రమణా ఇక మూసేద్దామా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. ఇక ఇక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం కష్టంగా మారిందన్న కామెంట్స్ పార్టీ అధినాయకత్వం నుంచే విన్పిస్తున్నాయి. ఇక్కడ ఖర్చు [more]

Update: 2021-04-11 09:30 GMT

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. ఇక ఇక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం కష్టంగా మారిందన్న కామెంట్స్ పార్టీ అధినాయకత్వం నుంచే విన్పిస్తున్నాయి. ఇక్కడ ఖర్చు చేసే ప్రతిరూపాయి వృధాయేనన్న నిర్ణయానికి టీడీపీ అధినాయకత్వం వచ్చిందంటున్నారు. అందుకే క్రమంగా ఇక్కడ పార్టీ కార్యాలయంలోని సిబ్బందిని కూడా తొలగించాలన్న ఉద్దేశ్యంలో పార్టీ అధినాయకత్వం ఉందంటున్నారు.

2019 ఎన్నికల తర్వాత….

తెలంగాణలో 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థిితి మరింత దారుణంగా తయారయింది. ఇక్కడ పార్టీ కార్యవర్గాన్ని నియమించినా పెద్దగా ప్రయోజనం కన్పించడం లేదు. ఉన్న కార్యవర్గానికి కూడా నెలవారీ ఖర్చులను పార్టీయే భరించాల్సి వస్తుంది. దాదాపు నెలకు పది లక్షలకు పైగానే తెలంగాణ పార్టీ కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది భవిష్యత్ లో మరింత భారంగా మారనుందన్న అభిప్రాయం నెలకొంది.

డిపాజిట్లు కూడా దక్కక….

ఇటీవల తెలంగాణలో జరిగిన పట్బభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ పోటీ చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానాంలో టీడీపీ తరుపున పోటీ చేశారు. అయితే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ మూడు జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో తమ పార్టీకి ఓటు బ్యాంకు ఉందని చంద్రబాబు భావించారు. కానీ అది భ్రమే అని తేలిపోయింది.

ఖర్చు తడిసి మోపెడు…..

అదీ కాకుండా ఆ ఎన్నిక ఖర్చు కూడా తడిసిమోపెడంత అయిందట. అంతకు ముందు జరిగిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కనీస పనితీరును కనబర్చలేదు. డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. దీంతో ఇక్కడ టీడీపీ కార్యకలాపాలు అవసరమని చంద్రబాబు సయితం ఒక నిర్ణయానికి వచ్చారు. ఏపీలో ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుండటంతో తెలంగాణలో పార్టీ భారాన్ని క్రమంగా తగ్గించుకోవాలని చూస్తున్నారట. అదీ ఒకరకంగా మంచిదేమో.

Tags:    

Similar News