టోటల్ ఖాళీయేనట
కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. ఈ నియోజకవర్గంలోనే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీఆర్ జన్మించిన నిమ్మకూరు( ఇది పునర్విభజనలో పామర్రులో కలిసింది) కూడా ఉండేది. మరి [more]
కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. ఈ నియోజకవర్గంలోనే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీఆర్ జన్మించిన నిమ్మకూరు( ఇది పునర్విభజనలో పామర్రులో కలిసింది) కూడా ఉండేది. మరి [more]
కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. ఈ నియోజకవర్గంలోనే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీఆర్ జన్మించిన నిమ్మకూరు( ఇది పునర్విభజనలో పామర్రులో కలిసింది) కూడా ఉండేది. మరి అలాంటి నియోజకవర్గంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన టీడీపీ.. ఇప్పుడు పూర్తిగా చతికిల పడే పరిస్థితి వచ్చింది. వరుస పరాజయాలు పార్టీని వెంటాడుతున్నా యి. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీని నడిపించేందుకు ఎవరూ ఉత్సాహం చూపకపోగా.. పార్టీ నుంచి జంప్ చేయాలని చూస్తుండడం ఇప్పుడు గమనించాల్సిన విషయం. ఈఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ టికెట్ పై పోటి చేసిన యువ నాయకుడు, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అనినాష్ పార్టీ మారిపోయారు.
అందరూ కాడిపడేసి…..
అవినాష్ నేరుగా వెళ్లి వైసీపీ కండువా మార్చుకున్నారు. ఆయన ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక, కొన్నేళ్లుగా ఇక్కడ పార్టీకి అన్నీ తామై వ్యవహరి స్తున్న రావి వెంకటేశ్వరావు, పిన్నమనేని పూర్ణ వీరయ్య చౌదరి(బాబ్జీ) వంటి వారు కూడా కాడి పడేశారు. నిజానికి ఈ ఎన్నికల్లో వీరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ వినిపించింది. అయితే,బాబు వీరి మాటలను విని పించుకోకుండా స్థానికేతరుడైన అవినాష్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. దీంతో వీరు టీడీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరించడం ప్రారంభించారు. ప్రస్తుతం వీరు ఎవరిదారి వారు చూసుకుంటున్నా రనే వార్తలు వినిపిస్తున్నా యి. ప్రస్తుతం గుడివాడ అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా పిన్నమనేని పూర్ణవీరయ్యనే వైసీపీ ప్రభుత్వం నియమిస్తోందనే వార్తలు వస్తున్నాయి.
జెండా మార్చేందుకు…..
అంటే .. చానాళ్ల కిందటే ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ పదవిని నిలబెట్టుకో వాలంటే.. ఆయన కూడా టీడీపీని వీడక తప్పదని అంటున్నారు. ఎలాగూ తనకు పార్టీలో పెద్దగా గుర్తింపు లేదని భావిస్తున్న బాబ్జీ జెండా మార్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా ఈ ఏడాది ఎన్నికలకు ముందు పార్టీలో కీలకంగా వ్యవహరించిన మునిసిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసు కూడా ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎన్నికలకు ముందు ఆయన కూడా సీటు ఆశించిన వారిలో ఉన్నారు.
పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టి…..
కొన్నాళ్ల కిందట కృష్ణా టీడీపీ వ్యవహారాలపై చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు కూడా యలవర్తి డుమ్మా కొట్టారు. దీంతో ఈ విషయంపై ఆయనతో మాట్లాడిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుకు ఆయన కుండ బద్దలు కొట్టినట్టు తన మనసులోని మాటను వెల్లడించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, పైకి అలా అన్నప్పటికీ.. ఆయన కూడా వైసీపీకి టచ్‌లో ఉన్నారనే వార్తలు గుడివాడలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక రావి వెంకటేశ్వరరావు కూడా ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా పార్టీ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి తనకు ఇక్కడ బాధ్యతలు ఇస్తే తాను మాత్రం ఎలా చూస్తానంటూ ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఇలా .. మొత్తానికి గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.