టీడీపీలో పత్తా లేకుండా పోయిన బావ, బావమరిది
ఏపీలో విపక్ష టీడీపీ నాయకుల్లో రోజు రోజుకు నైరాశ్యం పెరిగిపోతోంది. ప్రస్తుతం జరిగే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ కొంత మేరకు అయినా సత్తా చాటితే ఏమోగాని [more]
ఏపీలో విపక్ష టీడీపీ నాయకుల్లో రోజు రోజుకు నైరాశ్యం పెరిగిపోతోంది. ప్రస్తుతం జరిగే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ కొంత మేరకు అయినా సత్తా చాటితే ఏమోగాని [more]
ఏపీలో విపక్ష టీడీపీ నాయకుల్లో రోజు రోజుకు నైరాశ్యం పెరిగిపోతోంది. ప్రస్తుతం జరిగే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ కొంత మేరకు అయినా సత్తా చాటితే ఏమోగాని లేకపోతే ఆ పార్టీలో మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలతో మొదలు పెట్టి పలువురు కీలక నేతలు సైకిల్ దిగేందుకు రెడీగా ఉన్నారు. అసలు చాలా మంది నేతలు అసలు పార్టీలో ఉన్నామన్న స్పృహ లేకుండా ఉన్నారు. ఈ లిస్టులోనే ఓ బావ, బావమరిది కూడా ఉన్నారు. వాళ్లే కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు, మాండ్ర శివానందరెడ్డి. వీరిద్దరిది వేర్వేరు నేపథ్యం.. వేర్వేరు పార్టీలు.. అయినా గత ఎన్నికలకు ముందు ఒకే పార్టీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు.
పోలీస్ అధికారిగా…
పోలీస్ అధికారిగా ఉన్న మాండ్ర శివానందరెడ్డి గత ఎన్నికలకు ముందే టీడీపీలో ఉన్నారు. ఇక గౌరు వెంకటరెడ్డి గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీలో ఉన్నారు. గౌరు వెంకటరెడ్డి భార్య చరిత నందికొట్కూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో ఆమె వైసీపీ నుంచి పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆమె భర్త వెంకటరెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందు జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చరితకు సీటు ఇవ్వనని.. కాటసాని రాంభూపాల్ రెడ్డికే ఇస్తానని చెప్పడంతో గౌరు దంపతులు టీడీపీలో చేరారు.
ముందు నుయ్యి.. వెనక గొయ్యి….
ఆ ఎన్నికల్లో గౌరు చరిత పాణ్యం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 40 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఇటు నంద్యాల ఎంపీగా పోటీ చేసిన మాండ్ర శివానందరెడ్డి సైతం చిత్తుగా ఓడిపోయారు. ఎన్నికలకు ముందు వరకు వేర్వేరు పార్టీల్లో ప్రత్యర్థులుగా ఉన్న ఈ బావబావమరిది.. ఎన్నికల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ పత్తా లేకుండా పోయారు. గత టీడీపీ ప్రభుత్వంలో శివానందరెడ్డి అండ చూసుకుని దూకుడుగా ముందుకు వెళ్లిన టీడీపీ కేడర్ అంతా ఇప్పుడు తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారు. ఇక రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడతో ఈ బావ బావమరుదుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా మారింది.
పత్తా లేకుండా…?
గౌరు వెంకటరెడ్డి దంపతులకు జగన్ గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసినందుకు పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని చెప్పినా వినకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నా జగన్‌తో పాటు స్థానిక నేతలు ఆసక్తిగా లేరు. ఈ ఇద్దరు నేతల సైలెంట్‌తో కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉంది. మాండ్ర సంగతి ఎలా ఉన్నా ? గౌరు ఫ్యామిలీ మాత్రం పార్టీలో ఇంకెంతో కాలం కొనసాగదని స్థానికంగా వినిపించే టాక్ ?