ఇక్కడ ట్రాక్ లో పెట్టడం కష్టమైన పనే?
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అత్యంత కీలకమైన కృష్ణాజిల్లాలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. విజయవాడ నగరంలో పరిస్థితి ఒకింత ఆశాజనకంగా ఉన్నా.. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అత్యంత కీలకమైన కృష్ణాజిల్లాలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. విజయవాడ నగరంలో పరిస్థితి ఒకింత ఆశాజనకంగా ఉన్నా.. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో [more]
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అత్యంత కీలకమైన కృష్ణాజిల్లాలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. విజయవాడ నగరంలో పరిస్థితి ఒకింత ఆశాజనకంగా ఉన్నా.. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకులు కరువయ్యారు. కొన్ని చోట్ల ఆధిపత్య పోరు సాగుతోంది. దీంతో పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొంది. కీలక నేతలకు పదవులు ఇచ్చాం.. పార్టీ పుంజుకుంటుందిలే.. అని చంద్రబాబు భావించినా ఆ తరహా వాతావరణం ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాల పరిస్థితి పరిశీలిస్తే.. ఇక్కడ నాయకులు ఉన్నారా ? పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారా ? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
పామర్రు: కీలకమైన ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున జెండా పట్టుకునేవారు లేకుండా పోయారనే వాదన వినిపిస్తోంది. గత ఏడాది ఎన్నికల్లో ఉప్పులేటి కల్పన ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వాస్తవానికి టీడీపీతోనే రాజకీయాలు ప్రారంభించినా.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లి గెలిచి.. మళ్లీ టీడీపీలోకి వచ్చారు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఇక్కడ ఆమె దూకుడుగా రాజకీయాలు చేయడం లేదు. పైగా పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు కూడా ముందుకు రావడంతో కొన్నాళ్ల కిందటి వరకు కూడా కల్పనకు వర్ల రామయ్యకు మధ్య వివాదాలు నడిచాయి. దీంతో చంద్రబాబు వర్లను పక్కకు తప్పించి కల్పనకే పూర్తి బాధ్యత అప్పగించారు. అయినా.. ఆమె పుంజుకోవడం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయాక ఆమె అసలు నియోజకవర్గాన్నే పట్టించుకోవడం లేదు. అసలు ఆమె మాకు వద్దు మొర్రో అని స్థానిక కేడర్ గగ్గోలు పెడుతున్నా బాబు పట్టించుకోవడం లేదు.
పెడన: ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ గత ఏడాది ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ పార్టీకి, కాగిత ఫ్యామిలీకి మంచి బలం ఉన్నప్పటికీ.. ఆయన ఇక్కడ పుంజుకోవడం లేదు. గత ఎన్నికల్లో 54 వేల పైచిలుకు ఓట్లు లభించాయి. దీంతో కొంత మేరకు శ్రమిస్తే ఇక్కడ టీడీపీ ట్రాక్‌లోకి త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయినా కృష్ణప్రసాద్ దూకుడు లేకుండా ముందుకు సాగుతున్నారు. మరోవైపు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ రావు తన కుమారుడికి ఇక్కడ అవకాశం ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. ఆయన కూడా ఇక్కడ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఇక్కడ టీడీపీకి అన్ని ఉన్నా బండి నడిపే నాయకుడి లేని దుస్థితి ఏర్పడింది.
తిరువూరు: ఇక్కడ గత ఎన్నికలకు ముందు వరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు హ్యాట్రిక్ ఓటములు చూడడంతో గత ఏడాది ఎన్నికల సమయంలో మాజీ మంత్రి జవహర్‌కు సీటు ఇవ్వగా ఆయన ఓడిపోయారు. ఇప్పటికీ.. ఆయనే ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరు ఇక్కడ చక్రం తిప్పాలనే వాదన ఇప్పటికీ ఉంది. తనకు ఇక్కడ ఇష్టం లేదని తనకు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు బాధ్యతలే ఇవ్వాలని జవహర్ కోరుతున్నారు. అయితే.. అధికారికంగా మాత్రం ఇప్పటికీ జవహరే ఇంచార్జ్‌గా ఉండడంతో నల్లగట్ల మౌనంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు డౌన్ అవుతోంది. తిరువూరు సీటును టీడీపీ వరుసగా నాలుగుసార్లు కోల్పోయింది. ఇప్పటకి అయినా ఇక్కడ స్థానికంగా బలమైన నేతకు ఛాన్స్ ఇస్తే పార్టీకి మళ్లీ పునాదులు అయినా పడే అవకాశం ఉంది.
విజయవాడ పశ్చిమం: టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ సీటును ఆ పార్టీ 1983లో ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఎన్నో ప్రయోగాలు చేస్తూ ప్రతి సారి ఇక్కడ పరాజయం పాలవ్వడం ఆ పార్టీకి ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ ఓటమి తర్వాత అమెరికా చెక్కేశారు. ప్రస్తుతం ఇక్కడ పార్టీ వ్యవహారాలు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎంపీ కేశినేని చూస్తున్నా బలమైన నేత లేక టీడీపీ చిందరవందరగా మారింది. ఇక్కడ పార్టీ గెలవడం సంగతి అలా ఉంచితే కనీసం ఈ రెండేళ్లలో ఓ బలమైన నేతను అయినా చూస్తారా ? అన్నదే పెద్ద డౌట్.
మిగిలిన ప్రాంతాల్లోనూ….
ఈ నాలుగు నియోజకవర్గాలే కాదు వంశీ పార్టీ మారిపోయాక గన్నవరంలోనూ పార్టీ ఎంతో బలంగా ఉన్నా సరైన క్యాండెట్‌ను పెట్టలేక బందరు నుంచి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని దింపినా ఆయన కూడా ఇక్కడ పార్టీ శ్రేణులను సమన్వయం చేసే పరిస్థితి లేదు. అవనిగడ్డలోనూ మాజీ మంత్రి బుద్ధ ప్రసాద్ కాడి కింద పడేశారు. టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాలోనే ఈ పరిస్థితి ఉండడం బాబు డైలామాకు నిదర్శనం.