ఆపే శక్తి ఈయనకు లేదు…ఆగే ఆలోచన వారికి లేదు
కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో నేడు టీడీపీ కనుమరుగై పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు పార్టీని విడిచి వెళ్లిపోతుండటంతో అధినేత చంద్రబాబులో ఆందోళన నెలకొంది. పార్టీకి, [more]
కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో నేడు టీడీపీ కనుమరుగై పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు పార్టీని విడిచి వెళ్లిపోతుండటంతో అధినేత చంద్రబాబులో ఆందోళన నెలకొంది. పార్టీకి, [more]
కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో నేడు టీడీపీ కనుమరుగై పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు పార్టీని విడిచి వెళ్లిపోతుండటంతో అధినేత చంద్రబాబులో ఆందోళన నెలకొంది. పార్టీకి, క్యాడర్ కొండంత అండగా నిలబడిన నేతలు, ఆర్థికంగా అన్ని రకాలుగా చేయూత నిచ్చే లీడర్లు సయితం పసుపు పార్టీకి హ్యాండ్ ఇస్తుండటంతో కలవరం ప్రారంభమయింది. వారిని ఆపే శక్తి ిఇప్పుడు చంద్రబాబుకు లేదు. నాలుగేళ్లకు పైగా ఎన్నికలకు సమయం ఉండటంతో వారికి ఏంచెప్పి బుజ్జగించాలో తెలియని పరిస్థితి.
ఆర్థికంగా ఇబ్బందులు….
ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేయడం, రాజకీయంగా భవిష్యత్తుపై హామీ ఇవ్వడంతోనే ప్రకాశం జిల్లా నుంచి పెద్దయెత్తున నేతలు వలస పోతున్నారు. కరణం బలరాంం పార్టీ మారతారన్నది చంద్రబాబు కూడా ఊహించలేదు. రాజకీయాల్లో చంద్రబాబుతో సమానంగా కరణం బలరాం వచ్చారు. అలాంటి ఆయన పార్టీ మారడంతో జిల్లాలో అనేక మంది నేతలు వైసీపీలోకి క్యూ కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఇక ముగ్గురు ఎమ్మెల్యేలే టీడీపీకి మిగిలారు.
కరణం మారడంతో….
కరణం బలరాం పార్టీ మారడంతో ఆయన వెంట నడవాలని మాజీ మంత్రి శిద్ధారాఘరావు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. తొలుత ఆయన సోదరుల కుమారులు వైసీపీ కండువా కప్పుకున్నారు. శిద్ధారాఘవరావు పార్టీని ఆర్థికంగా ఇన్నాళ్లూ ఆదుకున్నారు. గ్రానైట్ వ్యాపారి అయిన శిద్ధా రాఘవరావు గత ఎన్నికల సమయంలోనూ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫైనాన్స్ చేశారు. అందుకే ఆయనకు చంద్రబాబు పార్లమెంటు టిక్కెట్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తన వ్యాపార సంస్థలపై దాడులు పెరిగిపోవడం, వందల కోట్ల జరిమానాలు విధించడంతో ఆయన పార్టీ మారక తప్పేట్లు లేదు.
ఈ నెల 25వ తేదీన……
ీఈ నెల 25వ తేదీన శిద్ధారాఘవరావు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మంతనాలు జరుపుతున్న శిద్ధా రాఘవరావు తన చేరికపై స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నారు. శిద్ధారాఘవరావుతో పాటు మరో ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరే అవకాశముందంటున్నారు. మొత్తం మీద కరణం బలరాం కుటుంబం వైసీపీలో చేరిన తర్వాత మిగిలిన నేతల ఆలోచనలో మార్పు వచ్చిందంటున్నారు. త్వరలోనే ప్రకాశం టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయంటున్నారు.