Mangalagiri : మంగళగిరి ఈసారి మలుపు తిప్పుతుందా?
మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి [more]
మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి [more]
మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి అందరి నోళ్లలోనూ నానింది. ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ లోకేష్ ఓటమి పాలు కావడంతో మంగళగరి 2019 ఎన్నికల్లోనే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి మంగళగిరి నియోజకవర్గం వార్తల్లో నిలిచింది.
వరస విజయాలతో…
మంగళగిరి నియోజకవర్గం నుంచి వరసగా ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీడీపీ వేవ్ లోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. ఇక చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత మంగళగిరిలో టీడీపీ మరింత పుంజుకుంటుందని భావించారు. కానీ మంగళగిరి ప్రజలు మాత్రం రాజధాని కాకుండా ప్రభుత్వాన్ని మార్చడం కోసం మరోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎన్నుకున్నారు.
పోటీ చేయనన్నా….
గత ఎన్నికల సమయంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను మంగళగిరి నుంచి పోటీ చేయనని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు తనకు అనుకూల నియోజకవర్గం కాదని ఆయన భావించారు. కానీ జగన్ పట్టుబట్టి మరీ ఆళ్లను మంగళగిరి నుంచి పోటీ చేయించారు. ఎన్నికల ప్రచారంలో తాను మంత్రిని చేస్తానని కూడా జగన్ ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మార్పు ప్రకటన ఇక్కడ ఆళ్లకు క్రమంగా పట్టుసడలుతుందని చెబుతున్నారు.
బలం పెంచుకుంటుందా?
తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష‌్కరించినా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో టీడీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 14 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 9 స్థానాల్లో విజయం సాధించింది. క్రమంగా టీడీపీ మంగళగిరిలో పట్టు పెంచుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో తమదే విజయం అని చెప్పుకుంటున్న వైసీపీకి పరిషత్ ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయంగా ఇరుకున పెట్టాయి.