కిం క‌ర్తవ్యం.. మూగ‌బోయిన కృష్ణా టీడీపీ.. రీజ‌నేంటి ?

రాష్ట్రంలో కృష్ణా జిల్లా టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖ‌చ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఇద్దరు మంత్రుల‌కు ఈ జిల్లాలో ప్రాధాన్యం ఉంటుంది. కీల‌క‌మైన దేవినేని [more]

Update: 2021-02-22 06:30 GMT

రాష్ట్రంలో కృష్ణా జిల్లా టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖ‌చ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఇద్దరు మంత్రుల‌కు ఈ జిల్లాలో ప్రాధాన్యం ఉంటుంది. కీల‌క‌మైన దేవినేని ఉమా.. కొల్లు ర‌వీంద్ర, బోడే ప్రసాద్‌, కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, బ‌చ్చుల అర్జునుడు, కేశినేని నాని, గ‌ద్దె రామ్మోహ‌న్‌, బుద్ధా వెంక‌న్న, మండ‌లి బుద్ధ ప్రసాద్‌, కాగిత వెంక‌ట్రావు, బోండా ఉమా వంటి కీల‌క నాయకులు ఉన్నారు. కృష్ణా జిల్లా పార్టీకి ఎప్పుడూ కంచుకోట‌గానే ఉంటోంది. 2009లో ప్రజారాజ్యం, ఓ వైపు వైఎస్ ప్రభంజ‌నం ఉన్నా కూడా జిల్లాలో ఈ రెండు పార్టీల‌కు చెక్ పెట్టి టీడీపీ స‌త్తా చాటింది. ఇక 2014లోనూ ఆ పార్టీ స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వ‌ర‌కు తిరుగులేని స‌త్తా చాటింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం చ‌తికిల ప‌డ‌క త‌ప్పలేదు. ఇత‌ర జిల్లాల్లో మాదిరిగా.. పార్టీ ఓడిపోయినా.. నాయ‌కులు మాత్రం సైలెంట్ కాలేదు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని అధినేత చంద్రబాబు బాగానే ఆశ‌లు పెట్టుకు న్నారు. మ‌రీ ముఖ్యంగా ఏక‌గ్రీవాలపైనా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఏక‌గ్రీవాల్లో వైసీపీయే పై చేయి సాధించింది.

తక్కువ స్థానాల్లో గెలవడంతో…..

పంచాయ‌తీ తొలి ద‌శ ఎన్నిక‌ల్లో అయినా టీడీపీ ఖ‌చ్చితంగా మెజార్టీ పంచాయ‌తీలు కైవ‌సం చేసుకుంటుంద‌నే అంద‌రూ అనుకున్నారు. తొలిద‌శ ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. మాత్రం టీడీపీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింది. ఫ‌లితాలు రాక‌ముందు వ‌ర‌కు.. కూడా.. నాయ‌కులు భారీ ఎత్తున స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అయితే.. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత మాత్రం.. కీల‌క నేత‌లు.. దేవినేని, వ‌ర్ల‌, బుద్దా వెంక‌న్న వంటివారు సైలెంట్ అయ్యారు. ఇక‌, క్క‌డి తొలి ద‌శ‌ ఫ‌లితాలు చూస్తే.. జిల్లాలో మొత్తం 234 పంచాయ‌తీల‌కు తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో వైసీపీ 168 చోట్ల విజ‌యం సాదించింది. ఇక‌, టీడీపీ కేవ‌లం 35 స్థానాల‌ను మాత్రం నిల‌బెట్టుకుంది. ఇత‌రులు.. 8 ద‌క్కించుకున్నారు. దీంతో టీడీపీ నేత‌ల నోళ్లు మూగ‌బోయాయి.

కసితో పనిచేయడంతో…..

ఇక‌, జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల ప‌రంగా చూస్తే.. మాజీ మంత్రి దేవినేని ఉమా ప‌రిధిలోని మైల‌వ‌రం ప‌రిధిలో నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా ఉన్న మైల‌వ‌రం మండ‌లంలో 13 పంచాయ‌తీల‌కు గాను ఒక్కచోట కూడా టీడీపీ మ‌ద్దతు దారుల‌ను గెలిపించుకోలేక పోయింది. నియోజ‌క‌వ‌ర్గానికి గుండెకాయ లాంటి ఇబ్రహీంప‌ట్నం మేజ‌ర్ పంచాయ‌తీని ఏకంగా కాంగ్రెస్ కైవ‌సం చేసుకుంది. ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గంలోని జి. కొండూరు మండ‌లంలో 23 పంచాయ‌తీల‌కు 20 వైసీపీ ఖాతాలో ప‌డగా.. టీడీపీ రెండే రెండు స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. ఉమాను ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్ అస్సలు టీడీపీకి సింగిల్ స‌ర్పంచ్ సీటు కూడా ఇవ్వలేదు. కేపీ చాలా క‌సితో ప‌నిచేశారు.

కంచుకోటల్లోనూ పసుపు పార్టీ….

జ‌గ్గయ్యపేటలో 16 పంచాయ‌తీలు ఉంటే 5 మాత్రమే టీడీపీకి ల‌భించాయి. ఇక టీడీపీకి ద‌శాబ్దాలుగా కంచుకోట‌గా ఉంటోన్న నందిగామ మండ‌లంలో మొత్తం 23 పంచాయ‌తీలు ఉంటే.. కేవ‌లం 3 చోట్ల మాత్రమే.. టీడీపీ ద‌క్కించుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వీరుల‌పాడు మండ‌లంలో వైసీపీ జోరు ముందు టీడీపీ కుదేలైంది. ఇక నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద 54 చోట్ల వైసీపీ స‌ర్పంచ్‌లు గెలిస్తే… టీడీపీ మ‌ద్దతుదారులు కేవ‌లం 15 స‌ర్పంచ్ స్థానాల‌తో స‌రిపెట్టుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు రంకెలు వేసిన బుద్ధా వెంక‌న్న, దేవినేని ఉమా లాంటి వాళ్ల గొంతులు ఇప్పుడు మూగ‌బోయాయి. ఏదేమైనా స్థానిక ఫ‌లితాలు కృష్ణా టీడీపీలో కీల‌క నేత‌ల‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. మిగిలిన ద‌శ ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో అయిన పార్టీ ప‌రువు నిలుస్తుందో ? లేదో ? చూడాలి.

Tags:    

Similar News