పైకి లేపడం కష్టమే
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి ఆరు నెలలు కావొస్తుంది. అయితే ఈ ఆరు నెలల కాలంలో టీడీపీకి కష్టాలు పెరిగాయే తప్ప..తగ్గలేదు. ఓటమి దెబ్బ వల్ల [more]
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి ఆరు నెలలు కావొస్తుంది. అయితే ఈ ఆరు నెలల కాలంలో టీడీపీకి కష్టాలు పెరిగాయే తప్ప..తగ్గలేదు. ఓటమి దెబ్బ వల్ల [more]
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి ఆరు నెలలు కావొస్తుంది. అయితే ఈ ఆరు నెలల కాలంలో టీడీపీకి కష్టాలు పెరిగాయే తప్ప..తగ్గలేదు. ఓటమి దెబ్బ వల్ల చాలామంది నేతలు టీడీపీని వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే చాలామంది నేతలు బయటకొచ్చి పార్టీ కోసం పని చేయడం లేదు. ఏదో అధినేత చంద్రబాబు, ఐదారుగురు నేతలు తప్ప మిగతా వారు పార్టీ కోసం నిలబడటం లేదు. రాష్ట్రం మొత్తంలో కూడా టీడీపీకి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీకి ఎప్పుడు కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితులు నెలకొన్నాయి.
రెండు చోట్లా….
అంతెందుకు పార్టీ పెట్టినప్పటి నుంచి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలోనూ చాలా నియోజకవర్గాల్లో పార్టీని గాలికి వదిలేస్తున్నారు. పార్టీకి కంచుకోటలుగా ఉన్న పశ్చిమ కృష్ణాలోని నందిగామ, జగ్గయ్యపేట నేతలు కూడా అడ్రెస్ లేరు. ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీకి ముందు నుంచి కంచుకోటలుగా నిలుస్తూ వస్తున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడ విజయాలు దక్కించుకుంది. 2004, 2009, 2014, 2014 ఉప ఎన్నికల్లో నందిగామలో టీడీపీ వరుస విజయాలు సాధించింది. పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే నందిగామలో టీడీపీ ఆవిర్భావం నుంచి 1989లో ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది.
అగమ్యగోచరంగా…..
2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. తంగిరాల సౌమ్య టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో తంగిరాల ప్రభాకర్ రావు మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 2014 ఉప ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఎమ్మెల్యేగా ఐదేళ్లు అధికారపక్షంగా ఉన్న ఆమె…తాజా ఎన్నికల్లో చేతులెత్తేశారు. అయితే ఓడిపోయిన దగ్గర నుంచి ఆమె పెద్ద యాక్టివ్ గా ఉండటం లేదు. ఏదో పార్టీకు సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో హాజరవుతున్నారు తప్ప పార్టీ బలోపేతానికి ఏమి చేయడం లేదు. దీంతో కంచుకోట లాంటి నందిగామలో టీడీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయింది. ఈ నియోజకవర్గంలో పార్టీని పర్యవేక్షించే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సైతం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
స్లో పాలిటిక్స్….
అటు జగ్గయ్యపేటలో కూడా టీడీపీ పరిస్తితి ఆశాజనకంగా ఏమి లేదు. జగ్గయ్యపేటలో టీడీపీ ఆవిర్భావం తర్వాత 1999, 2004లలో మాత్రమే ఓడింది. ఇక తాజా ఎన్నికల్లో అంతకముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీరామ్ తాతయ్య…వైసీపీ అభ్యర్ధి సామినేని ఉదయభాను చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి తాతయ్య అంత యాక్టివ్ ఏమి కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా దూకుడు రాజకీయం చేయాల్సిందే. అయితే తాతయ్య స్లో పాలిటిక్స్‌తో పార్టీ కేడర్‌ను యాక్టివేట్ చేయడం కష్టమవుతోంది. ఏదేమైనా కంచుకోటల్లాంటి ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ కష్టాల్లో కొట్టమిట్టాడుతోందన్నది వాస్తవం.