టీడీపీకి అక్కడ మ‌ళ్లీ అవుట్ డేటెడ్ లీడ‌రే గ‌తా ?

టీడీపీ ప‌గ్గాలు చంద్రబాబు చేతుల్లోకి వ‌చ్చాక అస‌లు టీడీపీ గెల‌వ‌ని నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. 1994లో ఎన్టీఆర్ ప్రభంజ‌నంలో మాత్రమే టీడీపీ గెలిచి… ఆ త‌ర్వాత ప‌సుపు [more]

Update: 2021-05-20 06:30 GMT

టీడీపీ ప‌గ్గాలు చంద్రబాబు చేతుల్లోకి వ‌చ్చాక అస‌లు టీడీపీ గెల‌వ‌ని నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. 1994లో ఎన్టీఆర్ ప్రభంజ‌నంలో మాత్రమే టీడీపీ గెలిచి… ఆ త‌ర్వాత ప‌సుపు జెండా ఎగ‌ర‌క‌పోవ‌డ‌మో లేదా ఒక్కసారి ఎగ‌ర‌డ‌మో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి పూర్తిగా దిగ‌జారిపోయింది. ఇది ఎంత‌కు దిగ‌జారింది అంటే చివ‌ర‌కు అక్కడ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు స‌రైన నాయ‌కుడు కూడా లేని దుస్థితి. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న గుంటూరు జిల్లాలోనే మూడు నాలుగు ఉన్నాయి. బాప‌ట్ల, మాచ‌ర్ల, న‌ర‌సారావుపేట‌, గుంటూరు తూర్పు, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాలు ఇందుకు నిద‌ర్శనం. ప‌ల్నాడులో ఉన్న మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ చివ‌ర‌కు ఏ ఎన్నిక జ‌రిగినా గెలుపు అనేది మ‌ర్చిపోయి రెండు ద‌శాబ్దాలు దాటిపోయింది. చివ‌ర‌గా ఇక్కడ 1999లో మాత్రమే టీడీపీ నుంచి పోటీ చేసిన జూల‌కంటి దుర్గాంబ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత మాచ‌ర్ల అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎలా ఉంటుందో ? టీడీపీ మ‌ర్చిపోయింది.

వార్ వన్ సైడ్ గానే…?

2004, 2009, 2012 ఉప ఎన్నిక‌, 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస ఓట‌ముల‌తో కుదేలైంది. 2004లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ల‌క్ష్మారెడ్డి గెల‌వ‌గా.. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే పిన్మెల్లి రామ‌కృష్ణా రెడ్డి నాలుగు వ‌రుస విజ‌యాల‌తో మాచ‌ర్లను త‌న కంచుకోట చేసుకున్నారు. కాంగ్రెస్‌, వైసీపీ ఏ పార్టీ అయినా , సాధార‌ణ‌, ఉప ఎన్నిక అయినా గెలుపు ఆయ‌న‌దే అవుతోంది. విచిత్రం ఏంటంటే పిన్మెల్లి గెలిచిన నాలుగు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ నుంచి ప్రతి ఎన్నిక‌కు ఒక్కరు చొప్పున పోటీ చేశారు. అయినా వార్ ఎప్పుడూ వ‌న్‌సైడే అవుతోంది.

ప్రతి ఎన్నికకు అభ్యర్థిని మారుస్తూ….

2009లో బ్రహ్మానంద‌రెడ్డి, 2012లో చిరుమామిళ్ల మ‌ధుబాబు, 2014లో చ‌ల‌మారెడ్డి, 2019లో అన్నపురెడ్డి అంజిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ప్రతి ఎన్నిక‌కు ఓ కొత్త ముఖాన్ని తెచ్చిపెట్టడం.. ఎన్నిక‌ల్లో వారు ఓడిపోయాక మ‌రో నేత‌కు.. అది కూడా ఎన్నిక‌ల చివ‌ర్లో సీటు ఇవ్వడంతో మాచర్లలో టీడీపీ చిత్తుగా ఓడిపోతోంది. 2014లో ఇక్కడ చ‌ల‌మారెడ్డి ఓడిపోగా ఐదేళ్లు ఆయ‌నే ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు య‌ర‌ప‌తినేని ప‌ట్టుబ‌ట్టి యువ‌కుడు అయిన అంజిరెడ్డికి సీటు వ్వ‌గా ఆయ‌న కూడా ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారు. ఇక తాజా స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో మాచ‌ర్ల వైసీపీ ఏక‌గ్రీవాలు రాష్ట్ర స్థాయిలో రికార్డులు సృష్టించాయి.

మున్సిపల్ ఎన్నికల్లో…..

మాచ‌ర్ల మున్సిపాల్టీలో 33కు 33 వార్డులు వైసీపీ ఖాతాలో ఏక‌గ్రీవం అయ్యాయి. స‌ర్పంచ్‌లు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని వైసీపీ ఏక‌గ్రీవంతో స్వీప్ చేసి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డుల సంగ‌తి ఎలా ? ఉన్నా స్థానిక ఎమ్మెల్యే రామ‌కృష్ణా రెడ్డి, ఆయ‌న సోద‌రుడు దూకుడు చ‌ర్యల‌పై నియోజ‌క‌వ‌ర్గంలో వ్యతిరేక‌త ఎక్కువే ఉంద‌న్న టాక్ జ‌నాల్లో వ‌స్తోంది. దీనికి తోడు వ‌రుస‌గా నాలుగు సార్లు గెల‌వ‌డంతో పిన్మెల్లిపై వ్యతిరేక‌త ఉంది. ఈ క్రమంలోనే మాచ‌ర్ల టీడీపీని బ‌తికించాలంటే మాజీ నేత బ్రహ్మానంద‌రెడ్డే క‌రెక్ట్ అని జిల్లా పార్టీ నాయ‌కులు ఆలోచ‌న చేస్తుండ‌డం ఆశ్చర్యంగా ఉంది.

మరోసారి రాంగ్ స్టెప్…?

బ్రహ్మానంద‌రెడ్డి మాచ‌ర్ల‌లో వ‌రుస‌గా రెండు సార్లు ఓడిపోయాకే ఆయ‌న్ను ప‌క్కన పెట్టారు. ఆ త‌ర్వాత మ‌రో న‌లుగురు నేత‌ల‌ను మార్చ‌రు. ఇలాంటి టైంలో మ‌ళ్లీ బ్ర‌హ్మానంద‌రెడ్డికి మంచి పేరు ఉంద‌ని.. ఆయ‌న్ను ఇక్కడ పెడితే సానుభూతితో గెలుస్తామ‌ని లెక్కలు వేస్తుండ‌డం ఎవ్వరికి అంతు ప‌ట్టడం లేదు. ఇప్పటికే పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న టీడీపీ అధిష్టానం.. మ‌రోసారి మాచ‌ర్ల విష‌యంలో మ‌రో రాంగ్ స్టెప్ వేస్తుందా ? అని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News