బాబు చేసిన తప్పిదాల్లో సరిదిద్దలేనిది ఇదేనట

ఎన్నికల సమయంలో వచ్చి హడావిడి చేస్తే అది రాజకీయం అవుతుందా? అర్థబలం ఉంటేనే సరిపోతుందా? జనం అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని నెరవేర్చాల్సిన అవసరం లేదా? అంటే [more]

Update: 2020-10-17 03:30 GMT

ఎన్నికల సమయంలో వచ్చి హడావిడి చేస్తే అది రాజకీయం అవుతుందా? అర్థబలం ఉంటేనే సరిపోతుందా? జనం అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని నెరవేర్చాల్సిన అవసరం లేదా? అంటే నో అనే అంటున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ నేతలు. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోయిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి దిక్కూ దివానం లేకుండా పోయిందంటున్నారు.

వరస తప్పిదాలతో….

ిఇప్పటికే ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి బలంగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి దగ్గరుండి ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటుున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం కన్పించడమే మానేశారు. అయితే దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తున్న తప్పిదాలేనని చెప్పక తప్పదు.

వచ్చిన వారికి వచ్చినట్లు…..

ఎప్పటికప్పుడు అభ్యర్థులను మారుస్తూ పోతుండటంతో టీడీపీకి ఇక్కడ నిలకడగల, నికార్సయిన నేత లేకుండా పోయాడంటారు. కాంగ్రెస్ నుంచి ఆనం రామనారాయణరెడ్డి రాగానే ఆయనకు బాద్యతలు అప్పగించారు. అప్పటి వరకూ పార్టీ కోసం పనిచేసిన కన్నబాబును పక్కన పెట్టేశారు. దీంతో అప్పటి వరకూ ఆయన మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చిన వర్గం ఆనం వెంట వెళ్లలేక కొందరు వైసీపీలోకి వెళ్లాంటారు. ఇక మొన్నటి ఎన్నికల్లో మరలా ఆర్థికంగా బలమైన నేత బొల్లినేని కృష్ణయ్యకు టీడీపీ టిక్కెట్ దక్కింది.

క్యాష్ ఉందని……

కానీ బొల్లినేని కృష్ణయ్య ఫక్తు వ్యాపారవేత్త. ఆయన ఎన్నికల ఫలితాల నుంచే నియోజకవర్గానికి రావడం మానేశారు. పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించడం లేదు. కేవలం ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేస్తారనే టీడీపీ అధిష్టానం ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కన్నబాబే దిక్కయ్యాడు. కన్నబాబు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఆత్మకూరులో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు కాకుండా బయట నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తూ పోతుండటంతో ఇక్కడ టీడీపీ ఇక ఎదిగే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజలకు అందుబాటులో ఉండేవారిని ఇన్ ఛార్జులుగా నియమిస్తే బాగుంటుందని ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ నేతలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News