ఇక్కడ టీడీపీ బాగుపడదంతే
ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి తెలిసిందే. అయితే, ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి? ఏ నాయకులు ఏం చేస్తున్నారు? ఓడిన వారు ఇప్పుడు [more]
ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి తెలిసిందే. అయితే, ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి? ఏ నాయకులు ఏం చేస్తున్నారు? ఓడిన వారు ఇప్పుడు [more]
ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి తెలిసిందే. అయితే, ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి? ఏ నాయకులు ఏం చేస్తున్నారు? ఓడిన వారు ఇప్పుడు ఏమంటున్నారు? అనే చర్చ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పార్టీలో టికెట్లు దక్కుతాయని ఆశించి, దక్కక పోవడంతో చాప కింద నీరు మాదిరిగా పార్టీ ఓటమికి పనిచేసిన నాయకులు లేదా దూరంగా ఉన్న నాయకులు ఇప్పుడు మళ్లీ పార్టీ లో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో పోరు పెరుగుతోంది. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలోనూ పరిస్థితి ఇలానే ఉందని వినిపిస్తోంది.
సీనియర్ నేత అయిన….
విషయంలోకి వెళ్తే.. కళ్యాణదుర్గం నుంచి 2009 నుంచి కూడా టీడీపీలో ఉన్నం హనుమంతరాయ చౌదరి యాక్టివ్ పాలిటిక్స్ జరిపారు. జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు మంచి పేరే ఉంది. వాస్తవానికి 2009లోనే ఆయన గెలుపు గుర్రం ఎక్కాల్సి ఉంది. అయితే, అప్పటి ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన మార్కెట్ రమణ ఓట్లను చీల్చడంతో కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రఘువీరారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఉన్నం మరింత దూకుడుగా టీడీపీని బలపరిచే వ్యూహానికి తెరదీశారు. అనేక కార్యక్రమాలు చేపట్టారు.
టిక్కెట్ దక్కక పోవడంతో….
దీంతో టీడీపీ పుంజుకుని 2014లో ఉన్నం గెలిచేందుకు అవకాశం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో ఉన్నం.. ఏకంగా 22 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఆయనకు ఇటీవల జరిగిన ఎన్ని కలలో చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. ఐదేళ్ల పాటు ఉన్నం వారసులు అక్కడ సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన వ్యతిరేకత కొని తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఉన్నం తప్పుకుని తన వారసుడు ఉన్నం మారుతి చౌదరికి సీటు ఇవ్వాలని పట్టుబట్టినా బాబు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. దీంతో టీడీపీని నిలబెట్టి, గెలుపు గుర్రం ఎక్కించిన తనకే టికెట్ ఇవ్వకపోవడం ఏంటనే అక్కసుతో ఉన్నం అలిగి కూర్చున్నారు.
మళ్లీ యాక్టివ్ కావడంతో…
ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన మాదినేని ఉమామహేశ్వరనాయుడుకు ఏ మాత్రం సహకరించలేదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నియోజకవర్గంపై పట్టు సాధించిన ఉన్నం ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవడంతో ఇక్కడ టీడీపీ పరాజయం పాలైంది. అయితే, టీడీపీ స్టోరీ అక్కడితో ఆగిపోలేదు. ఎన్నికల సమయంలో అలిగి కూర్చున్న ఉన్నం.. ఎన్నికల అనంతరం.. ఇక్కడ టీడీపీ నేత ఘోర పరాజయం తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. చంద్రబాబు చెప్పిన పిలుపు మేరకు ఆయన నిరసన కార్యక్రమాలకు వస్తున్నారు.ఈ పరిణామం మాదినేనికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అరె.. నేను పోటీ చేసినప్పుడు ఏమాత్రం సహకరించకుండా నేనే ఓడిపోవడానికి కారణమైన నేత.. ఇప్పుడు ఇలా వ్యవహరించడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకు వెళ్లారు. ఇలా అయితే, కష్టమని ఉన్నంను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో కళ్యాణదుర్గం రాజకీయాలు వేడెక్కాయి. మరి చంద్రబాబు ఈ ఇద్దరు నేతలను ఎలా సముదాయిస్తారో ? చూడాలి.