ఆ టీడీపీ నేతకు బాబు రెండు ఆప్షన్లు… ఎక్కడ సెట్ అవుతారో ?
తూర్పు గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక చాలా మంది టీడీపీ కీలక నేతలు అడ్రస్ లేకుండా పోయారు. టి.గన్నవరం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, కొత్తపేట, [more]
తూర్పు గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక చాలా మంది టీడీపీ కీలక నేతలు అడ్రస్ లేకుండా పోయారు. టి.గన్నవరం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, కొత్తపేట, [more]
తూర్పు గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక చాలా మంది టీడీపీ కీలక నేతలు అడ్రస్ లేకుండా పోయారు. టి.గన్నవరం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, కొత్తపేట, రామచంద్రాపురం లాంటి చోట్ల టీడీపీకి దిక్కూ దివాణం లేకుండా పోయింది. కాకినాడ సిటీలోనూ అదే పరిస్థితి ఉంది. ఎన్నికలు అయ్యి రెండేళ్లు పూర్తయ్యింది. ప్రస్తుతం స్థానిక సంస్థల వేడి ఇంతలా ఉన్నా ఆ నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాథుడు లేడు. నిన్న మొన్నటి వరకు ఈ నియోజకవర్గాలపై పెద్దగా దృష్టి పెట్టని చంద్రబాబు ఇప్పుడిప్పుడే నియోజకవర్గాల్లో కొత్త నాయకులను తీసుకొచ్చి పెట్టే పనిలో బిజీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త నేతలను ఎంపిక చేస్తోన్న చంద్రబాబు తూర్పులో కూడా రెండు నియోజకవర్గాల బాధ్యుల విషయంలో క్లారిటీతో ఉన్నారనే తెలుస్తోంది.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు….
బీసీల్లో బలమైన శెట్టిబలిజ వర్గంకు చెందిన నేత వాసంశెట్టి సత్యను మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. 2009 ఎన్నికలకు ముందు టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు జిల్లా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన 2009 కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో పాటు మూడో స్థానంలో నిలిచాడు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం రెండో స్థానంలో నిలిచింది. సత్య 2009 తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిపోయాడు. మళ్లీ ఇన్నేళ్లకు పార్టీలో చాలా మంది నేతలు అవుట్ డేటెడ్ అయిపోవడంతో ఇప్పుడు ఆర్థికంగా పార్టీని నిలబెట్టే నేతలు కావడంతో మళ్లీ ఇప్పుడు సత్యను బయటకు తీసుకు వచ్చి ఎక్కడో ఓ చోట పార్టీ పగ్గాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది.
రామచంద్రాపురం బాధ్యతలను…
టీడీపీ అత్యంత దీనస్థితిలో ఉన్న రామచంద్రాపురం బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీలో ముగ్గురు ఉద్దండులు అయిన మంత్రి వేణు, ఎంపీ బోస్, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అక్కడే ఉండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని ఢీకొట్టి అక్కడ టీడీపీని నిలబెట్టడం చాలా కష్టం. అందుకే చంద్రబాబు సత్యను సామాజిక , ఆర్థిక కోణాల్లో రామచంద్రాపురం పంపాలని చూస్తున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో చర్చించారు. సత్య 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యి… నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తితో ఉన్నా రామచంద్రాపురం వెళ్లేందుకు మాత్రం సుముఖత చూపడం లేదని తెలుస్తోంది.
మనసంతా అక్కడే….
ఆయన మనసంతా కాకినాడ రూరల్ నియోజకవర్గం మీదే ఉందంటున్నారు. గతంలో కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనకు సిటీతో పాటు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. పైగా రామచంద్రాపురం వెళ్లినా అక్కడ సక్సెస్‌పై నమ్మకం తక్కువుగా ఉండడంతోనే ఆయన కాకినాడ రూరల్‌పై మక్కువ చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ రెండు దశాబ్దాలుగా టీడీపీలో కీలక నేతలుగా ఉన్న పిల్లి కుటుంబాన్ని కాదని బాబు సత్యకు ఛాన్స్ ఇస్తారా ? అన్నది కూడా సందేహమే ?