వీళ్లు బయటకు రారు.. ఇంకొకళ్లను రానివ్వరు
గత ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. హేమాహేమీలనుకున్న నేతలందరూ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా పార్టీ వైపు కన్నెత్తి చూడని వారు [more]
గత ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. హేమాహేమీలనుకున్న నేతలందరూ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా పార్టీ వైపు కన్నెత్తి చూడని వారు [more]
గత ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. హేమాహేమీలనుకున్న నేతలందరూ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా పార్టీ వైపు కన్నెత్తి చూడని వారు దాదాపు 70 శాతం మంది ఉన్నారు. కేవలం 30 శాతం మంది మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. అయితే కర్నూలు జిల్లాలోని ఆదోని లో తెలుగుదేశం పార్టీ ఉందా? లేదా? అన్న అనుమానం పార్టీలోనే వ్యక్తమవుతుండటం విశేషం.
వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో……
కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కర్నూలు జిల్లాలో పథ్నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. ఇందులో ఆళ్లగడ్డ, నంద్యాల, ఆలూరు మినహా మరెక్కడా టీడీపీ నేతలు యాక్టివ్ గా కన్పించడం లేదు. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఆదోని నియోజకవర్గంలో కూడా టీడీపీ జాడ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది.
మూడుసార్లు గెలిచి…..
1994, 1999, 2009 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా మీనాక్షినాయుడు గెలిచారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో మీనాక్షినాయుడు వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మూడు సార్లు గెలిచిన మీనాక్షి నాయుడు ఇప్పుడు వయో భారంతో పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో ఆదోనిలో పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆశలు వదులుకునట్లే కన్పిస్తుంది.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో…..
టీడీపీ ఇబ్బంది పడుతున్న మరో నియోజకవర్గం ఎమ్మిగనూరు. ఇక్కడ టీడీపీకి పట్టుంది. మాజీ మంత్రి బీవీమోహన్ రెడ్డి టీడీపీికి ఇక్కడ గట్టి పునాదులు వేశారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా జయనాగేశ్వర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక్కడ కూడా పార్టీ కార్యక్రమాలను పెద్దగా చేపట్టకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. మొత్తం మీద టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లోనే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు.