టీడీపీకి రెండంచెల ముప్పు… నికరంగా మిగిలేవి అవేనా?
తెలుగుదేశానికి రోజులు అట్టే బాగులేవు అని చెప్పాలి. తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వంలో ఉత్తర కోస్తా పార్టీగానే మిగిలిపోయింది అన్నది చేదు నిజం. 23 జిల్లాల టీడీపీని 13 [more]
తెలుగుదేశానికి రోజులు అట్టే బాగులేవు అని చెప్పాలి. తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వంలో ఉత్తర కోస్తా పార్టీగానే మిగిలిపోయింది అన్నది చేదు నిజం. 23 జిల్లాల టీడీపీని 13 [more]
తెలుగుదేశానికి రోజులు అట్టే బాగులేవు అని చెప్పాలి. తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వంలో ఉత్తర కోస్తా పార్టీగానే మిగిలిపోయింది అన్నది చేదు నిజం. 23 జిల్లాల టీడీపీని 13 జిల్లాలకు తెచ్చిన చంద్రబాబు చివరకికి ఏడు జిల్లాలనే నమ్ముకుంటున్నారు. వైసీపీ ఆవిర్భావంతో రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం టీడీపీ నుంచి చేజారాయి. గత 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ ఎక్కువగా ఉత్తర కోస్తా నుంచే సీట్లు గెలుచుకుందన్నది ఈ సందర్భంగా గమనార్హం.
కమలం కొలిమి….
తెలుగుదేశం పార్టీకి ఇపుడు వైసీపీతో పాటు బీజేపీ నుంచి కూడా ముప్పు పొంచి ఉందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టుగా భావిస్తున్న ఉత్తర కోస్తా జిల్లాల్లో వేలూ కాలూ బీజేపీ పెడుతోంది. తమకూ అక్కడ వాటా కావాలని ఆ పార్టీ పట్టుపడుతోంది. ఈ మొత్తం రాజకీయ పోరాటంలో ఎక్కువగా నష్టపోయేది మాత్రం టీడీపీయే అని కచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అధికారంలో వైసీపీ ఉంది. కేంద్రంలో బీజేపీ ఉంది. ఎటూ కాని స్థితిలో ఉన్న టీడీపీ నుంచే వలసలను ప్రోత్సహించడానికి బీజేపీ రెడీ కావడంతో ఉత్తర కోస్తాలో టీడీపీకి ఎన్ని జిల్లాలు గట్టిగా మిగులుతాయి అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.
కత్తి మీద సోము….
ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలకు చెందిన కరడు కట్టిన బీజేపీ నేత సోము వీర్రాజుని ఏరి కోరి మరీ పార్టీ ప్రెసిడెంట్ ని చేసింది అధినాయకత్వం. దాంతో ఆయనకు గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్రాలో బీజేపీని పటిష్టం చేయాల్సిన గురుతర బాధ్యత నెత్తి మీద పడింది. సోము తనను తాను రుజువు చేసుకోవడంతో పాటు సహజంగానే టీడీపీని రాజకీయంగా తగ్గించాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన చూపు ఉత్తరాంధ్రా జిల్లాల మీద పడింది. మూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలకు సోము గేలం వేస్తున్నారు. ఆయన జాతీయ నాయకత్వం తరఫున వారికి గట్టి హామీలే ఇస్తున్నారు. దాంతో ఎటూ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలకు బీజేపీ ఆశాకిరణంగా మారుతోందా అన్న చర్చ అయితే వస్తోంది.
మిగిలేది ఏమిటి….?
ఒక వైపు వైసీపీ ఉత్తరాంధ్రా జిల్లాల మీద ఎప్పటి నుంచో దృష్టి పెట్టింది. ఆ పార్టీ చేతిలో సీమతో సహా ఆరు జిల్లాలు గట్టిగానే ఉన్నాయి. మరో మూడు నాలుగు జిల్లాలు కలుపుకుంటే ఏపీలో మళ్లీ అధికారం గ్యారంటీ అన్నట్లుగా పావులు కదుపుతోంది. అందుకే ఉత్తరాంధ్రా మీద ఫోకస్ గట్టిగా పెట్టింది. విశాఖను పాలనారాజధానిగా చేస్తామని కూడా చెబుతోంది. ఇక బీజేపీ కూడా ఇటు వైపే చూస్తోంది. పవన్ జనసేన తరఫున గోదావరి జిల్లాల మీద గురి పెట్టారు. మొత్తానికి చూసుకుంటే టీడీపీకి నికరంగా మిగిలేవి కృష్ణా, గుంటూరు జిల్లాలేనా అన్నట్లుగా ఏపీలో పొలిటికల్ సీన్ ఉంది. అదే కనుక జరిగితే ఎక్కడి 23 జిల్లాల పార్టీ, మరెక్కడ రెండు జిల్లాల టీడీపీ అన్నట్లుగా సొంత పార్టీ వారే మధన పడే పరిస్థితి ఎదురవుతోంది అంటున్నారు.