వస్తానంటున్నా ఒప్పుకోరే

కృష్ణా జిల్లా తిరువూరులో టీడీపీ రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. ఇక్క‌డ లోక‌ల్, నాన్‌లోక‌ల్ ర‌గ‌డ భారీ ఎత్తున సాగుతోంది. పైగా ఎన్నిక‌లు ముగిసి ఆరు మాసాలు అవుతున్నా.. [more]

Update: 2019-11-04 06:30 GMT

కృష్ణా జిల్లా తిరువూరులో టీడీపీ రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. ఇక్క‌డ లోక‌ల్, నాన్‌లోక‌ల్ ర‌గ‌డ భారీ ఎత్తున సాగుతోంది. పైగా ఎన్నిక‌లు ముగిసి ఆరు మాసాలు అవుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గం బా ధ్య‌త‌ల‌ను ఎవ‌రికీ అప్ప‌గించక‌పోవ‌డంపైనా కార్య‌క‌ర్త‌లు, మ‌ధ్య‌స్థాయి నేత‌ల్లో తీవ్ర అస‌హ‌నం క‌నిపి స్తోంది. దీంతో అస‌లు పార్టీ త‌ర‌పున చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు ఎలా హాజ‌ర‌వ్వాలి? ఎవ‌రి ప‌క్షాన నిల‌బ‌డాల‌నే చ‌ర్చ కూడా సాగుతుండ‌డంతో అసలు ఏకంగా పార్టీ భ‌విష్య‌త్తుపైనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. తిరువూరు టీడీపీలో స‌రికొత్త ర‌గ‌డ స్టార్ట్ అయ్యింది.

స్వామిదాసు అంటేనే….

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున గ‌డిచిన పాతిక సంవ‌త్స‌రాలుగా న‌ల్ల‌గ‌ట్ల స్వామి దాసు బాధ్య‌త లు చూస్తున్నారు. ఆయ‌న హ‌యాంలో ఇక్క‌డ పార్టీ పుంజుకుంది. ప్ర‌తి మండ‌లంలోనూ పార్టీ పునాదులు గ‌ట్టి ప‌డ్డాయి. టీడీపీ అంటే స్వామి దాసు.. స్వామి దాసు అంటే టీడీపీ అనే రేంజ్‌లో ఇక్క‌డ రాజ‌కీయా లు సాగు తున్నాయి. మొత్తం ఐదు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో స్వామిదాసు రెండు సార్లు విజ‌యం సాధించారు. మిగిలిన మూడుసార్లు ఆయ‌న కొద్దిపాటి తేడాతో ఓట‌మిపాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ కోసం ఆయ న క‌ట్టుబ‌డి ఇక్క‌డ రాజ‌కీయాలు చేస్తున్నారు. 2004 నుంచి ఆయ‌నకు ఇక్క‌డ స్థానిక టీడీపీ నేత‌ల‌తో వ‌చ్చిన తేడా వ‌ల్ల వ‌రుస‌గా ఓడిపోతూ వ‌స్తున్నారు.

జవహర్ కు ఇవ్వడంతో….

అయితే, ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ టికెట్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు అప్ప‌టి ఎమ్మెల్యే మంత్రి జ‌వ‌హ‌ర్‌కు కేటాయించారు. ఆయ‌న పుట్టి, పెరిగిన నియోజ‌క‌వ‌ర్గం ఇదే అయినా..ఉద్యోగ రీత్యా కొవ్వూరులో సెటిల్ అయ్యారు దీంతో ఆయ‌న‌కు పెద్ద‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గంతో అనుబంధం లేదు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ త‌ప్పుకొని.. జ‌వ‌హ‌ర్‌కు టికెట్ కేటాయించారు. అయితే, స్థానిక ప్ర‌జ‌లు , టీడీపీ కార్య‌క‌ర్త‌లు మాత్రం న‌ల్ల‌గ‌ట్ల‌తోనే క‌నెక్ట్ అయ్యారు. ఇక‌, ఎన్నిక‌ల్లో జ‌వ‌హ‌ర్ ఓట‌మి పాల‌య్యారు. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా వైసీపీ రెండోసారి విజ‌యం సాధించింది.

పుంజుకునేదెప్పుడు?

అయితే, అప్ప‌టి నుంచి కూడా టీడీపీ ఇక్క‌డ పుంజుకోవ‌డం లేదు. స్థానికేత‌రుడైన జ‌వ‌హ‌ర్ వెంట తిరిగేందుకు టీడీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద‌గా ముందుకు రావ‌డం లేదు. పైగా చంద్ర‌బాబు ఇస్తున్న పిలుపు మేర‌కు అటు న‌ల్ల గ‌ట్ల‌, ఇటు జ‌వ‌హ‌ర్ కూడా వేర్వేరుగా పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దీంతో కార్య‌క‌ర్త‌లు, దిగువ స్థా యి నాయ‌కులు ఎటు ఏ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలో కూడా అర్ధం కాక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. పైగా నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఎవ‌రికీ అప్ప‌గించ‌క పోవ‌డం కూడా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఇద్దరూ పట్టుబడుతుండటంతో….

జ‌వ‌హ‌ర్ తాను గ‌త ఎన్నిక‌ల్లో బాబు ఆదేశాల మేర‌కు కొవ్వూరు వ‌దులుకుని మ‌రీ ఇక్క‌డ‌కు వ‌చ్చి పోటీ చేసినందున త‌న‌కే బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని చెపుతున్నారు. పైగా ఓడిన మంత్రుల్లో యాక్ట‌వ్‌గా ఉండే అతి త‌క్కువ మందిలో ఆయ‌న కూడా ఒక‌రు. స్వామిదాసు మాత్రం త‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చెప్పార‌ని… ఇప్పుడు వ‌చ్చే ఐదేళ్ల వ‌ర‌కు ఎమ్మెల్సీ వ‌చ్చే ఛాన్స్ లేక‌పోవ‌డంతో త‌న‌కే టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో టీడీపీ కేడ‌ర్ రెండుగా చీలిపోయింది. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు తిరువూరు బాధ్య‌త‌ల‌ను ఎవ‌రో ఒక‌రికి అప్ప‌గిస్తే.. కార్య‌క‌ర్త‌లు పార్టీని బ‌లోపేతం చేసేందుకు రెడీగా ఉన్నారు. మ‌రి బాబు ఎవ‌రికి తిరువూరు టీడీపీ ప‌గ్గాలు ఇస్తారో ? చూడాలి.

Tags:    

Similar News