అక్కడ వైసీపీ గెలిస్తే టీడీపీ స్మాషే ?

టీడీపీకి బలం గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో గట్టిగా ఉంది. ఇక కృష్ణా, గుంటూరు ట్రెడిషనల్ గా ఉండే సామాజిక వర్గం మద్దతుతో ఏపీలో ఏడు జిల్లాలలో [more]

Update: 2021-05-20 12:30 GMT

టీడీపీకి బలం గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో గట్టిగా ఉంది. ఇక కృష్ణా, గుంటూరు ట్రెడిషనల్ గా ఉండే సామాజిక వర్గం మద్దతుతో ఏపీలో ఏడు జిల్లాలలో తిరుగులేని ఆధిపత్యాన్ని టీడీపీ చూపిస్తూ వస్తోంది. అయితే జగన్ అధికారం చేపట్టాక ఉత్తరాంధ్రను టీడీపీకి దూరం చేశారు, కృష్ణా, గుంటూరులలో కూడా పట్టు సాధించారు. గోదావరి జిల్లాలలో కూడా గట్టిగానే దూకుడు చూపుతున్నారు. అయితే పూర్తిగా టీడీపీ పునాదులు అక్కడ పూర్తిగా లేపేస్తేనే తప్ప సైకిల్ కి పంక్చర్ పడదు అన్నది జగన్ థియ‌రీగా ఉంది.

ప్రతిష్టాత్మకమే…?

విశాఖను ఆనుకుని ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఓడినా బలం బాగానే ఉంది. ముఖ్యంగా రాజమండ్రి లో ఆ పార్టీ పునాదులు గట్టిగానే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎంత బలంగా వీచినా కూడా రాజమండ్రీ అర్బన్, రూరల్ సీట్లు రెండూ టీడీపీ పరం అయ్యాయి అంటేనే సైకిల్ జోరు అక్కడ ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే రాజమండ్రీ కార్పోరేషన్ కి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ గెలవడం టీడీపీకే కాదు, వైసీపీకి కూడా ప్రతిష్టాత్మకమని అంటున్నారు.

హ్యాట్రిక్ విజయం….

ఇక రాజమండ్రీ గురించి చెప్పాలంటే ఇప్పటికి మునిసిపాలిటీ నుంచి కార్పోరేషన్ దాకా ఎన్నికలు పెడితే వరసగా మూడు సార్లు టీడీపీ జెండావే అక్కడ ఎగిరింది. అంతే కాదు ఎపుడు ఎన్నికలు జరిగినా రాజమండ్రీలో మరోసారి గెలిచి తీరుతామని అర్బన్ ఎమ్మెల్యే, కింజరాపు వారి ఆడపడుచు భవానీ గట్టిగానే చెబుతున్నారు. అలాగే సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఇక్కడ గెలుపు కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. రాజమండ్రీ నుంచి బీసీ కోటాలో యువకుడు అయిన మార్గాని భరత్ కి టికెట్ ఇచ్చి ఎంపీ సీటుని గెలుచుకున్న వైసీపీ అదే స్ట్రాటజీని కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అమలు చేయబోతోంది అంటున్నారు.

ఆపరేషన్ ఆకర్ష్ ….

ఇప్పటికే ఏపీవ్యాప్తంగా టీడీపీ చతికిలపడింది. అలాటిది రాజమండ్రీలో కనుక తలెత్తుకుంటే కొత్త బలం వస్తుంది. దాంతో గట్టి నాయకులను ఇప్పటి నుంచే వైసీపీ వైపుగా లాగేసే పని జోరుగా సాగుతోంది. ఇక ఇక్కడ రెండవ మాటకు తావు లేకుండా మొత్తం గెలుపు బాధ్యతలను ఎంపీ భరత్ కే జగన్ అప్పగించారు అంటున్నారు. యాభై వార్డులు గా ఉండే రాజమండ్రీ కార్పొరేషన్ ని స్వీప్ చేయాలని కూడా వైసీపీ గట్టిగా డిసైడ్ అయింది. దీంతో భరత్ నైరాశ్యంలో ఉన్న టీడీపీని బాగానే టార్గెట్ చేస్తున్నారు. అలాగే ఉన్న ఇద్దరు ఎమ్మెల్యెల మధ్య ఉన్న విభేదాలను కూడా చక్కగా ఉపయోగించుకోవడం ద్వారా వైసీపీకి రాజమండ్రీని అందించాలని చూస్తున్నారు. మొత్తానికి రాజమండ్రీ కార్పొరేషన్ కనుక వైసీపీ గెలిస్తే ఇక సైకిల్ పార్టీకి గోదావరి జిల్లాలలో గట్టి దెబ్బ పడిపోయినట్లే అంటున్నారు.

Tags:    

Similar News