క్రేన్ తెచ్చినా లేవడం కష్టమేనటగా

తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో జరిగిందే ఇక్కడా పునరావృతమయింది. జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కలసి ఉన్నప్పుడు [more]

Update: 2019-08-29 11:00 GMT

తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో జరిగిందే ఇక్కడా పునరావృతమయింది. జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కలసి ఉన్నప్పుడు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, విడిపోయిన తర్వాత అక్కడ కనుమరుగై పోయాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలుగుదేశం పార్టీ కూడా అందుకు భిన్నం కాదు. తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాదాపుగా లేదనే చెప్పాలి.

చెల్లా చెదురుగా…..

తెలుగు వారి ఆత్మగౌరవంతో నందమూరి తారకరామారావు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ పార్టీని పట్టించుకునే నాధుడే లేరు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉందని చెప్పుకోవడానికి, పేర్ల వెనక జాతీయ పార్టీ అని ముద్ర వేసుకోవడానికి పనికొస్తుంది తప్ప తెలంగాణలో అయితే పార్టీ పాత వాసనలు కూడా ఎక్కడా కన్పించడం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. క్యాడర్ మొత్తం చెల్లాచెదుయింది. నేతలు దాదాపుగా పార్టీని వీడి వెళ్లిపోయారు.

లైట్ గా తీసుకోవడంతో…..

జిల్లాకు జిల్లాలు ఖాళీ అవుతున్నా చంద్రబాబు సయితం లైట్ గా తీసుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ అస్సలు పట్టించుకోవడం మానేశారు. ఆయనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాకుండా చంద్రబాబు ఒక ఉద్యోగిగానే చూస్తున్నారన్న ప్రచారం పార్టీలో అయితే బాగానే ఉంది. అందుకే తెలుగుదేశం తెలంగాణాలో ఖాళీఅయిందన్న వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి.

చరిత్ర ముగిసిపోయింది…..

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి పది హేను నుంచి రెండు స్థానాలకు పడిపోయింది. ఇక పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండటం కూడా తెలుగుదేశం చరిత్రలో తొలిసారి. పార్టీ భవిష్యత్ పై నమ్మకం లేకపోవడంతో ఇప్పటికే క్యాడర్ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లిపోయింది. ఇటీవలే కొందరు తెలుగుదేశం నేతలు బీజేపీలో చేరిపోయారు. ఇక సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కూడా టీడీపీలో చేరనున్నారు. అయినా ఎవరు వెళ్లినా ఆపే నాయకుడు లేరు. అయినా సరే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తానని, త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పడం అర్ధరహితమని, క్యాడర్ ను మభ్యపెట్టడానికేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News