30 ఏళ్ల ప‌సుపు కోట అక్కడ అందుకే బ‌ద్దలైందా ?

సీఎం జ‌గ‌న్ ప్రభంజ‌నం ప‌ల్లె, ప‌ట్టణం అన్న తేడా లేకుండా కొన‌సాగ‌డంతో ఏపీలో ఒక్క తాడిప‌త్రి మున్సిపాల్టీ మిన‌హా అన్ని చోట్లా ఫ్యాన్ గాలిలో అన్ని పార్టీలు [more]

Update: 2021-04-01 08:00 GMT

సీఎం జ‌గ‌న్ ప్రభంజ‌నం ప‌ల్లె, ప‌ట్టణం అన్న తేడా లేకుండా కొన‌సాగ‌డంతో ఏపీలో ఒక్క తాడిప‌త్రి మున్సిపాల్టీ మిన‌హా అన్ని చోట్లా ఫ్యాన్ గాలిలో అన్ని పార్టీలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సాధించిన 151 సీట్ల ప్రభంజ‌నంలో చాలా చోట్ల టీడీపీ కంచుకోట‌లు బ‌ద్దల‌య్యాయి. ఆ గాలిలో త‌ప్పుకున్న కొన్ని కంచుకోట‌లు ఈ సారి పుర‌పోరులో కూలిపోయాయి. ఈ లిస్టులో తూర్పు గోదావ‌రి జిల్లా మండ‌పేట మున్సిపాల్టీ కూడా ఉంది. మండ‌పేట టీడీపీ అడ్డా.. గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఇక్కడ మున్సిపాల్టీలో ఆ పార్టీదే ఆధిప‌త్యం. ఇంకా చెప్పాలంటే గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ టీడీపీ భారీ మెజార్టీల‌తో ఘ‌న‌విజ‌యాలు సాధిస్తూ వ‌స్తోంది.

టీడీపీ ఆవిర్భవించిన తర్వాత…..

టీడీపీ ఆవిర్భవించాక 1987లో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌద‌రి భార్య మునిసిప‌ల్ చైర్‌ప‌ర్సన్‌గా గెలిచారు. ఆ త‌ర్వాత జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఇక్కడ టీడీపీ వ‌రుస విజ‌యాలు సాధించింది. 1995.. 2000.. 2005.. 2014లో టీడీపీనే ఇక్కడ గెలుపొందింది. అందుకుభిన్నంగా ఈసారి మాత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 2005లో వైఎస్ ప్రభంజ‌నంలో జిల్లాలో అన్ని మున్సిపాల్టీల్లో నాడు కాంగ్రెస్ గెలిచినా మండ‌పేట‌లో మాత్రం టీడీపీ గెలిచింది. ప్రస్తుత ఎమ్మెల్యే జోగేశ్వర‌రావు సైతం మునిసిప‌ల్ చైర్మన్‌గా ప‌నిచేశారు.

జగన్ ఫోకస్ పెట్టడంతో….

2009, 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు వ‌రుస విజ‌యాలు సాధిస్తూ మండ‌పేట‌ను టీడీపీ కంచుకోట‌గా మార్చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వేవ్‌లోనూ మండ‌పేట‌లో జోగేశ్వర‌రావు 10వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇందులో 6 వేల వ‌ర‌కు మెజార్టీ మండ‌పేట మున్సిపాల్టీ నుంచే వ‌చ్చింది. అయితే ఈ సారి మాత్రం జ‌గ‌న్ మండ‌పేట‌పై ప్రత్యేకంగా ఫోక‌స్ పెట్టడం ఓ కార‌ణం అయితే.. ఇక్క‌డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న తోట త్రిమూర్తుల‌కు ఈ ఎన్నిక చావోరేవోగా మార‌డంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప‌సుపు కోట‌ను బ‌ద్దలు కొట్టారు.

త్రిమూర్తులు రంగంలోకి దిగి…

నియోజ‌క‌వ‌ర్గంలో కాపు ఓటు బ్యాంకు కూడా 40 వేల వ‌ర‌కు ఉంది. అయితే ఇక్కడ ఆ సామాజిక వ‌ర్గానికి ఎప్పుడూ సీటు ఏ పార్టీ ఇవ్వలేదు. ఈ సారి తోట త్రిమూర్తులు వంటి బ‌ల‌మైన నేత ఇక్కడ ఉండ‌డంతో ఆ సామాజిక వ‌ర్గం వారంతా ఆయ‌న వెంట న‌డిచారు. ఆయ‌న కూడా కాపుల‌ను ఏక‌తాటిమీద‌కు తీసుకు రావ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఇక వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తోన్న జోగేశ్వర‌రావుపై సొంత సామాజిక వ‌ర్గమైన క‌మ్మల్లోనే కొంత వ్యతిరేక‌త ఉండ‌డం కూడా త్రిమూర్తులు బాగా క్యాష్ చేసుకున్నారు.

బీసీల్లో మార్పు రావడంతో….

ఈ సారి బీసీల్లో కూడా కొంత మార్పు రావ‌డం టీడీపీకి దెబ్బ ప‌డింది. ఇక్కడ ఏ ఎన్నిక జ‌రిగినా జోగేశ్వర‌రావు స‌వాల్‌గా తీసుకుంటారు. అందుకే మునిసిప‌ల్ ఎన్నిక అయినా, అసెంబ్లీ అయినా గెలుపు టీడీపీదే అవుతోంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2005లో కూడా ఇక్కడ క‌సితో ప‌నిచేసి మున్సిపాల్టీని గెలిచారు. అయితే ఈ సారి మాత్రం ఆయ‌న చాలా నిస్తేజంగా ఉన్నారు. ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోలేదు. పైకిఎలా ఉన్నా లోప‌ల మాత్రం అధికార పార్టీ నుంచి ఆయ‌న వ్యాపారాల‌పై ఒత్తిళ్లు రావ‌డంతోనే ఆయ‌న సైలెంట్ అయ్యార‌న్న ప్రచారం కూడా బ‌య‌ట న‌డిచింది. ఏద‌మైనా మండ‌పేట మున్సిపాల్టీ మూడు ద‌శాబ్దాల త‌ర్వాత సైకిల్ నుంచి చేజారింది.

Tags:    

Similar News