
కేశినేని వ్యాఖ్యలతో…..
మరీముఖ్యంగా బెజవాడ పరిస్థితిని తీసుకుంటే.. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని పార్టీని ముప్పుతిప్పలు పెడుతూ.. దూకుడుగా వ్యవహరించారు. తాను ఒంటరిగా గెలిచానని.. ఆరుగురు ( తన లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోకి వచ్చే)ఎమ్మెల్యేలు ఓడిపోయినా.. తాను మాత్రమే గెలిచానని ఏకపక్ష ధోరణితో మాట్లాడి… తనకు తప్ప.. ఇంకెవరికీ ప్రజాదరణ లేదన్నట్టుగా వ్యవహరించారు. అంతేకాదు.. అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన ఎన్నికలను ఒంటరిపోరుగా మార్చేందుకు ప్రయత్నించారు.. తనే విజయవాడలో టీడీపీని ముందుకు తీసుకువెళ్లి గెలిపిస్తానని సవాళ్లు రువ్వారు.
ఓటమి తర్వాత…..
తీరా ఎన్నికల అనంతరం.. ఏం జరిగిందో తెలిసిందే. ఇక, ఇప్పుడు చూద్దామన్నా… ఎంపీ కేశినేని నాని జాడ కనిపించడం లేదు. ఇక, దిగువ స్థాయి నేతల్లోనూ సమైక్యత లోపించింది. ఓడిపోయిన నాయకులు తమను కొందరు పనిగట్టుకుని ఓడించారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి నాయకులకు అంత శక్తి ఉంటే.. ఓడిన వారు సరే.. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి ? వాళ్లని గెలిపించాలి కదా ? అన్న ప్రశ్నకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. ఇలా మొత్తంగా టీడీపీ పరిస్థితి ఎవరికి వారు చక్రాలు తిప్పడం.. ఆధిపత్య రాజకీయాలకు తెరదీయడం వంటివి కనిపిస్తున్నాయి.
ఇలానే వదిలేస్తే…..
నిజానికి ఒక పార్టీ డెవలప్ అవ్వాలి అంటే.. అన్ని కులాలు, అందరు వ్యక్తులు కలిస్తేనే సాధ్యమవుతుందనే వాదన అందరికీ తెలిసిందే. కానీ, టీడీపీలో ఈ కీలక సూత్రాన్ని విస్మరిస్తున్నారు. వచ్చే రెండున్నరేళ్లలో పార్టీని ఇలానే వదిలేస్తే.. మరోసారి కూడా పార్టీకి అధికారం దక్కే పరిస్థితి లేకుండా పోతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా పార్టీలో లోపాలను గుర్తించి చర్యలు చేపడతారా? లేక ఇలానే వదిలేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.