సత్తా ఉన్న ఎమ్మెల్యేలున్నా ఆ నాలుగు చోట్ల అంతేనా?
టీడీపీ హయాంలో దూకుడుగా ఉన్న ఒకే జిల్లాల్లో (అంటే రెండు)ని నాలుగు నియోజకవర్గాలు ఇప్పుడు ఎటూకాకుండా ఉండిపోయాయి. నిజానికి పార్టీ ఏదైనా.. నియోజకవర్గంలో గెలిచిన నాయకుడు సత్తా [more]
టీడీపీ హయాంలో దూకుడుగా ఉన్న ఒకే జిల్లాల్లో (అంటే రెండు)ని నాలుగు నియోజకవర్గాలు ఇప్పుడు ఎటూకాకుండా ఉండిపోయాయి. నిజానికి పార్టీ ఏదైనా.. నియోజకవర్గంలో గెలిచిన నాయకుడు సత్తా [more]
టీడీపీ హయాంలో దూకుడుగా ఉన్న ఒకే జిల్లాల్లో (అంటే రెండు)ని నాలుగు నియోజకవర్గాలు ఇప్పుడు ఎటూకాకుండా ఉండిపోయాయి. నిజానికి పార్టీ ఏదైనా.. నియోజకవర్గంలో గెలిచిన నాయకుడు సత్తా చాటాలి. కానీ, ఆ పరిస్థితి ఓ నాలుగు నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో నాలుగు చోట్ల టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అదేవిధంగా విశాఖలో నాలుగు సీట్లు సొంతం చేసుకుంది. ఈ రెండు జిల్లాల్లోనూ రెండేసి సీట్లలో పరిస్థితి డోలాయమానంగా ఉంది. కొందరు ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. మరికొందరు మారుదామా ? వద్దా అనే తర్జన భర్జనలో ఉన్నారు. వీరిలో కొందరు సీనియర్లు కూడా ఉండడం గమనార్హం.
యాక్టివ్ గా లేకపోవడంతో……
విశాఖపట్నాన్ని తీసుకుంటే నగరం పరిధిలోని నాలుగు నియోజకవర్గాలు టీడీపీ వశమయ్యాయి. అదేవిధంగా ప్రకాశంలో పరుచూరు, చీరాల, అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో టీడీపీ ఉనికిని చాటుకుంది. అయితే ఈ ఎనిమిది చోట్ల కూడా నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా లేకపోవడం గమనార్హం. కొండపి నియోజకవర్గంలో డోలా బాలవీరాంజనేయులుకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కేవలం ఒక వర్గం వారినే ఆయన చేరదీస్తున్నారని ఇక్కడి టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. పైగా అభివృద్ధి అసలు ముందుకు సాగడం లేదు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మరోవైపు ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. అవి వైసీపీ నేతలకు అందుతున్నాయే తప్ప నియోజకవర్గం ఎమ్మెల్యే వరకు అవి చేరడం లేదు.
అధికార పార్టీ వ్యూహంతో….
ఇక స్వామి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే దామచర్ల సోదరుల్లో సత్య వైపు ఉండి.. అటు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడిగా ఉన్న జనార్థన్‌తో విబేధించారు. ఈ వర్గ పోరు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. ఇక, అద్దంకిలో గెలిచిన గొట్టిపాటి రవి పరిస్థితి కూడా ఇలానే ఉంది. పార్టీ మారితే.. నిధులు ఇస్తామనే ప్రతిపాదన వచ్చింది. ఆయన గ్రానైట్ వ్యాపారాలపై ప్రభుత్వం గట్టిగా టార్గెట్ చేయడంతో కొద్ది రోజులు సైలెంట్ అయిన ఆయన మళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి యాక్టివ్ అవుతున్నారు. అయితే అద్దంకిలో అధికార పక్షం నిర్వీర్యంగా ఉంది.. దానిని అంది పుచ్చుకుని అద్దంకిలో పార్టీని మరింత స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం రవిపై ఉన్నా ఆ ఛాన్స్‌ను అందిపుచ్చుకున్నట్టుగా లేదు.
నిధులు అందకపోవడంతో…..
విశాఖలో ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావుకు కూడా నిధులు అందడం లేదు. అక్కడ గంటాపై గత ఎన్నికల్లో ఓడిన వైసీపీ సమన్వయకర్త కెకె. రాజు నియోజకవర్గంలో దూసుకు పోతున్నారు. అసలు గంటా టీడీపీలో ఉంటారో ? లేదో ? అన్న డైలమా ఉండడంతో టీడీపీ కేడర్ గందరగోళంలో ఉంది. కొద్ది రోజుల క్రితమే ఆయన టీడీపీ నియోజకవర్గ సమావేశం పెట్టినా పార్టీ నేతలు ఆయనపై నమ్మకంతో లేరు. దీంతో ఇక్కడ పార్టీకి ఎమ్మెల్యే ఉన్నా కేడర్ దిగాలుగా ఉంది.
గట్టిగా టార్గెట్ చేస్తుండటంతో…..
విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. ఎన్నారైల నుంచి నిధులు సేకరిస్తున్నారు. పార్టీ కేడర్‌కు, నియోజకవర్గ ప్రజలకు చిన్నా చితకా పనులు చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి మాత్రం సహకారం లేదు. ఈ విషయంలో ఆయన అసెంబ్లీలో పోరాడాలని చంద్రబాబుకు పదేపదే విన్నవించుకున్నా ఉపయోగం లేదు. పైగా ఇటీవల అధికార పార్టీ వెలగపూడిని గట్టిగా టార్గెట్ చేస్తుండడంతో ఆయన పరిస్థితి కక్కలేక మింగలేని చందంగా ఉంది. ఏదేమైనా పార్టీ గెలిచిన కీలకమైన ఈ నాలుగు నియోజకవర్గాల్లో మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటే టీడీపీకి ఎఫెక్ట్ తప్పేలా లేదు.