జావగారి.. జారిపోతూ…?

ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర రాజ‌ధాని గుంటూరు జిల్లాలో టీడీపీ త‌ర‌ఫున ఇద్దరే ఇద్దరు గెలుపు గుర్రం ఎక్కారు. వారే రేప‌ల్లె నుంచి అన‌గాని [more]

Update: 2019-10-01 13:30 GMT

ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర రాజ‌ధాని గుంటూరు జిల్లాలో టీడీపీ త‌ర‌ఫున ఇద్దరే ఇద్దరు గెలుపు గుర్రం ఎక్కారు. వారే రేప‌ల్లె నుంచి అన‌గాని స‌త్య ప్రసాద్‌, గుంటూరు వెస్ట్ నుంచి మ‌ద్దాలి గిరిధ‌ర్‌. మ‌రి వీరు ఏం చేస్తున్నారు ? టీడీపీ త‌ర‌ఫున ఏమేర‌కు పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు ? చంద్రబాబు విజ‌న్‌ను అందిపుచ్చుకోవ‌డంలో స‌క్సెస్ అవుతున్నారా ? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

పార్టీ కార్యక్రమాలకు…..

విష‌యంలోకి వెళ్తే.. ఈ ఇద్దరూ కూడా పెద్దగా పార్టీపై దృష్టి పెడుతున్నట్టు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. మ‌ద్దాలి గిరి విష‌యం తీసుకుంటే.. రాజ‌ధానిలోని అత్యంత కీల‌క నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల‌కు ఏదో నామ్ కేవాస్తే.. అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల నిర్వహించిన ఓ ధ‌ర్నాకు వ‌చ్చిన గిరి.. చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన‌డం లేద‌ని, ఆయ‌న వేరే చోట ఉన్నార‌ని ఉప్పందడంతో ఆ వెంట‌నే ఈయ‌న కూడా జారుకున్నారు.
సీనియర్ నేతలే అంతేకాదు, త‌న వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయోన‌ని భావిస్తున్న ఆయ‌న జ‌గ‌న్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విమ‌ర్శలు చేయాల‌ని, ప్రతి విష‌యంలోనూ లూప్ హోల్‌ను వెతికి ప‌ట్టుకోవాల‌ని అధినేత నుంచి ఆదేశాలు వ‌స్తున్నా.. చూసీ చూడ‌న‌ట్టే టీడీపీ నేతలు వ్యవ‌హ‌రిస్తున్నారు. అదే స‌మయంలో కేడ‌ర్‌ను కూడా బ‌లోపేతం చేయ‌డంలో ఆయ‌న పెద్దగా దృష్టి పెట్టడం లేదు. జిల్లా కేంద్రం నుంచి ఉన్న ఎమ్మెల్యే అయినా ఆయ‌న పార్టీని ముందుండి న‌డిపించడం లేదు. ఇక టీడీపీలో ఓడిన సీనియ‌ర్లే మ‌ళ్లీ ముందుంటున్నారు.

పార్టీ మారతారని….

ఇక‌, రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇంత పెద్ద జ‌గ‌న్ సునామీని సైతం త‌ట్టుకుని గెలుపు గుర్రం ఎక్కిన అన‌గాని స‌త్య ప్రసాద్ కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పార్టీలోనే ఉన్నప్పటికీ.. ఆయ‌న పెద్దగా కార్యక్రమాల‌కు హాజ‌రు కావ‌డం లేదు. పైగా పార్టీ మార‌తార‌నే ప్రచారం ఇటీవ‌ల వ‌ర‌కు కూడా కొన‌సాగింది. మ‌ధ్యలో ఆయ‌న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను క‌లిసి రావ‌డంతో ఆయ‌న పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు వ‌చ్చాయి.

వరదలొచ్చినా…..

అయితే, తాను పార్టీ మారేది లేద‌ని ఆయ‌న స్పష్టం చేసినా.. పార్టీ కార్యక్రమాల‌కు , స‌మావేశాల‌కు కూడా రాకుండా హైద‌రాబాద్ కే ప‌రిమిత‌మ‌య్యార‌నే ప్రచారం సాగుతోంది. ఇటీవ‌ల కృష్ణాన‌దికి వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ఇద్దరినీ చంద్రబాబు ఎలా ట్రీట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News