chevireddy : చెవిరెడ్డికి చెక్.. ఆమెను బరిలోకి దింపుతున్నారట

సొంత ఇలాకాలో పార్టీ దెబ్బతింటే ఆ ఎఫెక్ట్ అన్ని ప్రాంతాలపై పడుతుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం ఏది అంటే కుప్పం అని అందరూ చెబుతారు. కానీ చంద్రబాబు [more]

Update: 2021-09-22 13:30 GMT

సొంత ఇలాకాలో పార్టీ దెబ్బతింటే ఆ ఎఫెక్ట్ అన్ని ప్రాంతాలపై పడుతుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం ఏది అంటే కుప్పం అని అందరూ చెబుతారు. కానీ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయింది తొలుత చంద్రగిరి నుంచే. 1978లో చంద్రబాబు చంద్రగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. చంద్రగిరి లో చివరి సారి తెలుగుదేశం పార్టీ గెలిచింది 1994లోనే.

మూడు దశాబ్దాలు…..

1994లో చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా రామ్మూర్తి నాయుడు విజయం సాధించారు. ఆ తర్వాత ఇక్కడ పసుపు జెండా ఎగరలేదు. అంటే టీడీపీ చంద్రగిరిలో గెలిచి మూడు దశాబ్దాలవుతుంది. చంద్రగిరిలో ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం అనుకూలంగా రాలేదు. సొంత నియోజకవర్గంగా చంద్రబాబు దీనిని భావిస్తారు. ఇక్కడ వరసగా రెండుసార్లు నుంచి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపొందారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆయన కష్టపడుతున్నారు.

మరోసారి ప్రయోగానికి…

ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన పులివర్తి నానిని పక్కన పెట్టాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. మరోసారి చెవిరెడ్డికి ఛాన్స్ ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసమే చంద్రగిరిలో తిరిగి గల్లా అరుణకుమారిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించారట. గల్లా అరుణకుమారికి ఈ నియోజకవర్గంలో పట్టుంది. 1999, 2004, 2009 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గల్లా అరుణకుమారి వరసగా గెలిచారు.

తిరిగి గల్లాకు….

అయితే మొన్నటి ఎన్నికల్లో పులివర్తి నానికి టిక్కెట్ ఇస్తే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి ప్రయోగం చేయకూడదని నిర్ణయించారు. అమరరాజా కంపెనీ వ్యవహారం, 2014లో గల్లా అరుణకుమారి ఓటమి పాలు వంటి అంశాలు ఆ కుటుంబానికి సానుభూతి తెస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే చెవిరెడ్డికి ఈసారి చెక్ పెట్టాలంటే గల్లా అరుణకుమారికే ఇవ్వడం బెటర్ అని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గల్లా అయితే మరోసారి చంద్రగిరిలో చెవిరెడ్డి గట్టి పోటీ ఎదుర్కొనక తప్పదు.

Tags:    

Similar News