వస్తారా అని ఆఫర్ ఇచ్చినా రావడం లేదే? ఇదేం ఖర్మ గురూ

టీడీపీ సీట్లు ఇస్తాం… ఎవ‌రైనా వ‌స్తారా.. బాధ్యత‌లు స్వీక‌రిస్తారా ? అన్న ప‌రిస్థితి ఆ పార్టీకి ఏపీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది. ఓవ‌రాల్‌గా 30కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో [more]

Update: 2020-09-23 12:30 GMT

టీడీపీ సీట్లు ఇస్తాం… ఎవ‌రైనా వ‌స్తారా.. బాధ్యత‌లు స్వీక‌రిస్తారా ? అన్న ప‌రిస్థితి ఆ పార్టీకి ఏపీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది. ఓవ‌రాల్‌గా 30కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి స‌రైన అభ్యర్థులు లేని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే ఏపీలోనే అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో పార్టీ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో నాలుగు చోట్ల ఇక్కడ టీడీపీ విజ‌యం సాధించి మిగిలిన జిల్లాల‌తో పోలిస్తే కాస్త బెట‌ర్ అనిపించింది. నిమ్మకాయ‌ల చినరాజ‌ప్ప, య‌న‌మ‌ల, బుచ్చయ్య చౌదరి, చిక్కాల రామ‌చంద్రరావు లాంటి బ‌ల‌మైన నేత‌లు ఉండి కూడా జిల్లాలో పార్టీ కునారిల్లుతోంది. జిల్లాలో ఉన్న 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌గం నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి నాయ‌కులు, ఇన్‌చార్జ్‌లు లేని ప‌రిస్థితి.

ఈ నియోజకవర్గాల్లో……

టి.గ‌న్నవ‌రం ఇన్‌చార్జ్ నేల‌పూడి స్టాలిన్‌బాబును పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. అక్కడ పార్టీకి స‌రైన నేతే లేరు. ఇక అదే కోన‌సీమ‌లోని రాజోలులో మాజీ మంత్రి గొల్లప‌ల్లి సూర్యారావు వ‌యోః భారంతో పాటు ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. దీంతో పాటు గ‌త ఎన్నిక‌ల్లో అక్కడ పార్టీ మూడో స్థానంలో ఉంది. ఇక కార్యక‌ర్తలు సైతం సూర్యారావును మార్చాల‌ని కోరుతున్నారు. ఇక రామ‌చంద్రాపురంలో క‌నుచూపు మేర‌లో కూడా పార్టీని న‌డిపించే నేత‌లే లేరు. ఇక్కడ బ‌ల‌మైన నేత‌లు అంద‌రూ వైసీపీలోకి వెళ్లిపోవ‌డంతో పార్టీ అధిష్టానం సైతం ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. రాజ్యస‌భ స‌భ్యుడు పిల్లి బోస్‌, మంత్రి వేణుగోపాల‌కృష్ణ, అమ‌లాపురం పార్లమెంట‌రీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట త్రిమూర్తులు… ఈ ముగ్గురు బ‌ల‌మైన నేత‌ల‌కు పోటీ ఇచ్చే నేత‌లు టీడీపీలో ఒక్కరు కూడా లేరు.

ఏజెన్సీలోనూ…..

ఇక ఏజెన్సీలో రంప‌చోడ‌వ‌రం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వరి అస‌లు పార్టీలో ఉన్నారో ? లేదో తెలియ‌ని ప‌రిస్థితి. అక్కడ పార్టీ కేడ‌ర్ కూడా నిల‌బ‌డే ప‌రిస్థితి లేదు. ఇక ప్రత్తిపాడులో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన వ‌రుపుల రాజా ఆ త‌ర్వాత చంద్రబాబును, లోకేష్‌ను తీవ్రంగా విమ‌ర్శించి పార్టీకి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత అదే రాజాను తిరిగి బ‌తిమిలాడి మ‌రీ పార్టీలోకి తీసుకోవ‌డం పార్టీ దీన‌స్థితికి అద్దం ప‌డుతోంది. కాకినాడ రూర‌ల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత‌ల‌క్ష్మి త‌న‌యులు వ‌రుస‌గా కేసుల్లో చిక్కుకోవ‌డంతో వాళ్లు పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు.

బాధ్యతలు ఇచ్చేందుకు……

ఇక కాకినాడ రూర‌ల్లో మంత్రి క‌న్నబాబు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక కొత్తపేట‌లో మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్యానంద‌రావుకు మొన్న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఇష్టం లేక‌పోయినా బ‌ల‌వంతంగా చేశారు. ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్టే అన్న ప్రచారం జ‌రుగుతోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని న‌డిపిస్తామ‌ని ఎవ‌రు ముందుకు వ‌చ్చినా వారికి బాధ్యత‌లు ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నా అస‌లు అటు వైపు తొంగిచూసే ప‌రిస్థితే లేదు.

Tags:    

Similar News