అడ్డుకుంటే చెడ్డ అవుతారే.. అయినా వినడం లేదే?
కోపం జగన్ మీద కానీ ఆ పాపం తగిలేది పేదలకు. ఏపీలో ఇపుడు ఇదే వింత విచిత్ర రాజకీయం. తెలుగుదేశం మాత్రం తన తీరు మార్చుకోకుండా చేస్తున్న [more]
కోపం జగన్ మీద కానీ ఆ పాపం తగిలేది పేదలకు. ఏపీలో ఇపుడు ఇదే వింత విచిత్ర రాజకీయం. తెలుగుదేశం మాత్రం తన తీరు మార్చుకోకుండా చేస్తున్న [more]
కోపం జగన్ మీద కానీ ఆ పాపం తగిలేది పేదలకు. ఏపీలో ఇపుడు ఇదే వింత విచిత్ర రాజకీయం. తెలుగుదేశం మాత్రం తన తీరు మార్చుకోకుండా చేస్తున్న దూకుడు రాజకీయంతో భవిష్యత్తులో కొన్ని ప్రధానమైన సెక్షన్లకు దూరం అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. యాంటీ జగన్ స్టాండ్ తో టీడీపీ ప్రతీ దాన్ని అడ్డుకోడం, ఆ పార్టీ అభిమానులు కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకురావడంతో అంతిమంగా నష్టపోతున్నది నూటికి ఎనభై శాతం ఉన్న పేద ప్రజలు. వారిపుడు టీడీపీనే తమ శత్రువుగా చూస్తున్నారు. ఏడాది వైసీపీ పాలనలో పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది. వాటిని ఎక్కడిక్కడ బ్రేకులు వేసే రాజకీయానికి టీడీపీ తెర తీసింది.
బాధితుల ఆక్రోశం …
కాకినాడ విషయమే తీసుకుంటే అక్కడ మడ అడవులు యాభై వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. పైగా ఆ మడ అడవులు, జగన్ సర్కార్ పేదలకు పంపిణీ చేస్తున్న భూములకు మధ్య కచ్చితంగా 15 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే పచ్చ పార్టీ మడ అడవులు కొట్టేస్తారా. తుఫానులు తెచ్చేస్తారా. అలా చేస్తే కాకినాడ మొత్తం మునిగిపోతుంది అంటూ చేస్తున్నా ఆరోపణలు అన్నీ తప్పుడువేనని రుజువు అవుతోంది. ఇక్కడ వేలాది మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి వైసీపీ సర్కార్ కొంత వరకూ భూసేకరణ జరిపింది. అయితే దీని మీద తమ్ముళ్లు నానా యాగీ చేశారు. కోర్టుకు వెళ్ళారు. దాంతో అక్కడ స్టే వచ్చేసింది. దీంతో పేదలకు ఇళ్ళ పట్టాలు పోయాయి. ఈ పాపం ఎవరిది అంటే అక్కడ పేదలు తెలుగుదేశం మీదనే తమ ఆక్రోశం పూర్తిగా వెళ్లగక్కుతున్నారు.
అమరావతి అంతేగా….?
ఇక అమరావతి రాజధానిలోని 33 వేల ఎకరాల భూముల్లో పేదలకు ఇళ్ళ స్థలాలకు గానూ అయిదు శాతం భూములను పంపిణీ చేస్తామని వైసీపీ ముందుకువచ్చింది. అయితే దాని మీద కూడా టీడీపీ అర్జంట్ గా కోర్టుకెక్కి మరీ జీవో కొట్టేయించేశారు. ఇపుడు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న పేదలంతా నోటి కాడ కూడు కొట్టేశారని మండిపోతున్నారు. తమ బతుకులకు ఒక వెలుగు వైసీపీ సర్కార్ చూపిస్తూంటే అడ్డుకున్నారని టీడీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా రాజకీయలు ఉంటే అవి వేరే విధంగా చూసుకోవచ్చు కానీ, విశాల ప్రయోజనాలు, పేదలకు సంబంధించిన విషయాల్లో చేస్తే నష్టపోయేది కచ్చితంగా అక్కడ పేదలు, మరి వారి శాపాలు కనుక తగిలితే రాజకీయంగా ఏ పార్టీకైనా పుట్టగతులు ఉండవు.
ఇంగ్లీష్ మీడియం…
ఇక తమ పిల్లలకు మంచి చదువు కావాలని ప్రతీ పేద తల్లితండ్రులకు ఉంటుంది. అయినా వారు చదివించుకోలేరు. అటువంటి వారికి సర్కార్ బడుల్లోనే ఉచితంగా చదువులు చెప్పిన్స్తామని, ఇంగ్లీష్ నేర్పిస్తామని జగన్ సర్కార్ అంటే వారికి మహదానందమే కదా. అయితే దాని మీద స్టేలు తెస్తూ అడ్డుకుంటున్న విషపు రాజీయం పట్ల కూడా పేదలు మండిపోతున్నారు. అక్కడ జగన్ని చూసి రాజకీయం చేస్తున్న టీడీపీకి తాము వేసే బాణాలు పేదల మీద అన్నది మరచిపోవడమే గమనార్హం. అందువల్ల ఒక వైపే చూస్తాం. ఒక వ్యక్తినే టార్గెట్ గా యాంటీ పాలిటిక్స్ చేస్తామని గిరిగీసుకుంటే భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది, ఇది టీడీపీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుంది.