అక్కడ టీడీపీలో కొత్త నేత హ‌వా స్టార్టవుతోందా ?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం దూకుడు మీద ఉన్న అధికార పార్టీ వైసీపీని నిలువ‌రించేందుకు ప్రతి నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. బల‌మైన నాయ‌కుల‌ను [more]

Update: 2021-05-15 14:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం దూకుడు మీద ఉన్న అధికార పార్టీ వైసీపీని నిలువ‌రించేందుకు ప్రతి నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. బల‌మైన నాయ‌కుల‌ను రంగంలొకి దింపాల‌ని నిర్ణయించుకుంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి నేత‌లు గ‌తిలేని ప‌రిస్థితి. దీంతో కొన్ని చోట్ల ద్వితీయ శ్రేణి నాయ‌కులు, మ‌రికొన్ని చోట్ల అవుట్ డేటెడ్ లీడ‌ర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు ఇస్తామ‌ని హామీలు ఇస్తోంది. ఈ క్రమంలో ప్రతి నియోజ‌క‌వ‌ర్గంపైనా అధ్యయ‌నం జ‌రుగుతోంది. ఎక్కడ ఎవ‌రు నాయ‌కులు ఉన్నారు ? వారితో పార్టీకి ఏ మేర‌కు ఉప‌యోగ‌ప‌డ‌తారు ? అనే అంశాల‌పై దృష్టి సారిస్తున్నారు.

కొత్త ఇన్ ఛార్జిగా….?

ఇలానే ప్రకాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే.. ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇక్కడ వాస్తవానికి వైసీపీ నుంచి గత ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీ సైకిల్ ఎక్కారు ఎడం బాలాజీ. అయితే.. ఈయ‌న పార్టీని పుంజుకునేలా చేయడంలో దూకుడు ప్రద‌ర్శించ‌లేక‌పోయార‌నే వాద‌న ఉంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు కూడా అనేక రూపాల్లో స‌మాచారం సేక‌రించారు. ఇక్కడ మార్పు త‌ప్పద‌ని భావిస్తున్నారు. పేరుకు మాత్రమే ఆయ‌న టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయ‌న అక్కడ బ‌లమైన వైసీపీ నేత‌ల‌ను ఎంత వ‌ర‌కు ఢీ కొడ‌తార‌న్న సందేహాలు పార్టీ అధిష్టానానికే ఉన్నాయి.

అందిన నివేదిలక ప్రకారం..?

అందునా.. రేపు వైసీపీ.. క‌నుక అటు ఆమంచి కృష్ణమోహ‌న్‌కు టికెట్ ఇచ్చినా.. లేక క‌ర‌ణం బ‌ల‌రాంకు ఇచ్చినా వారిని త‌ట్టుకుని ఇక్క‌డ పార్టీ విజ‌యం సాధించాలంటే.. మ‌రింత బ‌లంగా ఇక్కడ చక్రం తిప్పగ‌ల నాయ‌కుడు పార్టీకి అవ‌స‌రం అవుతార‌ని.. భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎడ‌మ బాలాజీ ప‌నితీరుపై ఇప్పటికే రెండు మూడు సార్లు జిల్లా నేత‌ల ద్వారా రిపోర్టులు తెప్పించుకున్న చంద్రబాబు ఆయ‌నకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇచ్చినా ఉప‌యోగం ఉండ‌ద‌న్న నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

యాదవ సామాజికవర్గానికి….

ఈ క్రమంలోనే ఒంగోలు పార్లమెంట‌రీ పార్టీ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ నూక‌సాని బాలాజీని ఇక్కడ కు తీసుకువ‌చ్చి పార్టీ ప‌గ్గాలు అప్పగించాల‌ని పార్టీ అధిష్టానం ప‌రిశీలిస్తున్నట్టు వార్త‌లు వస్తున్నాయి. ప్రస్తుతం ఒంగోలు ఇంచార్జ్‌గా ఉన్న నూక‌సాని సామాజిక ప‌రంగా యాద‌వ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కూడా కావ‌డం క‌లిసి వ‌స్తుంద‌ని అంటున్నారు. ఆయ‌న ఒంగోలులో ఉంటూ డాక్టర్‌గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ పార్లమెంట‌రీ ప‌ద‌వుల్లో ఆయ‌న‌కు ఒంగోలు పార్టీ ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇచ్చారు.

అన్ని ఈక్వేషన్లతో…?

ఇటు చీరాల‌లో యాద‌వ వ‌ర్గం ఓట్లు 30 వేల వ‌ర‌కు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో యాద‌వ పాలేలు ఎక్కువే. గ‌తంలోనూ టీడీపీ ఇక్కడ నుంచి ఇదే వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావుకు సీటు ఇవ్వగా ఆయ‌న గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఈ క్రమంలో అనేక ఈక్వేష‌న్లు ఆలోచిస్తోన్న చంద్రబాబు ఎడం బాలాజీని త‌ప్పించి ఆ ప్లేస్‌లో నూక‌సాని బాలాజీని నియ‌మించ‌డం ద్వారా.. పార్టీ పుంజుకుంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News