క‌మ్మ కోట‌లో వైసీపీ రాజ‌కీయం.. ఏం జ‌రుగుతుంది..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. నిన్నటి వ‌ర‌కు మ‌న‌మే తోపులం అనుకున్న నాయ‌కుల‌కు ఈ రోజు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి. పాలిటిక్స్‌లో ఎప్పుడూ [more]

Update: 2020-07-18 05:00 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. నిన్నటి వ‌ర‌కు మ‌న‌మే తోపులం అనుకున్న నాయ‌కుల‌కు ఈ రోజు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి. పాలిటిక్స్‌లో ఎప్పుడూ ఎత్తు వేసే వారికి పైఎత్తులు వేసే ప్రత్యర్థులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి ఏపీలో టీడీపీకి ఎదురు కానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న కీల‌క‌మైన నిర్ణయంతో టీడీపీ అంత‌ర్మథ‌నం చెందుతోంది. ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉన్న బెజ‌వాడ రాజ‌కీయాల‌పై టీడీపీ త‌న‌దైన ముద్ర వేసింది. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ఇక్కడ ప్రోత్సహించి.. వారితో రాజ‌కీయాలు న‌డిపించింది.

టీడీపీలో ఆందోళన….

ఈ క్రమంలోనే విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో గ‌డిచిన రెండు ద‌శాబ్దాలుగా టీడీపీ హ‌వా ఓ రేంజ్‌లో సాగుతోంది. విజ‌య‌వాడ‌లోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ హ‌వా పెద్ద ఎత్తున ఉంది. విజ‌య‌వాడ ఎంపీ సీటు కూడా గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీల‌తో సంబంధం లేకుండా క‌మ్మ వ‌ర్గానికే అన్ని పార్టీలు కేటాయిస్తూ వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ రాష్ట్రమంతా చిత్తుగా ఓడినా కూడా విజ‌య‌వాడ ఎంపీ సీటును, న‌గ‌రంలో తూర్పు సీటు టీడీపీ కైవ‌సం చేసుకుంది. అయితే, ఇక్కడ పాగా వేసేందు కు వైసీపీ త‌న‌దైన వ్యూహంతో ముందుకు అడుగులు వేసింది. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా దీని ప్రభావం చూపించేలా .. టీడీపీకి ద‌ళితుల‌ను దూరం చేసేలా వేసిన స్కెచ్ భారీ ఎత్తున టీడీపీలో ఆందోళ‌న పుట్టిస్తోంది.

బాబు స్లోగన్ గానే…

విజ‌య‌వాడ న‌డిబొడ్డున పీడ‌బ్య్లుడీ గ్రౌండ్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌డంతోపాటు.. ఇక్కడ అంబేడ్కర్ స్మృతి వ‌నం నిర్మించేందుకు జ‌గ‌న్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ద‌ళితుల‌ను త‌న పార్టీ వైపు తిప్పుకొనేందుకు చంద్రబాబు వేసిన స్కెచ్ ఇది. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలోని శాఖ‌మూరులో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, స్మృతి వ‌నం ఏర్పాటుకు గ‌తంలో ఆయ‌న హ‌యాంలోనే శంకుస్థాప‌న చేశారు. అయితే, దీనిన చంద్రబాబు త‌న హయాంలో పూర్తి చేయ‌కుండా ఎన్నిక‌ల్లో ఓ స్లోగ‌న్‌గా వినియోగించుకున్నారు.

బెజవాడ నడిబొడ్డున…..

ఇక‌, ఇప్పుడు దీనికంటే.. దీని కంటే భిన్నంగా రాజ‌కీయ‌ రాజ‌ధానిగా ఉన్న బెజ‌వాడలో న‌డిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌డం ద్వారా ద‌ళిత సామాజిక వ‌ర్గాల‌ను గుండుగుత్తుగా వైసీపీత‌న‌వైపు తిప్పుకొనేందుకు జ‌గ‌న్ ప్రయ‌త్నం చేశార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే.. ఈ విష‌యం తెలిసి కూడా టీడీపీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే ప‌రిస్థితి లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా జ‌గ‌న్ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News