టీడీపీలో తార‌క రామానాయుడు ఎంట్రీ ?

ఏపీలో విప‌క్ష తెలుగుదేశం పార్టీలో వార‌సుల హ‌డావిడి మామూలుగా లేదు. గ‌త ఎన్నిక‌ల్లోనూ అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు కృష్ణా మీదుగా అటు రాయ‌ల‌సీమ జిల్లాల వ‌ర‌కు [more]

Update: 2021-09-11 06:30 GMT

ఏపీలో విప‌క్ష తెలుగుదేశం పార్టీలో వార‌సుల హ‌డావిడి మామూలుగా లేదు. గ‌త ఎన్నిక‌ల్లోనూ అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు కృష్ణా మీదుగా అటు రాయ‌ల‌సీమ జిల్లాల వ‌ర‌కు ఎక్కువ మంది వార‌సులు పార్టీ త‌ర‌పున తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. ఈ వార‌సుల్లో రాజ‌మ‌హేంద్రవ‌రం సిటీ నుంచి పోటీ చేసి ఆదిరెడ్డి భ‌వానీ మిన‌హా ఎవ్వరూ విజ‌యం సాధించ‌లేదు. ఇక ఇప్పుడు పార్టీ ఓట‌మి త‌ర్వాత మ‌రి కొంత మంది వార‌సులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీలో యువ‌ర‌క్తం మ‌రింత ఎక్కువ కానుంది. ఈ క్రమంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఓ బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమ‌వుతోంది.

పతివాడ మనవడు….

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ప‌తివాడ నారాయ‌ణ స్వామి నాయుడు మ‌న‌వ‌డు ప‌తివాడ తార‌క రామానాయుడును 2024 ఎన్నిక‌ల బ‌రిలో దింపేందుకు ప‌తివాడ ఫ్యామిలీ నిర్ణయం తీసుకుంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడిగా ఉన్న నారాయ‌ణ స్వామి గ‌తంలో ర‌ద్దయిన భోగాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న కొత్తగా ఏర్పడిన నెల్లిమ‌ర్ల నుంచి ఏడో సారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.

వృద్ధాప్యంలో ఉన్నా….?

గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న వృద్ధాప్యంతో ఉండ‌డంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయ‌న వార‌సుల్లో ఎవ‌రో ఒక‌రికి సీటు ఇవ్వాల‌నుకున్నారు. ఈ క్రమంలోనే ప‌తివాడ రెండో కుమారుడు త‌మ్మినాయుడు పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే అక్కడ టిక్కెట్ ఆశించే మిగిలిన ఆశావాహులు ఎక్కువుగా ఉండ‌డంతో చివ‌ర‌కు చంద్రబాబు తిరిగి ప‌తివాడ నారాయ‌ణ స్వామికే సీటు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ కుటుంబంలో అంద‌రూ ఒకేమాట మీద‌కు వ‌స్తున్నట్టు తెలిసింది.

తన కుమారుడికే…..

ప‌తివాడ కుమారుడు అప్పల‌నాయుడు కుమారుడు అయిన తార‌క రామానాయుడును తెర‌మీద‌కు తెస్తున్నారు. ఫ్యామిలీలో రామానాయుడికే సీటు ఇప్పించుకోవాల‌ని ప్రయ‌త్నాలు చేస్తున్నారు. నెల్లిమ‌ర్ల టీడీపీ టిక్కెట్ కోసం తెలుగుదేశం పార్టీలో పోటీ ఎక్కువుగా ఉండ‌డంతో ఈ ఫ్యామిలీ అంతా ఒకే తాటిమీద‌కు వ‌స్తున్నారు. ఇక తార‌క రామానాయుడు నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్యటిస్తున్నారు. లోకేష్‌తో ఎక్కువ సాన్నిహిత్యంతో ఉంటోన్న ఆయ‌న‌కు ఇటీవ‌లే విజ‌య‌న‌గ‌రం పార్లమెంట‌రీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్ష ప‌ద‌వి కూడా క‌ట్టబెట్టారు.

గ్రూపులన్నీ ఏకమైతేనే?

సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్పల‌నాయుడుకు ఆయ‌నే స‌రైన ప్రత్యర్థి అని అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా అక్కడ రెండు సార్లు గెలిచి బ‌లంగా ఉన్న అప్పల‌నాయుడును ఢీ కొట్టాలంటే.. తెలుగుదేశం పా

Tags:    

Similar News