chandrababu : ఈ నేతకు బాబు వార్నింగ్.. ఇష్టం లేకుంటే?

ఎప్పుడైనా నాయకుడు అందుబాటులో ఉంటేనే క్యాడర్ సంతోషంగా ఉంటుంది. ఎన్నికల సమయానికి వచ్చి ఊరేగుతానంటే కుదరదు. ఇవి పాత రోజులు కాదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటేనే [more]

Update: 2021-09-22 14:30 GMT

ఎప్పుడైనా నాయకుడు అందుబాటులో ఉంటేనే క్యాడర్ సంతోషంగా ఉంటుంది. ఎన్నికల సమయానికి వచ్చి ఊరేగుతానంటే కుదరదు. ఇవి పాత రోజులు కాదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటేనే గెలుపు అంతంత మాత్రం. అలాంటిది కొన్ని నెలలుగా పార్టీకి, క్యాడర్ కు దూరమైన నేతను ఎవరు మాత్రం ఉపేక్షిస్తారు. అందుకే ఈ నేత మాకొద్దు బాబోయ్ అంటున్నారట ఆ నియోజకవర్గం నేతలు. దీంతో చంద్రబాబు ఈ నియోజకవర్గంలో నాయకత్వ మార్పిపై ఆలోచనలో పడ్డారంటున్నారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ పార్టీకి విజయం లభించకపోవడంతో చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఒక్కసారి గెలుపు లేదు….

చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు రిజర్వ్ డ్ నియోజకవర్గం. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుమ్మడి కుతూహలమ్మ విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో కుతూహలమ్మ టీడీపీలో చేరిపోయారు. 2014లో టీడీపీ తరుపున పోట ీచేసిన గుమ్మడి కుతూహలమ్మ ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణను చంద్రబాబు రంగంలోకి దించినా అక్కడ ప్రస్తుత మంత్రి నారాయణస్వామినే విజయం వరించింది.

ఓటమి పాలయినా…

అయితే ఓటమి పాలయినా హరికృష్ణను గంగాధర నెల్లూరుకు ఇన్ ఛార్జిగా కొనసాగిస్తున్నారు. కానీ ఆయన ప్రజల్లో ఉండటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. ఎక్కువగా బెంగళూరులోనే సమయాన్ని గడుపుతున్నారు. పార్టీ ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా తన అనుచరులకు చెప్పి నడిపిస్తున్నారు. దీంతో ఇటీవల హరికృష్ణ పై చంద్రబాబుకు గంగాధరం నెల్లూరు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఫోన్ చేసి మరీ…

దీంతో హరికృష్ణ కు చంద్రబాబు ఇటీవల ఫోన్ లో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కుతూహలమ్మ నిత్యం ప్రజల్లో ఉండేవారని, ఆమెను చూసి నేర్చుకోవాలని కూడా చంద్రబాబు హితవు పలికారు. ఇష్టం లేకపోతే వేరే నేత వస్తారని, కొద్దిరోజులు మాత్రమే సమయం ఇస్తున్నానని కూడా చంద్రబాబు గట్టిగా చెప్పడంతో ఇకపై నియోజకవర్గంలో ఉంటూ క్యాడర్ కు అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారని సమాచారం. అయినా అక్కడ నారాయణస్వామిని ఎదుర్కొనాలంటే హరికృష్ణ సరిపోరన్నది చంద్రబాబు భావన. అందుకోసం కొత్త నేత కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Tags:    

Similar News