బాబు అలా చేస్తారని టీడీపీ లీడర్లు?
టీడీపీకి కంచుకోట వంటి పశ్చిమ గోదావరిజిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం కొవ్వూరులో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడి పార్టీలోని మెజారిటీ నాయకులు మంత్రి, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి [more]
టీడీపీకి కంచుకోట వంటి పశ్చిమ గోదావరిజిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం కొవ్వూరులో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడి పార్టీలోని మెజారిటీ నాయకులు మంత్రి, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి [more]
టీడీపీకి కంచుకోట వంటి పశ్చిమ గోదావరిజిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం కొవ్వూరులో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడి పార్టీలోని మెజారిటీ నాయకులు మంత్రి, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నాలుగు రోజుల కిందట వంద మంది టీడీపీ కార్యకర్తలు కండువాలు మార్చుకున్నారు. దీంతో సీనియర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. నిజానికి టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ అనేక సార్లు వరుస విజయాలు సాధించింది. 1999లో స్వల్ప తేడాతో ఓడిన టీడీపీ మళ్లీ గతేడాది జరిగిన ఎన్నికల్లో మాత్రమే ఓడింది. దీనిని బట్టి కొవ్వూరు టీడీపీకి ఎంత కంచుకోట అనేది తెలుస్తోంది.
జవహర్ పై వ్యతిరేకతతో….
సీనియర్లు ప్రధానంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఒక తాటిపై నిలబడ్డారు. ఎస్సీ వర్గం మొత్తం మరో తాటిపై నిలబడింది. అప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రి కేఎస్ జవహర్‌పై తీవ్ర విమర్శలు, ఆందోళనలు సాగాయి. పార్టీలోని సీనియర్లకు జవహర్ విలువ ఇవ్వడం లేదని ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన అప్పట్లో ఆరోపించారు. ఆయనకు టికెట్ ఇస్తే ఒప్పుకొనేది లేదని చెప్పారు. ఈ వ్యతిరేకత పెరిగిపోవడంతో చంద్రబాబు ఆయనను ఆయన సొంత నియోజకవర్గం అయిన కృష్ణా జిల్లా తిరువూరుకు బదిలీ చేశారు. కానీ, పరిస్థితి మాత్రం టీడీపీలో చక్కబడలేదు.
మళ్లీ మార్చడంతో….
మళ్లీ విశాఖ నుంచి వచ్చిన వంగలపూడి అనితకు టికెట్ ఇచ్చారు. తాము ఏదైతే స్థానికత కోసం పోరాడామో దానిని చంద్రబాబు పట్టించుకోకుండా మళ్లీ స్థానికేతరురాలికే టికెట్ ఇవ్వడంతో సైలెంట్‌గా వైసీపీకి సహకరించారు. ఇలా సహకరించిన వారికి ఇప్పుడు మంత్రి వనిత పరోక్షంగా సహకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి కూడా వలసలు పెరిగాయి. అనిత పూర్వాశ్రమంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు నియోజకవర్గ టీడీపీలో కీ లీడర్. దీంతో ఇక్కడ టీడీపీ, వైసీపీలో కొందరు నేతల మధ్య ఈ లోపాయికారి సహకారాలు నడుస్తున్నాయి.
ఆ ప్రచారంతోనే….
ఈ క్రమంలోనే వైసీపీలో సైతం ఇప్పుడు మంత్రి వనితకు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. ఇదిలావుంటే, ఇంత తేడా కొట్టిన నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా మళ్లీ జవహర్‌నే రంగంలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. అటు టీడీపీ వాళ్లు కూడా పనుల కోసం మంత్రి అనితను ఆశ్రయించడమో లేదా పార్టీ జెండా మార్చేయడమో జరుగుతోంది. దీంతో కొవ్వూరు టీడీపీలో తీవ్ర గందరగోళం ఏర్పడి మొత్తానికే ఎసరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో ? చూడాలి.