టీడీపీని డమ్మీని చేద్దామని
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ఉన్న టీడీపీ నేతల మధ్య ఆధిపత్య రాజకీయాలు బాగానే సాగుతు న్నాయి. ఈ క్రమంలో చాలా జిల్లాల్లో వైసీపీ నేతలు తమ [more]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ఉన్న టీడీపీ నేతల మధ్య ఆధిపత్య రాజకీయాలు బాగానే సాగుతు న్నాయి. ఈ క్రమంలో చాలా జిల్లాల్లో వైసీపీ నేతలు తమ [more]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ఉన్న టీడీపీ నేతల మధ్య ఆధిపత్య రాజకీయాలు బాగానే సాగుతు న్నాయి. ఈ క్రమంలో చాలా జిల్లాల్లో వైసీపీ నేతలు తమ పట్టు పెంచుకుంటున్నారు. బదిలీలు, నిర్ణయాల విషయాలను అన్నిటింనీ తమ కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో సరే! దీనిని ఎవరూ తప్పు పట్టరు. కానీ, వైసీపీ నేతలు ఓడిపోయిన నియోజకవర్గాల్లోనూ తమ హవానే సాగించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు వివాదాలకు, తీవ్ర ఘర్షణలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఈ తరహా పరిస్థితి ప్రకాశం జిల్లాలో మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
జగన్ సునామీని తట్టుకుని….
ప్రకాశం జిల్లాలో నాలుగు స్థానాల్లో వైసీపీ ఓడిపోయి.. టీడీపీ విజయం సాధించింది. చీరాల, అద్దంకి, పరుచూరు, కొండపి (ఎస్సీ) నియోజకవర్గాల్లో జగన్ సునామీని తట్టుకుని మరీ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఆధిపత్య రాజకీయాలకు తెరదీశారు. ఓడిపోయినా.. తమ మాటే చెల్లాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న నేపథ్యంలో తామే చక్రం తిప్పుతామని, గెలిచిన టీడీపీ నాయకులను డమ్మీలు చేస్తామని బహిరంగంగానే ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం పాల్గొంటున్న టీడీపీ ఎమ్మెల్యేలకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.
ఆమంచి అంతా తానే అయి….
కొండపిలో టీడీపీ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయస్వామి గెలిచారు. ఇక్కడ మాదాసు వెంకయ్య వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. అయితే, మాదాసు తన ఆధిపత్యమే నెగ్గాలని హల్‌చల్ చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే డోలాను అడ్డుకున్నారు. ఈ పరిస్థితి ఇంకా రగులుతూనే ఉంది. ఇక, చీరాలలో టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత కరణం బలరాం విజయం సాధించారు. అయితే, ఇక్కడ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పట్టుకోసం పాకులాడుతున్నారు. అధికారుల బదిలీ నుంచి నిర్ణయాలు, పనులు, కాంట్రాక్టుల వరకు అన్నీ తన నిర్ణయం మేరకే జరిగేలా చాపకింద నీరులా వ్యవహరిస్తున్నారు.
దగ్గుబాటి నిర్ణయాలతో….
అదే సమయంలో పరుచూరులోనూ ఆధిపత్య హోరు.. జోరుగా సాగుతోంది. ఇక్కడ నుంచి రెండో సారి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. అయితే, వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన ఆధిపత్యం చెల్లాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తనమాట ప్రకారమే నడవాలని ఆయన ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఇలా ఉంటే.. ఒక్క అద్దంకిలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి ఒకింత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి ఓడిపోయిన వైసీపీ నాయకుడు చెంచు గరటయ్య.. ప్రస్తుతానికి మౌనం గానే ఉన్నారు. అయితే, ఆయన కూడా నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ వర్సెస్ వైసీపీ ఘర్షణలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.