టీడీపీలో కీల‌క మార్పులు.. వ్యూహం మార్చిన బాబు

టీడీపీకి కీల‌క జిల్లాగా మారుతుంద‌ని భావించిన గుంటూరులో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది. వాస్తవానికి రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇక్కడ ప్రాణం పోసిన నేప‌థ్యంలో.. [more]

Update: 2020-11-12 06:30 GMT

టీడీపీకి కీల‌క జిల్లాగా మారుతుంద‌ని భావించిన గుంటూరులో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది. వాస్తవానికి రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇక్కడ ప్రాణం పోసిన నేప‌థ్యంలో.. టీడీపీకి ఇక్కడి ప్రజ‌లు బ్రహ్మర‌థం ప‌డ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఇక్కడ నుంచి పోటీ చేసిన చంద్రబాబు త‌న‌యుడు లోకేష్ పరాజ‌యం పాల‌య్యారు. అదే స‌మ‌యంలో కీల‌క నేత‌లు కోడెల శివ‌ప్రసాద్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, ధూళిపాళ్ల న‌రేంద్ర, జీవి.ఆంజ‌నేయులు, కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్‌, ఆల‌పాటి రాజా లాంటి మ‌హామ‌హులు అయిన నేత‌లు అంద‌రూ కూడా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, గెలుపు గుర్రం ఎక్కడం ఖాయ‌మ‌ని అనుకున్న నాయ‌కులు కూడా విజ‌యం సాధించే ప‌రిస్థితి లేకుండా పోయింది.

లోకేష్ స్థానాన్ని మార్చి…..

రాజ‌ధాని అమ‌రావ‌తి వికేంద్రీక‌ర‌ణ నేప‌థ్యంలో ఇప్పుడు ఇక్కడ టీడీపీకి ప‌ట్టు చిక్కుతోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని గుంటూరు జిల్లాను కైవ‌సం చేసుకునే విధంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.. అందుకు అనుగుణంగా వ్యూహాలు మారుస్తున్నారు. నియోజ‌క‌వర్గాల ఇన్‌చార్జ్‌ల విష‌యంలో మార్పులు, చేర్పుల‌పై తీవ్ర స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో గ‌త ఏడాది మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన‌.. నారా లోకేష్‌కు గుంటూరు ప‌శ్చిమ లేదా.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి బ‌లమైన నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న పెద‌కూర‌పాడును కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. లోకేష్ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయ‌మ‌న్న అంచ‌నాలు పార్టీకి ఉన్నాయి. పెద‌కూర‌పాడును లోకేష్‌కు ఇస్తే.. ఇక్కడున్న కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌ను గుంటూరు ప‌శ్చిమ‌కు కేటాయించే అవ‌కాశం ఉంది.

మంగళగిరి స్థానం ఆమెకే….

ఇక‌, పార్టీలో సీనియ‌ర్ నాయ‌కురాలు, మంచి గ‌ళం వినిపిస్తున్న పంచుమ‌ర్తి అనురాధ‌కు ఇటీవ‌ల పార్టీలో ప‌ద‌వులు ఇవ్వలేదు. దీంతో అసంతృప్తితో ఉన్నారు. ఆమెకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రాధాన్యం పెంచేలా.. మంగ‌ళ‌గిరి బాధ్యత‌లు అప్పగిస్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది. త్వర‌లోనే ఆమెను మంగ‌ళ‌గిరి ఇంచార్జ్‌గా నియ‌మించ‌నున్నారు. ఆమె గ‌త ఎన్నిక‌ల‌కు ముందే మంగ‌ళ‌గిరి సీటు ఇస్తార‌నుకున్నా అక్కడ లోకేష్ స్వయంగా రంగంలో ఉండ‌డంతో అనూరాధ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. ఇక‌, స‌త్తెన‌ప‌ల్లిని కోడెల కుమారుడు శిమ‌రామ‌కృష్ణకే కేటాయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా చంద్రబాబు ఇచ్చార‌నే ప్రచారం జ‌రుగుతోంది. శివ‌రాం స‌త్తెన‌పల్లిలో వ‌ర్క్ స్టార్ట్ చేసుకున్నాడు.

సమూల ప్రక్షాళన…..

అదేస‌మ‌యంలో కీలక‌మైన ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి అభ్యర్థి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇక్కడ పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన మాకినేని పెద‌ర‌త్తయ్యకు తాత్కాలికంగా బాధ్యత‌లు అప్పగించారు. ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్కడ నాయ‌కుడు ఎవ‌ర‌నేది తేలాల్సి ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇలా ఉంటే.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఫ్యామిలీ విష‌యం మాత్రం తేల‌లేదు. రాయ‌పాటి ఫ్యామిలీ పెద‌కూర‌పాడుపై ఆశ‌లు పెట్టుకుంది.. పోనీ.. స‌త్తెన‌ప‌ల్లి అయినా.. ఇస్తార‌నుకున్నారు. కానీ, కోడెల కుమారుడికి దీనిని క‌న్ఫర్మ్ చేశారు. దీంతో ఈ కుటుంబానికి న‌ర‌సారావుపేట ఎంపీ సీటును ఆప్షన్ గా కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ఇలా మొత్తంగా చూస్తే.. గుంటూరు టీడీపీలో స‌మూల ప్రక్షాళ‌న‌లు త్వర‌లోనే తెర‌మీద‌కి రానున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News